పరిచయం ఒక వేదన

 

హాయ్ అండి నా పేరు అనురాధ మాది ఒక మున్సిపాలిటి గల నగరం,మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు,నాకు నలుగురు అన్నయ్యలు,ఒక తమ్ముడు ఉన్నారు,మా నాన్నగారు చనిపోయే సరికి అన్నయ్యలు వయసుకు రావడం తో నాన్న జాబు అన్నకు వచ్చింది,మేము కాస్త నిలదొక్కుకున్న తర్వాత  కొన్ని రోజులకు అన్నయ్య పెళ్లి జరిగింది.

తర్వాత మిగతా అన్నయ్యల పెళ్ళిళ్ళు,వదినెల రాక తో నా జీవితం చాలా ఆనందంగా సాగింది.నలుగురు అన్నయ్యల ముద్దుల చెల్లి ని కావడం తో నేను ఏది అడిగినా కాదు అనకుండా,లేదు అనకుండా,తెచ్చి ఇచ్చేవారు క్షణాలలో,మా వదినెలు కూడా నన్ను బాగా చూసుకునే వారు ,వారు ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు ,అయితే నేను కొంచం మొండి దాన్ని లెండి ,ఏదైనా నాకు కావాల్సింది నాకు దొరక్క పొతే నేను అపర కాళిగా అవుతాను ,దాన్ని సాధించే వరకు నిద్రపోను,నేను అన్నింట్లోను ముందుగానే ఉంటాను.

నేను ఎవరి జోలికి వెళ్లను ,నా పరిధి ఎదో దాంట్లోనే ఉంటాను,నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం వదిలి పెట్టను,నాకు దైర్యం చాలా ఎక్కువ అని మా అమ్మ అంటూ ఉంటుంది.నిజమే నాకు దైర్యం ,తెగింపు ఎక్కువే నాకు,అందుకే నేను హాస్టల్ లో ఉంటా అని అన్నప్పుడు మా అన్నయ్యలు అబ్యంతరం పెట్టకుండా నన్ను పంపించారు .ఎందుకంటే వారికీ అను అంటే ఒక నమ్మకం,ఒక దైర్యం,ఒక నిశ్చింత అదే వారు నాకు ఇచ్చే విలువైన ఆభరణం అని నేను అనుకుంటా ఇలాంటి నా జీవితం లోకి వచ్చాడు నా ప్రియమైన శత్రువు రమేష్.

అసలు రమేష్ పరిచయం అవ్వడమే నాకు విచిత్రంగా జరిగింది.మేము కాలేజి నుండి ఎక్సు కర్షన్ వెళ్ళినప్పుడు అక్కడ ఫోటోలు దిగడానికి ఫోన్ లు ఉన్నా ,మాకు జ్ఞాపకంగా మిగలాలి అని నేనే పట్టుపట్టి మరి కెమెరా తీసుకుని వెళ్ళాము.అయితే అందరం దిగుతున్నాపుడు ఎవరో ఒకరు తియ్యాలి కదా ఫోటోలు కాబట్టి అక్కడ కూర్చున్న ఒక అబ్బాయిని పిలిచి ఫోటోలు తీయమని అడిగాము.

దానికా అబ్బాయి నేను నీకేమైనా పనివానిలా కనపడుతున్నానా,నేను ఇక్కడికి కాలక్షేపనికే వచ్చాను,మీకు నేను తీస్తే నాకెవరు తీస్తారు అని అన్నాడు పొగరుగా నాకు పోగరెందుకో నచ్చలేదు మేము బతిమాలితే ఇలా అంటాడా అని అనుకుని,తిరిగి అతన్ని బాగా తేరిపార చూసాను అయితే అతని చేతిలో నాకు  కీస్ కనిపించాయి.నేను వాటిని గబుక్కున లాక్కున్నా,అతను ఎదో అనబోయేంతలో నేనే వాటిని జాకిట్ లో వేసుకుని,ఏంటి బాబు ఇప్పుడు తీస్తావా లేదా ఫోటోలు అని అడిగా,దెబ్బకు దిగివచ్చి అమ్మా తల్లి నా బాగ్ ,నా వస్తువులు అన్ని గది లోనే ఉన్నాయి.

మేడం ప్లేజ్ అని అంటూ బతిమాలడం మొదలు పెట్టె సరికి నాకు నవ్వు వచ్చి ,మరి ఇదే తెలివి అప్పుడు ఉంటె బాగుండేది కదా అని అంటూ కెమరా చేతికి ఇచ్చాను. అతను ఇక తప్పదు అన్నట్టుగా కెమెరా తీసుకుని,మాకు ఫోటోలు తీయడం మొదలు పెట్టాడు.పాపం అతన్ని మేము ఎంత ఆడుకోవలో అంతా గా ఆడుకున్నాము,మేము ఎటు వెళ్తే అటూ,ఎక్కడ వీలైతే అక్కడ ,మాకు నచ్చిన దగ్గర బండి ఆపేసి ఫోటోలు దిగుతూ ఉన్నాము.

ఇక మా దగ్గర ఉన్న రీలు కూడా అయిపోయింది.అయితే మాకు బాగా ఆకలి వేసి,ఒక దగ్గర ఆపేసి ఎవరికీ కావలసినవి వాళ్ళు తెప్పించుకుని తింటున్నాం.మాకు దూరంగా కుర్చుని శూన్యం లోకి చూస్తూ కూర్చున్న అబ్బాయి కనిపించదు నాకు అతను ఏమి తినక పోవడం చూసి నా చేతి లో ఉన్న టిఫిన్ ప్లేట్ తో అతని దగ్గరగా వెళ్లాను,నన్ను చూసి కూడా అతను మౌనంగా ఇంకో పక్కకు తిరిగి కూర్చున్నాడు.

అతను అలిగాడు అని గ్రహించిన నేను అతని దగ్గరికి వెళ్ళి సారీ అండి ,మీకు చాలా ఇబ్బంది కలిగించాను నన్ను క్షమించండి కానీ ఇంత దురం వచ్చి ఫోటోలు లేకపోతె బాగుండదు కదా అందుకే మీ గది కీస్ తిసుకోవాల్సి వచ్చింది అని అంటూ ,ఇదిగో తినండి మార్నింగ్ నుండి మీరేమి తినట్టు లేదు అని అన్నాను.

అతను నాకు ఆకలి లేదు అని మొఖం తిప్పుకున్నాడు,నాకు కోపం వచ్చేసి అక్కడే కింద కూర్చుంటూ ఇప్పుడు తింటారా తినరా అని అన్నాను,దానికి అతను అయ్యో అలా కింద కూర్చోవడం ఏంటి ,ప్లీజ్ అండి లేవండి అని అన్నాడు,మీరు తింటేనే నేను ఇక్కడ నుండి లేచేది అని అన్నా కోపం తో,సరే తింటాను చుడండి అందరూ మనల్నే చూస్తున్నారు అన్నాడు బతిమలుతున్నాట్టుగా

సరే అని లేచి అతనికి ప్లేట్ ఇచ్చాను,తిరిగి వెళ్ళి ఇంకో ప్లేట్ లో ఇంకేదో టిఫిన్ తెచ్చి,మళ్ళి అతనికే వేసాను,బాగా ఆకలి మిద ఉన్నాడేమో బాగానే తిన్నాడు పాపం అనిపించింది,అంతా తిన్నాక మీరు మొండి అని కితాబు ఇచ్చాడు ,నేను గది కీస్  తీసి ఇచ్చాను, తర్వాత అతను ఎక్కడ,ఏంటి అనే విషయాలు మాట్లాడుకున్నాం,మేము స్నేహితుల్లాగా అయ్యాము,ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చుకుని,అక్కడ నుండి విడి పోయాము..   

తర్వాత  తిరిగి వచ్చాక  కూడా తనే ముందుగా ఫోన్ చేసి మాట్లాడాడు.అలా మా మధ్య మాటలు మొదలయ్యాయి ఇద్దరం ఒకే వయస్సు ,భావాలూ అన్ని కలిసాయి.మా మాటలు కోటలు దాటి,బయట తిరిగే స్థాయికి వచ్చాయి.నేను అతన్ని బాగా గమనిoచాను,తను నన్ను ఇష్ట పడుతున్నట్టుగా నాకు అనిపించింది.

దాంతో నేను కొంచం అతన్ని దూరంగా పెట్టాలి అని అనుకున్నా,అలాగే అతనికి చెప్పకుండా నేను మా ఉరికి వెళ్ళిపోయాను ఒక వారం పాటు,అతను నాకు ఫోన్ చేసినా తియ్యలేదు నేను నా ఫోన్ ని సైలెన్స్ లో ఉంచాను,అతను మా స్నేహితుల ఫోన్ నుండి ఫోన్ చేయించాడు ఏమిందో అని ,వారం తర్వాత ఇక ఎడ్పించడం బాగోదు అని నేను మళ్ళి కాలేజికి వెళ్లాను.

అతను నా కోసం నేను వచ్చాను అని తెలిసి వచ్చి,నన్ను చూడగానే ఏడుస్తూ ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు,నన్ను వదిలేసి అని అంటూ గబుక్కున వచ్చి కౌగలించుకుని నాకు చెవి లో లవ్ యు అని చెప్పాడు,దానికోసమే ఎదురుచూస్తున్నా నేను అతన్ని హత్తుకుని ఏడ్చాను మరి నేను కూడా వారం రోజులు అతన్ని వదిలి ఉన్నా కదా,అలా మా ప్రేమ ప్రయాణం మొదలైంది.మేము ప్రేమించుకున్నాం ,పెళ్లి చేసుకుంటాము అనే నమ్మకం తో నేను తనని బాగా నమ్మినా,కానీ అతనితో హద్దులు మాత్రం దాటలేదు.

బాగా సినిమాలకు ,షికార్లకు తిరిగాము ,ఒక విధంగా మేమే అందరికి తెలిసేలా చేసాము కూడా,అయితే ఇలాంటి సమయం లోనే రమేష్ వాళ్ళ నాన్నగారికి బిజినెస్ లో కొంచం లాస్ వచ్చింది,డబ్బుకు చాలా ఇబ్బంది ఉంది అని తెలిసింది,మేము కలిసినప్పుడల్లా రమేష్ ఇదే చెప్తూ ఉండేవాడు.మా కబుర్లలో చాలా వరకు అదే విషయం ఉండేది.ఒక ఆదివారం నాడు ప్రొద్దున్నే రమేష్ నన్ను కలవడానికి వచ్చాడు.

ఎప్పుడు నేనే బయటకు వెళ్ళేదాన్ని అతను అలా నన్ను వెతుక్కుంటూ వచ్చేసరికి నాకు కాస్త భయం వేసిన మాట నిజమే కానీ ఎందుకు వచ్చావు అని అడిగాను నేను పైకి ఏమి అనకుండా అను నాకు కొంచం డబ్బు కావలి ఒక ఇరవై లక్షలు కావాలి మీ అన్నయ్యల దగ్గర నాకు అప్పుగా ఇప్పించావా అని అడిగాడు ఏంతో ఆశగా,నేను ఆశ్చర్యంగా అతన్ని చూసి నేను నీకు అప్పు ఇప్పించాలా,అసలు నీకేమైనా అర్ధం అవుతుందా,ఎం మాట్లాడుతున్నావు అని అన్నాను.

దానికి రమేష్ అందర్నీ అడిగాం,కానీ ఎక్కడ అప్పు పుట్టలేదు,మా నాన్న గారికి అప్పు ఇచ్చిన వాళ్ళు గొడవ చేస్తున్నారు,మీ అన్నయ్యలని అడిగితె వాళ్ళు తప్పకుండ ని మాట వింటారు ప్లీజ్ దయచేసి ఇప్పించు అని అడిగాడు. నేను రమేష్ ని అలాగే చూస్తూ సారీ రమేష్ నేను మా అన్నయ్యలకు చెప్పలేను,ఇప్పించలేను ఏమి అనుకోకు ,ప్లీజ్ నన్ను అడగకు అని అన్నాను.

అదేంటి నేను అప్పుగానే కదా అడగమని చెప్పినా అని అన్నాడు తిరిగి,అప్పు అయినా,కాకున్నా నేను ఇప్పించలేను,వద్దు ,మన పరిచయాన్ని ఇలా అప్పుల పరిచయం చేయకు,నాకూ కాబోయే వాడు నా వాళ్ళ కన్నా ఒక మెట్టు పైనే ఉండాలి అని అనుకుంటా నేను అలాంటిది నిన్ను వారికీ ఇలా పరిచయం చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసరికి అతను దానికి ఇప్పుడు నాకు అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నా లేదంటే మీకంటే ఎక్కువే నాకు ఉంది. కానీ అదిప్పుడు అమ్మే పరిస్థితిలో నేను లేను కాబట్టే కదా అడిగేది అని అన్నాడు.

లేదు రమేష్ మన బంధాన్ని మొట్ట మొదటి సారి నా వాళ్ళకు నిన్ను పరిచయం ఇలా చెయ్యడం నాకు ఇష్టం లేదు  అని ఖచ్చితంగా అనేసరికి నన్ను చూస్తూ అంతేనా అని అన్నాడు అవును అని నేను చెప్పాను.సరే మంచిది నీకు నా మిద నమ్మకం లేనప్పుడు మనం ఇంకా కలిసి ఉండడం మంచిది కాదు,వెళ్తున్నా అని చెప్పి వెళ్ళి పోయాడు.

అంతే ఇక తర్వాత రమేష్ నాకు మళ్ళి కనిపించలేదు.ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యలేదు.మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వలేదు.కొన్ని రోజులు చూసాక నేనే అతను ఉండే గది కి వెళ్లాను కానీ అతను ఖాళి చేసి వెళ్ళిపోయాడు అని తెలిసింది.అక్కడి నుండి మొదలైంది నా ప్రయాణం అతన్ని వెతికడానికి ఎక్కడ ఉన్నడు అంటే అక్కడికి కూడా వెళ్లాను నన్ను చూసి మొఖాన్ని తిప్పుకున్నాడు.

నేను అడిగా ఏంటిది రమేష్ అని,దానికి అతని సమాధానం విని కోయ్యబరిపోయాను,కష్టం లో ఉంటె ఆడుకొని ప్రేయసి ఒక ప్రేయసేనా నీ మిద నాకు మనసు విరిగిపోయింది, జన్మలో ని మొఖాన్ని నాకు చూపించకు అని నా మొఖాన చెప్పి వెళ్ళిపోయాడు.నా సంగతి అన్నయ్యలకు తెలిసి వాళ్ళు కూడా వచ్చి రమేష్ తో మాట్లాడారు,అయినా అదే సమాధానం వచ్చింది.

కానీ కోపం ఎక్కువ రోజులు ఉండదు అని నేను అతని కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను ఎప్పటికైనా వస్తాడు అని,మిరే చెప్పండి ప్రేమించిన నా ప్రియుడికి డబ్బు కావాలి ఇవ్వండి అని నేను ఎలా అడుగుతా మా వాళ్ళని ఒకసారి కాదు అని అనుకుంటే అయిపోతుందా,మరి ఇన్నాళ్ళు ప్రేమించిన ప్రేమంతా ఏమై పోయింది.

ఎక్కడికి పోయింది,ఇన్నేళ్ళ సావాసం,నా వాడు అని అనుకున్న వాడు అలా అర్ధంతరంగా వదిలేసి వెళ్ళి పొతే నా వేదన ఎవరితో చెప్పుకోవాలి,ఎవరికీ చూపించాలి ,అతను నాతో చెప్పినా మాటలు,చిలిపి ఆశలు,అల్లరి చేష్టలు అన్ని నాకు గుర్తుకు వస్తుంటే,నాకు తెలియకుండానే నా గుండె బరువు ఎక్కుతుంటే,నా కన్నీళ్ళు అన్ని దిండులో కలిసి పోయి దిండు దాచుకుంటుంటే ,నన్ను ,నా బాధని చుసిన నా వాళ్ళు బాధ పడుతూ ఉంటె,నేను వారిని ఓదార్చాలో వాళ్ళు నన్ను ఓదార్చాలో తెలియని స్థితిలో,ఎప్పుడూ కళ కళ లాడుతూ ఉండే నేను నా గదికే పరిమితం అయ్యి,అందులోంచి బయటకు రాకుండా ఉంటె నన్ను కన్నా తల్లి అది చూడలేక,మంచం లో పడి ,నా వదినెలు కూడా నన్ను జాలిగా చూసే చూపులను తట్టుకుంటూ,నాలోని వేదనను పంచుకోవడానికి ఎవరూ లేక,బరువైన నా గుండె భారాన్ని దిండులో తడిపేస్తు ఉన్నా,రమేష్ నన్ను కాదన్నాడు అని నేను ఇప్పటికి కూడా నమ్మడం లేదు ,ఎక్కడి నుండి వస్తాడో, నిమిషం లో ఫోన్ ,మెసేజ్ చేస్తాడో అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ,కళ్ళు మూసుకుంటే అతనెక్కడ వెళ్ళిపోతాడో అని నిద్రకూడా పోకుండా చూస్తున్నా,అయినా నా మిద దయ లేదు అతనికి.

నేను అలా ఉండడం నా అన్నయ్యలకు నచ్చలేదు,ఇక ఇలా కాదని వాళ్ళు నా దగ్గరికి వచ్చి,అను ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా కుర్చుని బాధ పడతావు,అలా చూస్తూ ఉంటె అతను పెళ్ళికూడా చేసుకుంటాడు.

కాబట్టి నువ్వు అతని మిద పోలీసు కేసు పెట్టు అతను నిన్ను  ప్రేమించి మోసం చేసాడు అని,సాక్షాలు కూడా ఉన్నాయి కదా అని అన్నరు నేను ఆలోచించాను నాకు అది కూడా నిజమే అనిపించింది,నేనెలా బాధ పడుతూ ఉరికే కూర్చుంటే నా స్థానాన్ని ఇంకొకరికి ఇస్తాడు అనిపించి, అన్నయ్యలతో సరే అని చెప్పాను,అందరం వెళ్ళి అతని మిద అంటే రమేష్ మిద కేసు పెట్టాము.

అసలు అతను నాకెందుకు పరిచయం అవ్వాలి ,నేను ఎందుకు తనని ప్రేమించాలి,అతన్ని ఎందుకు నమ్మాలి,ఎవరో తెలియని వ్యక్తిని మనం ఎందుకు ప్రేమిస్తాం,అన్ని రోజులు ఉన్న వారందరి కన్నా వ్యక్తే ముఖ్యం అని ఎందుకు అనుకుంటాం.అతని కోసం ఏమైనా చేయ్యడానికి ఎందుకు సిద్ద పడతాం,అసలు అతను ఎవరూ మన జీవితాన్ని శాసిoచే అధికారం అతనికి ఏముంది,?నాకే ఎందుకు ఇలా కావాలి ,నా వాళ్ళ కంటే ఎక్కువ స్థితిలో ఉండాలి అని నేను అనుకోవడం నా తప్పా.

రమేష్ ఎందుకు ఇలా చేసావు రమేష్,నేనే పాపం చేశాను,నిన్ను ప్రాణంగా ప్రేమించడమే నేను చేసిన తప్పా,అసలు నా జీవితం లోకి ఎందుకు వచ్చావు,దానికి కారణం నేనేనేమో,ఏమో నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నానేమో, వేదన ఎప్పుడు తీరెను

అతను అది తెలుసుకుని ఊర్లో ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు అని తెలిసింది,నాకు బాధ అనిపించింది.అయినా ఒక మగవాడి మనసు ఇంతే ఆలోచిస్తుందా,డబ్బు కోసం ప్రేమించిన నన్ను దూరం పెడతాడా,కానీ రమేష్ ని నేను నన్ను రమేష్ ఘాడంగా ప్రేమించుకున్నాం అతను తప్పకుండా నా కోసం వస్తాడు ,నేను ఎదురుచూస్తూనే ఉంటా,అతన్ని దక్కించుకుంటా ,దాని కోసం ఎంత దూరమైనా వెళ్తాను ,ఏమైనా చేస్తాను ఎందుకంటే ప్రేమించాను కదా.

కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ నా మిద అతనికి ఉన్న ప్రేమ నిజమే అయితే నా కోసం తను వస్తాడు అని,నా ప్రేమలో స్వార్ధం లేదని తనకు తెలిసినప్పుడు,నాలా ప్రేమించే వారు తనకు జీవితం లో దొరకరు అని తెలుసుకున్న రోజున అతను నా కోసం వస్తాడు.నేను తన కోసం,తన ప్రేమ కోసం ఎన్ని యుగాలు అయినా వేచి చూస్తాను.

ప్రేమ అనేది అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా ఉంటుంది అని ,దాన్ని పొందడానికి ఏమైనా చేస్తారు అని అందరూ తెలుసుకోవాలి.ఒకప్పుడున్న నా సంతోషం,నా ఆనందం,నా అల్లరి అంతా తనే పట్టుకు పోయాడు,మళ్ళి నేను అవ్వన్నీ సంపాదించుకోవాలి అంటే నా రమేష్ నాకు కావలి.రావాలి ,అందుకే అతన్ని వెతుకుతూనే వెళ్తున్నా నేను.

Normal
0

false
false
false

EN-US
X-NONE
HI

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-fareast-font-family:”Times New Roman”;
mso-fareast-theme-font:minor-fareast;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}

Related Posts