పరంజ్యోతులు నా అక్షరాలు,,,,,,,,,!!

ఇంటి ముంగిలిలో ముదిత
వెలిగిస్తూ అలంకరించె దివ్వెలు
ఆ దీపం జ్యోతులు పరమాత్ముని
వెలుగుల పరంజ్యోతులు,,,,,!!
ఇంటిలో దివ్య వసంతాలు
పూయించే దివ్యస్వరూపులు
రంజిళ్ళు కాంతుల్లో ఇంట్లో
కష్టాల చీకట్లను పారద్రోలు
కారుమబ్బుల నిశీధి జీవితాల్లో
ఇంటి ముందర కాంతుల దివ్వెలు
గుండె గూడులోని గుబులు
జిలుగు వెలుగుల్లో అంతర్థానమౌను
పరమాత్ముని దివ్యమంగళ శోభలో
ఆత్మలోని అమృతత్వం మేల్కొను
గుప్తంగా గుండెల్లోని దుఃఖం
మటుమాయం దివ్యాక్షర జ్యోతుల్లో
హృదయం నిర్మలమౌను
చీకటి వెలుగుల బ్రతుకు పుటల్లో
అమావాస్యలో వెలుగుల వర్షము
పూసే పూవులు దివ్యచమక్కులు
నక్షత్రాలన్నీ ఇంటి ముందరలో
ఇల్లాలు వరుసలో అలంకరించినట్లు
ప్రతిదివ్వె ఉజ్వలంగా ప్రజ్వరిల్లు
ఇంట్లోంచి పరుగులుతీస్తూ దరిద్రదేవత
లక్షీ సరస్వతులు అరుదెంచెరిదిగో
లక్షల అక్షరాలు ఐశ్వర్యాలు
వేణువులైన గానంలో ఇంటిలో నెలవై
పూజింప తరమా ఈ జీవితానికి !!
కరిగిపోతున్న ఎదమాటున కన్నీళ్ళు
వేలవత్సరాల చీకట్లు మటుమాయం
నీవు వెలిగించిన దీపంజ్యోతులు
వసంత సౌరభాలు ఇంట్లో గుభాళింపులు
అనంత విశ్వంలో నేనున్నాను
అంటూ అరుదెంచె నిజస్వరూపంలో
దివ్యత్వం దివి నుండి భువికి
కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతులలో
అదిగదిగో ఊరు ఊరంతా
వెలుగుల తోరణాల జ్యోతులు
రంగరించి నింపుకో హృదయంలో
ఆత్మానందం బ్రహ్మానందం,,,,,,,!!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *