పరిపూర్ణత

 

రామారావు శారద దంపతులకు ఒక కూతురు శాంతి ఒక కొడుకు సందీప్ ఇద్దర్ని బాగా చదివించారు దంపతులు,కూతురు డాక్టర్ ఇంకో డాక్టర్ నే పెళ్ళి చేసుకొని ,సొంతంగా ఒక ఆసుపత్రిని నడుపుతూ ఉంది.భర్త విదేశాల్లో కూడా మంచి పేరు సంపాదించు కున్నాడు.అతనేక్కువగా విదేశాలకు తిరుగుతూ ఉంటాడు.ఇక వారికీ ఇద్దరు పిల్లలు వార్ని కూడా హాస్టల్ లో వేసి చదివిస్తున్నారు శాంతి దంపతులు., 

ఇక కొడుకు సందీప్ ఇంజనీరింగు చేసి అమెరికాలో జాబు తెచ్చుకుని,తల్లిదండ్రులు చూసిన పిల్లనే పెళ్ళి చేసుకున్నాడు అతనికి కూడా ఇద్దరు పిల్లలు.కోడలు మంచిదే రమ్మని అంటుంది కానీ ఇండియా అయితే అలవాటు అయిన  ప్రదేశం కాబట్టి ,వాళ్ళు వెళ్ళడానికి ఇష్ట పడలేదు.అంతా బాగుంది,ఇక ఏ బాధలు లేవు అనుకునే సమయం లో రామరావు ఒక రోజు నిద్ర లోనే కన్ను మూశారు. 

హయిగా ఎవరితోనూ చేయిoచుకోకుండా ఎవరికీ భారం కాకుండా వెళ్లిపోయిన రామరావు అందర్నీ ఆశ్చర్యపరిస్తే శారదను మాత్రం ఒంటరిని చేసింది.మూడు రోజుల తర్వాత వచ్చిన కొడుకు తన బాధ్యతలను పూర్తి చేసుకుని నెల లోపు వెళ్లి పోయాడు తల్లిని రమ్మని అన్నాడు, 

కానీ అక్క అడ్డుపడి ఇప్పుడెలా వస్తుంది రాఅని అంది తల్లి బాధలో ఉందని కొన్ని రోజులు అయితే సర్దుకుంటుందని తనే పంపిస్తా అని చెప్పడం తో సందీప్ భార్య సమేతంగా వెళ్లి పోయాడు సెలవు అయిపోవడం తో శారదను కూతురు తన ఇంట్లో పెట్టుకుంది కానీ శారద అక్కడ ఉండలేక పొయింది. 

కూతురు ఇంట్లో తనింట్లో ఉన్న స్వతంత్రం ఉండదు కదా,అల మల్లి తన భర్త,తను కాపురమున్న గూటికి  తిరిగి వచ్చేసింది శారద.తనింట్లో ఎంత స్వతంత్రంగాఉన్నాతోడూ లేకుండా ఉండడం భరించ లేక పోతుంది ఒంటరిగా ఉండలేక చెట్లు చేమలు పెట్టి వాటి పనిలో పడుతూ,తీరిక లేకుండా చేసుకుంది కొన్నాళ్ళు,కానీ ఎన్ని రోజులని తోట పని చేస్తుంది. 

ఉన్న ఒక్కదానికి కాస్త వండుకోవడం తినడం చెట్లను చూస్తూ గడపడం ,కొన్ని రోజులకి చెట్లు పెరిగి ,వాటి పోషణ చూసుకోకున్నా పర్వాలేదనే స్థాయికి వచ్చాయి ఇక కాసే పూసే పువుల కాయల కోసం ఇరుగు పొరుగులు వస్తూ కాస్త కాలక్షేపం అయ్యేది ఆ తర్వాత మాములే 

ఆమె చాల ఒంటరిగా ఫీల్ అయ్యేది,ఎం పని లేక ,మాట్లాడే వారు లేక ఒంటరితనం తో బాధ పడేది.ఒక్కతి ఇంట్లో ఉండలేక పోయేది.అయితే ఈ విషయాన్నీ కూతురుకు చెప్తే కూతురు తమ్ముడి దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చింది.కానీ శారద పరాయి దేశం వెళ్ళడానికి ఇష్టపడలేదుఇంతకన్నా ఘోరంగా ఉంటుంది అక్కడి పరిస్థితి అని అలోచించి వెళ్ళాను అని చెప్పింది.తనను ఏదైనా ఆశ్రమం లో చేర్పించమని అడిగింది కూతుర్ని తల్లి నిర్ణయానికి ఆశ్చర్య పొయింది శాంతి. 

ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక్కాటే ఉన్న తల్లి ,హటాత్తుగా అటు కొడుకు దగ్గరికి ,ఇటూ తన దగ్గరికి  రాకుండా అల ఆశ్రమం లో చేరడం అంటే ,అందులో చేరడం ఎందుకు మా ఇంట్లో ఉండొచ్చు కదా అంది శాంతి తల్లి తో నేనుoడలేనమ్మా అంది శారద పోనీ అమెరికాకు వెళ్తవా తమ్ముడు  నిన్ను బాగా చూసుకుంటాడు అని అంది  ఇక్కడ ని దగ్గరే ఉండలేని దాన్ని ఇక అక్కడ ఏముంటాను అని అంది శారద. 

ఏమి చేయాలో తోచలేదు శాంతికి తమ్ముడికి భర్తకి తల్లి నిర్ణయాన్ని చెప్పింది తన తప్పు లేకుండా ఆవిడకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండనివ్వు మహా అయితే డబ్బే కదా ఇచ్చేద్దాం అని అన్నారు ఇద్దరు. 

దాంతో తల్లిని ఆశ్రమం లో ఆవిడా కోరుకున్న విధంగా చేర్పించింది శాంతి. అక్కడ అందరూ తనకన్నా పెద్ద వాళ్ళు,వయస్సులో అన్ని చూసిన అనుభవజ్ఞులు,వారి జీవితం లో జరిగిన వింతలూ,విశేషాలు వింటూ కొన్ని రోజులు కాలం వెళ్ళ దిసింది.కానీ శారదకు అది కూడా తృప్తిని ఇవ్వలేదు.ఆమె శరీరం,మనసు కూడా తోడూ కోసం తపించి పోతుంది. 

కానీ ఎవరికీ చెప్పాలో తెలిసేది కాదు,ఆమె శరీరం లో మార్పులు రాసాగాయి,కొన్ని కొన్ని రహస్య భాగాలలో ఏదోలా ఉండేది.ఏమి చేయాలో తెలిసేది కాదు ,కూతురు వారానికి రెండు సార్లు వచ్చి తల్లిని చూసిపోతూ ఉండేది.అదే క్రమం లో ఆమె తల్లిని గమనించసాగింది.స్వతహాగా డాక్టర్ అయిన శాంతి తల్లి చూపులు,మాటలు చేతలు అన్ని అదోరకంగా ఉండేవి శాంతికి ఆ మార్పు ఏమిటో అర్ధం అయ్యేది కాదు.తన ఫ్రండ్ ని అడగాలి అని అనుకుంది.తన స్నేహితురాలికి చెప్పగానే అది మెనోపాజ్ దశ అని దాని వల్ల కాస్త అనిజిగా ఉంటారు అని చెప్పింది దాంతో శాంతి ఏమి అనలేకపోయింది. 

అంతలో అందులోకి ఒక యాభై ఆరేళ్ళ వ్యక్తి కొత్తగా వచ్చి చేరాడు.అతని పేరు రఘునందన్ అతని పిల్లలు అందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు,భార్య చనిపోయింది.చూసే వారు ఎవరూ లేక ఇందులో చేరాడు తనంతట తానుగా అతను వచ్చిన రెండో రోజే శారద తో మాట కలిపాడు,ఇద్ద్దరు లోకం లో జరిగే విషయాలన్నీ మాట్లాడుకునే వారు  

అన్ని రోజులు స్తబ్దుగా గడిపేసిన శారద జీవితం లోకి మళ్ళి వెలుగు వచ్చినట్టుగా అనుకుంది,అతనితో కబుర్ల తో కాలమే తెలియ లేదు.నెల రోజుల తర్వాత వచ్చిన కూతుర్ని కూడా పట్టించుకోకుండా అతనితో కబుర్లలో మునిగింది శారద.తల్లి లోని మార్పుని గమనించిన శతి, తల్లి కోల్పోతున్నది ఏమిటో గ్రహించింది  నిట్టూర్చింది శాంతి,తన భర్త తనకు దూరంగా ఉండి ఒకటే ,తన తల్లికి లేకపోయినా ఒకటే అని కనీసం తల్లి అయినా సుఖ పడితే చాలనుకుంది.

తాను చేయబోయే పనిని అటు భర్తకు, ఇటూ తమ్ముడికి,తర్వాత రఘునందన్ కుటుంబంతోనూ మాట్లాడి,తెలియకుండానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.తర్వాత తల్లి తోను,రఘు నందన్ గారితోనూ కుర్చుని మనసు విప్పి మాట్లాడింది శాంతి.దాని సారాంశం ఏమిటంటే మాకు మీరు నచ్చారు,మా అమ్మగారికి కూడా నచ్చారు కాబట్టి మా నాన్నగారు పోయినప్పటి నుండి అమ్మ ఒంటరిగా ఫీల్ అవుతుంది.

మీరు వచ్చాకే అమ్మ మొఖం లో నవ్వు చూసాం మేము కాబట్టి మీ పిల్లలతోను,మా తమ్ముడి తోను మాట్లాడాను, నేను మీ ఇద్దరికీ మళ్ళి పెళ్ళి చేద్దాం అనుకుంటున్నాం మేము మా తరపు నుండి ఎ అబ్యంతరం లేదు మాకు ఒకే మీ వాళ్ళు కూడా ఒకే అన్నారు.రేపే మీ పెళ్ళి మీరు ఒకరికి ఒకరు  తోడుగా ఉండాలనేదే మా ఆశ కాబట్టి మీకు కూడా సమ్మతమేనా అని అడిగింది.

తన మనసులో ఉన్న బాధను అర్ధం చేసుకుని,తనకో తోడుని వెతికిన కూతుర్ని పైగా అందర్నీ ఒప్పించి వారి పెళ్ళి ఏర్పాటు చేసిన శాంతిని ,ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని నుదుటి పైన ముద్దు పెట్టుకుని తన ఇష్టాన్ని తెలిపింది.రఘు నందన్ గారు కూడా మీ అందరికి ఇష్టం అయితే నాకు ఇష్టమే అని శారద చెయ్యి పట్టుకున్నాడు ఆసరా కోసం పైకి లేవడానికి,తెల్లారి ఆశ్రమం లో ఉన్న నలుగురి ముందు పెళ్ళి జరిగి పొయింది.

కొడుకు అల్లుడు విడియోలో చూసి శుభాకాంక్షలు తెలిపారు.ఇరు వైపులా వారు కూడా తమ పెద్ద వారికీ కొత్త జీవితం దొరికిందని,ఇక వారి జీవితం పరి పూర్ణతను పొందిందని భావించారు.చెయ్యి లో చెయ్యి కలిపి ఒకరికి ఒకరు తోడూ నీడగా,ఆలంబనగా,ఆసరాగా,తన కొత్త భాగస్వామితో కలిసి వెళ్తున్న తల్లిని చూస్తూ కన్నీళ్ళు తుడుచుకుంది శాంతి.

Normal
0

false
false
false

EN-US
X-NONE
HI

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-fareast-font-family:”Times New Roman”;
mso-fareast-theme-font:minor-fareast;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}

Related Posts