పద్మ

 

చాప మిద పడుకున్న పద్మ మూడేళ్ళ కొడుకు అమ్మా అమ్మా ఆకలే అంటూ పద్మ మొహం మిద పెట్టుకున్న చేయిని తీసేస్తూ అడిగాడు .నిద్ర నటిస్తున్న పద్మ ఇక నటించాలేకపోయింది కడుపులో ఏమి లేకుండా నిదరెల పడుతుంది పాపం అప్పటివరకు తానూ పడుకుంటే అయిన కొడుకు ఆకలి అని అడగదు అని అనుకుంది కానీ కడుపు ఊరుకోదు కదా పాపం వాడు మాత్రం ఏమి చేస్తాడు చిన్నోడు ఆకలికి ఆగని వాడు తాను మూడు రోజులనుంచి తిండి లేకున్నా ఉన్నదేదో వాడికి పెడుతూ వచ్చింది

అదైనా తనతో పాటు ఉన్న వాళ్ళు దాచుకున్న డబ్బుతో సరుకులు తీసుకు రావడం వల్ల ఆ మాత్రం తిండి అయిన దొరికింది తిండి అంటూ ఏమి లేదు బియ్యం తెచుకుని దాన్నే ఉడికించి గంజిలా తాగారంతా,మరి వారి దగ్గర ఉన్న డబ్బుతో ఎమోస్తాయి అసలే లాక్ డౌన్ వల్ల రేట్ లు ఎక్కువ చేసారు

అందరు,ఉన్న డబ్బుతో రెండు కోలోల బియ్యాన్ని తెచ్చుకుని వాటినే రెండు వారాలు చేసుకున్నారు,ఇక వారి దగ్గర కూడా డబ్బులు లేవేమో అందరు నిన్నటి నుండి బయటకు వెళ్ళారు ఎక్కడైనా పని దొరుకుతుందేమో అని కానీ పని అని అనుకోగానే పద్మ పెదవుల మిద నిరాశ పూరితమైన నవ్వు వచ్చింది.పని ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది,

అందులోను తాము చేసే పనికి ఎవరిస్తారు ఈ సమయంలో మాకు పని దొరకడమా ఇంకో సమయంలో అయితే ఇప్పటి వరకు బిజీగా ఉండే వాళ్ళు,కనీసం ఈ సమయంలో కూలి పని అయినా దొరకడమే కష్టంగా ఉంది.

అమ్మా ఆకలే అన్న పిల్లాడి మాటలతో ఆలోచనలోంచి బయటకు వచ్చింది పద్మ వాడివైపు ఒకసారి చూసింది.కడుపు ఉబ్బి,కాళ్ళు చేతులు సన్నగా పుల్లలా ఉన్నాయి,హ ఉండక ఏం చేస్తాయి మరి పోషకాహారం కావాలి వాడు ముద్దుగా బొద్దుగా ఉండాలి అంటే కానీ అంత డబ్బు పెట్టి తానూ పండ్లు,పాలు ఎక్కడి నుండి తెగలదు

,వచ్చిన డబ్బు కూడా పోలీసులకు,కిరాయికి,మధ్యలో ఉన్న బ్రోకర్ కు పోగా మిగిలిన వాటితో తను సరుకులు తెచ్చుకోవాలి. రోజు రోజుకు కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి ఒక్కోసారి బిజినెస్ ఉండదు ఉండకున్నా తన దగ్గరి,కి వచ్చే పోలీసులకు,బ్రోకర్ గదికి ఖచ్చితంగా డబ్బు ఇవ్వాల్సి వస్తుంది బ్రోకర్ కు  ఇవ్వాకున్నా పోలీసుకు ఇవ్వాల్సిందే లేదంటే వాడు అసలు ఊరుకోడు లాటితో ఒళ్లంతా కుల్లబోరుస్తాడు.

మళ్ళి దానికో రోజు వృధాగా ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోవాలి అంటే పైసల్ కావాలి ఆ పైసల కోసమే కదా తానూ వ్యాపారం చేసేది,అదే లేకపొయిన తర్వాత డబ్బు ఎవరు ఇస్తారు,ఇప్పుడీ లాక్ డౌన్ లో మొదట్లో చాలా డబ్బు మిగిలేఉంది. కానీ రోజులు గడుస్తున్న కొద్ది అది డబ్బు అయిపోయింది తానేక్కువ ఏం ఖర్చు చేయలేదు తిండికి బాబు మందులకే అయ్యింది. అప్పుడు కూడా ఆ పొలిసు వచ్చి తాను లేవంటున్నా బలవంతంగా జాకెట్లో చెయ్యిపెట్టి మరి లాగి తీసుకున్నాడు వెకిలిగా నవ్వుతూ చివరి వంద రూపాయలు వాడి బొందకు పెట్టుకున్నాడు.

మాలాంటి వాళ్లను పీడించి మరి ఉన్నవి లాక్కుంటారు వెధవలు,బాబు మందులు అయిపోయాయి వాడి గుండెకు రంధ్రం ఉందని చెప్పారు డాక్టర్లు. దేవుడు ఇలాంటివి డబ్బున్న వారికీ ఎందుకు ఇవ్వడో ,అన్ని కష్టలు డబ్బు లేని పేద వారికే ఇస్తాడేమో,తాను ఒకడ్ని నమ్మి వస్తే వాడు ఇందులోకి దించేసి,ముంచేసి వెళ్ళిపోయాడు.వాడి గుర్తుగా ఈ పిల్లాడు మాత్రం మిగిలాడు.మంచి పనులు చేద్దామంటే ఎవరు చేయనివ్వలేదు దానితో ఇందులోకి దిగాల్సి వచ్చింది తప్పని స్థితిలోవాడిని వదిలేయ్యలేక ఇలా వ్యాపారం చేస్తూ బతుకుతుంది…

అమ్మా ఆకలే అరిచాడు పిల్లాడు,ఇక తప్పదు అన్నట్టుగా లేచి,చిర సరి చేసుకుని అద్దం దగ్గరికి వెళ్ళింది తూలుతూ మరి మూడు రోజుల నుండి అన్నం లేదు తులకుంటే ఏమవుతుంది మరి,అద్దం లో చూసుకుంటూ జడ వేసుకోసాగింది లోతుకుపోయినకళ్ళు,నిరసంగ వాలిపోతున్నాయి తిండి లేకనో మరి ఇలా అయిపోయో కానీ శరిరం శుష్కిoచింది.ఓపీక లేకున్నా గబగబా జడ అల్లుకోసాగింది.

ఎక్కడికే తయ్యరవుతున్నావు అంటూ వచ్చింది స్వప్న పద్మను ఎగాదిగా చూస్తూ,ఈ వ్యాపారం లో ఇదో బాధ తమకు రాని గిరాకి ఇంకొకరికి వచ్చిందని కుళ్ళు కుంటారు చాలా వరకు పద్మ ఏమిలేదక్కా పిల్లాడు ఆకలి అంటున్నాడు కాస్త అలా వెళ్ళి ఏదైనా దొరుకుతుందేమో చూస్తా అంది,హ చూస్తావ్ చూస్తావ్ మాక్ దిక్కు లేక ఇదిగో ఇలా వచ్చాం నీకు ఎవడోస్తాడే అంటూ పద్మ బుగ్గలు పొడిచింది కసిగా

ఆమే నొక్కుడు కు బుగ్గలు మంట పెట్టాయి అయినా నవ్వుతూనే చూస్తా అక్కా మికే దొరకలేదంటే ఇక నేనెంత అయినా ఇంట్లో ఉంటె పిల్లాడు ఆకలి అని అoటున్నాడు అలా బయటకు వెళ్తే అయినా  కొంచం వేరుగా ఉంటుంది అని అంది.మరి గొడవ పెట్టుకునే ఓపిక తనకు లేదు పైగా ఇది ఆమె తనకు ఉండడానికి చోటు ఇచ్చంది కాబట్టి ఏమి అనలేక పిచ్చి నవ్వు నవ్వి,అక్కా కాస్త బాబుని చూడు అంది.

హ నాకు ఇంకేం పని మహారాణి గారి ఆర్డర్ వేసాక చూడకుండా ఉంటానా అంది స్వప్న మూతి తిప్పుతూ ఆమె మాటలకూ కొంచం బాధ అనిపించినా తప్పదు కాబట్టి తన బాబుని దగ్గరికి తీసుకుని ముద్దుపెట్టుకుని నేను ఇప్పుడే వస్తా నాన్న జాగ్రత్త అని చెప్పి రెండు అడుగులు వేసింది.ముందుకు ఇదిగో వెళ్తే వెళ్ళావు కానీ ఆ వైరస్ ని వెంట తీసుకుని రాకు అంది స్వప్న అలాగే అక్కా అని బయటకు నడిచింది ఆహారం కోసం వెళ్ళే తల్లి పక్షిని చూస్తూ నిలబడి పోయాడు పిల్ల పక్షి.

మూడు నెలల తర్వాత బయటకు వస్తున్న పద్మకు అంతా కొత్తగా,బయట ఎవరు లేరు అంతా నిర్మానుష్యంగా ఉంది కార్లు బస్సులు ఏవి కనిపించడం లేదు,ఎప్పుడూ రణగోణధ్వనులతో హడావుడిగా ఉండే రోడ్డు ఇప్పుడు బోసి పోయినట్టుగా ఉంది.ట్రాఫిక్ పోలీసులు,బస్సు డ్రైవర్లు,కారుహరన్స్ తో,బైక్ వారి తిట్లతో పండ్లు,కూరగాయల వారి కేకలతో హడావుడి ఒక జాతరలా ఉండే రోడ్డు అంతా మూగ బొయింది.అలా మొత్తం చూస్తూ మెల్లిగా నడుస్తూ వెళ్తుంది. ఓ అమ్మా ఓ అమ్మా ఏడికి పోతున్నవు  రోడ్ ని తాత జగిరి అయినట్టు ఓ పోతున్నావు మూతికి మాస్కు పెట్టుకోకుండా ఓ అమ్మా అంటూ ఒక పొలిసు విజిల్ వేసేసరికి టక్కున కొంగు మూతికి కట్టుకుంది పద్మ అమ్మో మళ్ళా పొలిసు కళ్ళలో పడితే ఇంకేమైనా ఉందా నా ప్రాణాలు తీస్తాడు.

అని అనుకుని సర్ పిల్లగానికి పాలడబ్బా కోసం వచ్చిన సర్ అంది పద్మ.ఓ గట్లన సరే పో పో జల్ది మా సర్ సూస్తే మళ్ళి ఫైన్ వేస్తాడు అని పక్కకు వెళ్ళాడు పొలిసు.అమ్మయ్య అతను ఇక్కడి వాడు కాదు ఇక్కడివాళ్ళు అయితే డబ్బు తీసుకోకుండా వదలరు పైగా పిల్లలు అనేసరికి వాళ్ళ పిల్లలు గుర్తుకు వచ్చారు కాబోలు అని అనుకుంటూ కొంగుని ఇంకా బిగించి కట్టుకుంది మూతి చుట్టూ గబగబా నడుస్తూ పక్క సందులోకి తిరిగింది పద్మ. 

ఒక్క షాప్ కూడా తీసి లేదు మధ్యానం పన్నెండు దాటుతుంది. ఉన్న ఇరవై రూపాయలతో పిల్లాడికి పాలపొడి డబ్బా ఒకటి కొని చేతిలో పట్టుకుని నడవసాగింది మళ్ళి ఎవరైనా దొరుకుతారేమో అని కానీ ఎక్కడా ఏ అలికిడి కనిపించడం లేదు.అలా నాలుగు గల్లిలు తిరిగింది బిజినెస్ కోసం కానీ ఏది దొరకలేదు.అలా తిరిగి తిరిగి కళ్ళు తిరుగుతున్నాయి,నీరసంగా అడుగులు పడుతున్నాయి,

మూడు రోజుల నుండి కడుపులో తిండి లేక ,నీళ్ళతో నిండిన కడుపు గడగడ అంటుంది.ఆ నీళ్ళు కూడా ఒక రెండుగంటల నుండి తిరగడం వల్ల దప్పికతో నాలుక పిడచకట్టుకు పోతుంది.పెదవులు ఎండిపోతున్నాయి,నాలుక తో పెదవులను తడుపుకుంది,ఎక్కడైనా కూర్చుందాం అని చూసింది కాసేపు కానీ ఎక్కడా ఖాళి కనిపించలేదు,అలాగే ఇసురోమంటూ తిరగసాగిoది. ఈ రోజు ఎలాగైనా డబ్బు సంపాదించి తీసుకునివెళ్ళాలి అనే దృడమయిన నిర్ణయం తో శక్తి సన్నగిల్లుతున్నా బలవంతంగా లేని ఓపిక తెచ్చుకుని,ముందుకు  వెళ్ళసాగింది.

అలా వెళ్తున్న పద్మకు దూరంగా చెత్త ఏరుకునే ఒకడు వస్తు కనిపించాడు.పద్మ మొహం లో ఆశ కిరణాలూ మెదిలాయి అతన్ని చూడగానే ఇలాంటి వాళ్ళు వందనో యాబై ఇస్తారు.అయినా పర్లేదు తనకు ఆ వంద కూడా ముఖ్యమే కదా అనుకుని అతని ముందుకు నవ్వుతూ పైటని జార్చి వెళ్ళసాగింది.వాడు ఆమె నడకను,నవ్వును చూసి అతను కూడా నవ్వుతు దగ్గరికి వచ్చి ఎంటే గిరాకి లేదా అని అడిగాడు

హ ఏం గిరాకి లే నువ్వే ఈ రోజు నా గిరాకి అంది హొయలు పోతూ ఓ అయితే నా పంట పండినట్టేనా ఈ రోజు అని పద పద అనగానే ఎక్కడికి అని అంది.ఎక్కడికి ఎంటే ఆ డబ్బా చాటుకు పద ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత నేను ఎందుకు ఆగుతాను అంటూ పక్కనే చెత్త డబ్బా చాటుకు లాక్కేల్లాడు ఆత్రంగా..ముందే చెత్త ఏరుకునే వాడు వాడికి పండగరోజు పంచభక్షపరమాన్నాలు దొరికినట్లు పొంగిపోతూన్నాడు,

మాములుగా అయితే పద్మలాంటి వాళ్ళు వాడిని చూడడానికే చిరాకు పడతారు అసలు బాగుండడు కనీసం శుబ్రంగా ఉండాలని కూడా ఆలోచించడు. మురికి బట్టలు గార పళ్ళు,ఎప్పుడూ మందు వాసనా వచ్చే కంపు గొట్టే నోరుతో కళ్ళలో ఉసులు,స్నానం చేయకుండా ఎన్నో ఏళ్ళు అయినట్టుగా అనిపించే శరీరం,అట్టలు కట్టిన శరీరంతో అసలు చూడాలి అంటేనే అసహ్యాo కలిగే విధంగా ఉన్న వాడితో విధి లేక బాబు మందుల కోసం,వాడి చిన్ని కడుపు నింపడానికి ఇలా చెత్తలో,అక్కడ అన్ని తిని పారేసిన ఆకులూ,కవర్లు కుక్కల మలం ముత్రదులా కంపుతో ఉంది.

అది చూడగానే పద్మకు కడుపులో దేవినట్టుగా అయ్యి నిన్నటి నీళ్ళు గొంతులోకి వచ్చాయి,ఇక్కడ వద్దు మా ఇంటికి వెళ్దాం అంది నోట్లో ఉమ్మిని ఉసి ఆ మీ ఇంటిదాకా ఎవడు అగుతాడే,దావే లం అని కింద ఉన్న కవర్లన్ని ఒక్క దగ్గరికి చేర్చి పద్మని గుంజి అక్కడ కూర్చోబెట్టాడు,రావే అని అంటూ ఒక్కోటి విప్పుతున్నాడు ఏయ్ ఏంటి ఇది అన్ని విప్పకు అని అతన్ని వారించబోయింది పద్మ.

ఇంతదాకా వచ్చి ఇప్పుడు వద్దు అంటే ఎట్లనే అని ఆమే చేతులని తోసేసి,పశుబలంతో ఆమెని ఆక్రమించుకున్నాడు,కడుపులో ఆకలి,కళ్ళలో నీరసం ఏమి చేయలేని అశక్తత,ఈ సమయం లో పనిలేక బిజినెస్ పడిపోయి వందరూపాయల కోసం కన్నకొడుకు కడుపు నింపడానికి తనకు ఇష్టం లేకపోయినా,విధిలేని పరిస్థితిలో చెత్త ఏరుకునే వ్యక్తి కి లొంగింది.

ఆమె కళ్ళు ఆకాశాన్ని చూస్తున్నాయి,శరీరం వాడి ఊపులకు కదులుతుంది ఆమె మనసు మొద్దు బారింది తిండి లేక నీరసం ఆవరించిన శరీరం మనసు రెండు స్పందించడం ఎపుడో మానేశాయి,పది నిముషాలు వాడి వేడి చల్లారిoది. లేచి కుర్చుని బీడి ముట్టించాడు,పద్మ లేవబోయింది వాడు ఆపేసాడు తాగుతున్న బీడిని ఆమె వక్షాల మిద ఆనించాడు అబ్బా అంది పద్మ ముయ్యే అని దాన్ని మళ్ళి ఇంకో చోట పెట్టాడు.

ఆమె కళ్ళలో నుండి నీళ్ళు కింద కవర్ల మిద పడిపోతున్నాయి.ఆమెని అలాగే ఉంచి కాళ్ళ మిద కాళ్ళు వేసి,చేతులతో చేతులని తన పశుబలంతో నొక్కి పట్టి అందిన చోటల్లా బిడి తో కాలుస్తూనే ఉన్నాడు వెకిలి నవ్వు నవ్వుతూ,ఆమె అశక్తతని ఆసరాగా చేసుకుని ఆమెతో అలా గంటకు పైగా ఆడుకున్నాడు వాడు ఆ మృగం,ఆమె వాటిని కూడా సహిస్తూoది.వాడు ఇచ్చే డబ్బుకోసం బాబు మందులకోసం,కన్న కొడుకుని బతికిoచుకోవడానికి వాడెంత హింసించినా అలాగే పడుకుని ఉంది.

అమెకు ఇలాంటివి ఇంతకు ముందు అనుభవం ఉన్నా,ఇప్పుడున్న పరిస్థితి లో చాలా బాధ పెడుతున్నా ఒర్చుకోసాగింది.అలా గంట వాడు ఆమె మనసుని,శరీరాన్నిచిద్రంచేసాక,వాడికి విసుగొచ్చి ఇక మానేసి మళ్ళి ఆమె శరీరాన్ని ఆక్రమించుకున్నాడు. పద్మ ఆలోచిస్తుంది..

తన ఇంటి దగ్గర తన కొడుకు ఏం చేస్తున్నాడో ?ఆకలి అంటూ ఏడుస్తూ ఉంటాడా?ఎవరైనా దయతలచి ఏమైనా పెట్టి ఉంటారా?అయినా తన పిచ్చి కానీ ఎవరు మాత్రం పెడతారు వాడికి? వారికే పనుల్లేక పస్తులు ఉన్నారు,ఎవరికైనా దొరికినా ముందు వారి కడుపు నింపుకోవాలని చూస్తారు తప్పా తన పిల్లాడిని ఎవరు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకుంటారు?ఎవరికీ పట్టింపు ఉంటుంది.

ఈ లాక్ డౌన్ సమయంలో వారి కడుపులు నిండడమే గగనం అలాంటిది ఒక్క మనిషి వాడు చిన్నోడా,పెద్దోడా అనేది కాదు కడుపు నింపాలి అంటే కష్టమే కాబట్టి ఎవరు ఇచ్చి ఉండరు,వాడు ఏడ్చి,ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయి ఉంటాడు,అని ఆలోచిస్తూనే,ఒంటి మిద బరువు లేకపోవడం గమనించి గబుక్కున లేచి చుట్టూ చూసింది చెత్త వాడి కోసం వాడు ప్యాంటు జిప్పు పెట్టుకుంటూ విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

గబుక్కున లేచి చీర జారిపోతున్నా వాడికోసం పరుగెత్తింది రేయి అగరా అగరా అంటూ పరుగెత్తి వెళ్ళి వాడి ముందు నిలుచుంది ఒగరుస్తూ.నా పైసల్ ఇయ్యకుండా పోతున్నావేంటి అంది నీకు పైసలా నీకెందుకు ఇయ్యాలె,నువ్వు నాకు ఎదురు ఇయ్యాలా పైసల్ నీకు కావురం వచ్చి నాదగ్గరికి వచ్చిందేకాక ఇప్పుడు నన్నే అడుగుతావా చల్ ఏసే పోవే దొమ్మరి ముండా అని ముందుకు సాగిపోతున్నాడు వాడు.

వాడి తెలివికి ఆశ్చర్య పోయినా,కళ్ళ ముందు కొడుకు కదిలే సరికి అన్ని మర్చిపోయి.వాడి ముందుకు వెళ్ళి నికు దండం పెడతా అవతల బాబు ఆకలి తో ఉన్నాడు నాపైసల్ నాకుఇయ్యి అని రెండు చేతులు జోడించింది.ఓసోస్ ఆపెహేనీ సోది పురాణం పో,పో అని ముందుకు కదిలాడు.

వాడు ఇచ్చే డబ్బుతో పిల్లాడికి కడుపు నిండా తిండి పెట్టాలనుకున్న తన ఆశకు,కోరికలకు వాడిని నమ్మి తన శరీరాన్ని ఇచ్చినందుకు,వాడు తనని వాడుకుని ఇలా డబ్బు ఇవ్వకుండా వెళ్లేసరికి ఆమె కోపం కట్టలు తెంచుకుంది,ఆమె మనసు కుతకుతలాడింది కొడుకు మొహం కళ్ళ ముందు కదలాడి, అమ్మా ఆకలే అని పిలిచినట్టుగా అయ్యింది,ఆమె వాడి దగ్గర నుండి డబ్బు ని ఎలాగైనా తిసుకోవాలనుకుని అరేయి ఉండరా ఆగరా నా డబ్బు ఇవ్వరా అంటూ వాడి వెంటపడి షర్టుని పట్టుకుని లాగింది.

ఆమె లాగిన షర్టు పర్రుమని చిరగడంతో వాడి కోపం కట్టలు తెచ్చుకుని లంజ ముండా నా అంగి చిoపుతావా అని ఆమెజుట్టు పట్ట్టుకున్నాడు.ఇద్దరు ఒకర్ని ఒకరు పట్టుకుని పెనుగులాడసాగారు,అమె వాడి షర్టు జేబుల్లో వెతకసాగింది.వాడు బండబూతులు తిడుతూనే ఆమె జుట్టు వదలకుండా పట్టుకుని లాగసాగాడు.

అది నొప్పి పెడుతున్నా ఆమె లెక్క చేయక జేబులన్నీ వెతుకుతుంది వాడు ఆమెని గుంజుతు గుంజుతు ఒక పెద్ద మోరి వద్దకు తీసుకుని వెళ్ళాడు,ఇద్దరి పెనుగులాటలో ఆమె పిచ్చిబలంతో వాడిని కింద పారవేసింది,ఇద్దరు రోడ్ మిద దొర్లుతూ కొట్టుకుంటున్నారు.వాడిబలం ముందు ఆమెబలం సరిపోవడం లేదు.అయినా కొడుకు కోసం పెనుగు లాడసాగింది.అలా ఇద్దరు  పెనుగులాడుతూ పెనుగులాడుతూ దొర్లుకుంటూ వెళ్ళే క్రమంలో వాడు కింద పడిపోయాడు.

ఆమె వాడి షర్ట్ జేబులో ఒక చెయ్యి పెట్టి ఇంకో చెయ్యి తో వాడి గొంతు నొక్కిపట్టింది, అలా పడుతున్నప్పుడు ఆమె డబ్బు గురించి ఆకలి గురించి వాడి నుండి డబ్బులు తీసుకోవాలని తప్ప తానేమి చేస్తున్నానో అనే ఆలోచన ఆమెకి లేదు అసలు తానూ రోడ్ మిద ఉన్న చిర జారిపోతుంది.

వాడితో పెనుగులాడుతున్నా అవెవి ఆమెకి గుర్తు రాలేదా క్షణంలో,తన కొడుకు ఆకలి వాడి జబ్బు ,మందులే మెదులుతున్నాయి ఆమె కళ్ళలో,ఆమె మనసులో తన కొడుకు అలలితో చూసే చూపులే కదులుతున్నాయి,అన్నం లేక మూడురోజుల నుండి నీళ్ళ తో బతుకుతున్న ఆమె ఒంట్లో అంత శక్తి ఎలా వచ్చిందో కానీ వాడి ముందు ఓడిపోతున్నా క్షణం లో ఆమె ఒక్కసారిగా ఒరేయి అని అరుస్తూ మెడ పట్టి పిసుకుతూ నా డబ్బు నాకు ఇవ్వరా ,ఇవ్వరా అని అరుస్తూ ఒక ఉన్మాదిలా మారి,వాడి గొంతును పట్టుకుని వాడి జేబులో వెతకసాగింది..

అలా వెతుకుతున్నప్పుడు వాడి జేబులో ఆమెకి డబ్బులు దొరికాయి అవి తీసుకుని నా డబ్బు ,నా డబ్బు అని అంటూ ఆనందంగా ఒక పిచ్చిదానిలా తనలో తానే మాట్లాడుకుంటూ,వాడి వైపు చూసింది కానీ అప్పటికే వాడు గుడ్లు తెలేసాడు ఆమె డబ్బులాక్కునే క్రమంలో వాడి ప్రాణాలు పోయాయి. కానీ ఆమె అది కావాలని చేయలేదు ఆమె వాడిని అలా చూస్తూనే నిలబడింది.ఇంతలో పొలిసువ్యాను సైరెనువేసుకుంటూ ఆవైపుగావచ్చింది.

ఆమె అక్కడి నుండి పారిపోవాలని కూడా అనుకోలేదు కనీసం ఆఆలోచనకూడారాలేదుఆమెకాక్షణంలో, పొలిసువ్యాను ఆమె ముందు ఆగింది,ఆమెను,వాడిని చూసారు దిగిన పోలీసులు ఇంతలో పద్మ కొడుకు ఏడుస్తూ ఉంటె పదమని వెతుకుతూ వచ్చిన స్వప్న అది చూసి పరుగెత్తుకుంటూ వచ్చింది.ఎంటే పద్మఇది అయ్యో నువ్వు చంపడం ఏంటి అని అడిగిన పద్మ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదు.

అలాగే నిశ్చలంగా నిలబడింది అమ్మా అనే పిల్లాడి ఏడుపు కూడా ఆమెకు వినపడడం లేదు అంబులెన్సు వచ్చి చచ్చిన వాడిని తీసుకుని వెళ్ళే దాక అక్కడే ఉన్నా పోలీసులు అంబులెన్సు వెళ్ళి పోయాక  లేడి కానిస్టేబుల్ వచ్చి పద్మని తీసుకుని వెళ్ళ బొయింది,

పద్మ ఆమె వైపు ఒకసారి చూసి పక్కనే ఉన్న స్వప్న చంకలో ఉన్న పిల్లాడిని చటుక్కున లాక్కుని ఆమెతో పాటుగా నడిచింది వాడు ఎందుకె ఇలా ఇవ్వు అని అంది స్వప్నపద్మ ఆగి అక్కా నేను జైలుకి పొతే వీడికి తిండి ఎలావాడిని ఎవరుచూస్తారు అసలు వాడిని డబ్బు కోసం చంపేస్తా అని అనుకోలేదు.

నా శరీరాన్ని వాడుకుని డబ్బు ఇవ్వక పోయేసరికి నేను డబ్బు కోసం వాడిని పట్ట్టుకున్నావాడు నాశరీరంతో ఆడుకున్నాడు కానీ దానికి తగిన డబ్బు ఇవ్వమని అంటే మాత్రం ఇవ్వకుండా మోజు పడ్డావా అని అడిగాడు,వాడు చచ్చాక ఇక్కడ నుండి నేను పారిపోవాలి కానీ నాకు ఒకఆలోచన వచ్చింది.వాడిని చంపిన అంటే నాకు జైలు శిక్ష పడుతుంది,అక్కడ నాకు తిండి దొరుకుతుంది.

ఉండడానికి చోటు దొరుకుతుంది.డబ్బు ఖర్చు లేకుండా నా అవసరాలు అన్ని తీరతాయి,ఒక వేళ  నాతో పాటు నా కొడుకుని కూడా తీసుకుని వెళ్తే వాడి చిన్ని బోజ్జని కూడా నింపవచ్చు కదా అందుకే అది నేను అనుకోకుండా చేసినా,కావాలని చేయక పోయిన అవన్నీ ఎవరికీ పట్టవు కారణాలు ఎవరు అడగరు కాబట్టి నేను పారిపోకుండా ఇక్కడే నిలబడ్డాను నేను తప్పు చేయలేదక్కా నా కొడుకు కడుపు నింపడం కోసమే నేను ఇలా చేసాను నేను చేసింది తప్పా అక్కా అని అంటున్న పద్మను గట్టిగ కౌగిలించుకుంది.

స్వప్న ఆమె తన కడుపు నింపుకోవడానికి తన కొడుకు పొట్టని నింపడానికి చేస్తున్న ప్రయత్నం మంచిది కాకపోవచ్చు ఆమెకు శిక్ష పడకపోవచ్చు కానీ తీసుకుని వెళ్ళిన రెండు రోజులైనా ఆమెకు కడుపునిండా తిండి దొరుకుతుంది,ఆమె కొడుక్కి కూడా తిండి దొరుకుతుంది అనే ఆలోచనే స్వప్న మనసులో ఒక తృప్తిని మిగిల్చింది.

మగాడిని నమ్మి మోసపోయిన ఆడవాళ్లు కొoదరు విధి లేని స్థితిలో వేశ్యా వృతి లోకి దిగుతారు అలాoటివారు ఈ కరోనా సమయంలో పనిలేక,గిరాకి లేక,తినడానికి తిండిలేక,అడుక్కునేoదుకు కూడా బయట జనాలు తిరగని స్థితిలో అభిమానం చంపుకుని,చెత్త ఏరుకునే వాడు డబ్బు ఇస్తాడేమో తన పిల్లాడి కడుపు నింపాలని అనుకున్న ఒక వేశ్య కాదు పద్మ చివరికి జైలుకి వెళ్తే తామిద్దరి కడుపు నిండుతుంది. అని జైలుకి వెళ్ళడానికి సిద్దపడింది మరి ఆమె అనుకున్నట్టు జరిగిందా అంటే ఏమో అది భగవంతుడికే తెలియాలి.

ఇలాంటి పద్మలు ఈదేశంలో ఎంతమందో,వారికీ ఈ కథ అంకితం…  

Normal
0

false
false
false

EN-US
X-NONE
HI

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-fareast-font-family:”Times New Roman”;
mso-fareast-theme-font:minor-fareast;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *