పరిచయ భయం

 పరిచయ భయం

తేది:⁠- 25/10/2023
శీర్షిక:⁠- నమ్మకాన్ని వమ్ము చేసేవాళ్లే ఉన్నారు.

మమత కొత్తగా మొదటి రోజు ఆఫీస్ కి వెళ్తుంది. మమతా వెళ్లి మేనేజర్ ని కలిస్తే తన సిట్ ఎక్కడో చెప్పారు.

అంతా కొత్తగా ఉంది. కొంచెం భయంగా కూడా ఉంది. ఆఫీస్ మొత్తం చూస్తుంది. కాసేపయ్యాక ప్యూన్ వచ్చి కొన్ని ఫైల్స్ ఇచ్చి వర్క్ చేయమని చెప్పాడు. అలా వర్క్ లో మునిగిపోయింది.

మధ్యాహ్నం బాక్స్ తో కాంటీన్ లోకి వచ్చింది. 
ఎక్కడ ఒక కుర్చీ కూడా ఖాళీ లేదు. అలా చూస్తూ ఉండగా గౌతమ్ మమతని పిలిచాడు.

కానీ రేణుక మాత్రం ,
“ఎందుకు గౌతమ్ ఆ అమ్మాయిని పిలుస్తున్నావ్?” కోపంగా అడిగింది.

“ఈరోజు కొత్తగా ఆఫీసులో జాయిన్ అయింది. తనకి ఎవరు పరిచయం కూడా కాలేదు. మనం తనని ఫ్రెండ్ గా చేసుకుందాం” అని చెప్పాడు గౌతమ్.

గౌతమ్ మాట కాదని లేక రేణుక కూడా ఒప్పుకుంది.
మమత కి అందర్నీ పరిచయం చేసాడు గౌతమ్.

సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు.
కానీ రేణుక కి మాత్రం మమతను చూడగానే అయిష్టంగానే మాట్లాడుతూ ఉంది.

అలా ప్రతిరోజు గౌతమ్ తన ఫ్రెండ్స్ తో పలకరించడం మధ్యాహ్నం వాళ్లతో కలిసి భోజనం చేయడం సాగుతుండగా ,
రేణుకకి గౌతమ్ అంటే చాలా ఇష్టం ఒక రకంగా చెప్పాలంటే ప్రేమిస్తుంది.

రేణుకని గౌతమ్ మాత్రం ఒక ఫ్రెండ్ లా మాత్రమే చూస్తున్నాడు.
రోజురోజుకి గౌతమ్ మమతకు దగ్గర రావడం చూసి కోపంతో రగిలిపోతుంది రేణుక.

‘వాళ్ళిద్దర్నీ ఎలాగైయినా విడదీయాలని అనుకుంది రేణుక.’
ఒక వారం నుండి గౌతమ్ ఆఫీస్ కి రావడం లేదు.
“రేణుక గౌతమ్ ఎందుకు రావడం లేదు” మమత అడిగింది.

“వాళ్ల నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. అందుకే ఊరు వెళ్ళాడు గౌతమ్” అని చెప్పింది రేణుక.
ఇదే అదునుగా భావించిన రేణుక గౌతమ్ మంచివాడు కాదు అని కొన్ని అబద్ధపు సాక్షాలతో మమత ముందు నిరూపించింది.

ఊరు నుంచి వచ్చిన తర్వాత గౌతమ్ వచ్చి పలకరించిన కూడా మాట్లాడటం లేదు మమత.
కొన్ని రోజులు తర్వాత పెళ్లి కుదిరిందని మమతా జాబ్ మానేసింది.

వెంకట్ ద్వారా రేణుక మమతకి చెప్పిన చెప్పుడు మాటలు గౌతమ్ కి తెలిసాయి.
తనతో రెండు నెలలు మాట్లాడలేదు గౌతమ్.

మన అనుకున్న వాళ్లే చెప్పుడు మాటలు చెప్పి దూరం చేస్తే కొత్త వాళ్లతో మాట్లాడడానికి కూడా పరిచయ భయం కలుగుతుంది.

కొన్ని రోజులు కొత్త వాళ్ళతో మాట్లాడటం పూర్తిగా మానేసింది మమత.
కొత్త వాళ్లతో మాట్లాడాలంటే అదొక భయం మొహమాటం ఏర్పడింది.

తప్పని పరిస్థితుల్లో మాట్లాడవలసి వస్తే తప్పక మాట్లాడేది మమత.
ఇలా ఎంతో ధైర్యంగా ఉన్న మమత ఇలా తయారవడానికి కారణం మాత్రం రేణుక మాటలే.
ఇప్పుడున్న ప్రపంచంలో కొత్త వాళ్ళతో మాట్లాడితే నమ్మకాన్ని వమ్ము చేసే వాళ్లే ఉన్నారు.

మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *