పశ్చాతాపం

చలం దంపతులకు ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి చిన్నప్పటి నుండి ఒకే అమ్మాయి అని సృజనని గారాబంగా పెంచారు పిల్లలు కూడా అంటే సృజన అన్నయ్యలకూ కూడా చెలులు అంటే ప్రాణం చలం తన సొంత ఊర్లోనే వ్యవసాయం చేస్తూ ఉన్న దాంట్లోనే పిల్లలను బాగా చదివించాలని అనుకుని తన అన్నయ్యలు పట్నం వెళ్ళినా తను మాత్రం ఊర్లోనే ఉంటూ పంటలు వేస్తూ అందరికి తల్లో నాలికలా ఉండేవాడు .చలం అంటే చాలా అభిమానం చూపించే వారు ఊరి వాళ్ళు కానీ అదే ఊర్లో చలం అంటే గిట్టని ఒకే ఒక వ్యక్తి శ్యాం.  శ్యాం పొలం చలం పొలం పక్కనే ఉంది శ్యాంకూ చలం పొలం మిద కన్ను పడింది.

దాంతో పంట వేసినా అది అధికంగా పండుతూ చలానికి డబ్బు తెచ్చి పెడుతుందని తన పొలంలో ఎక్కువ పంట పండక ప్రతి యేడు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని చలాన్ని అడిగాడు తన పొలాన్ని అమ్మమని కానీ పొలం తప్ప ఇంకా ఆధారం లేని చలం దాన్ని అమ్మను అని చెప్పేసరికి అతన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు శ్యాం విషయం ఊర్లో అందరికి తెలిసిన బహిరంగ రహస్య లా మిగిలి పోయింది.

ఇక సృజన అన్నయ్యలతో పాటుగా బడికి వెళ్తూ చదువుకో సాగింది. అయితే ఇద్దరు మగ పిల్లల చదువు ఉర్లో అయిపోవడంతో కాలేజికి అని వేరే ఊర్లు పంపించాడు చలం పిల్లలను పిల్లలుకూడా తండ్రి స్థితి ని అర్ధం చేసుకుని ప్రవేశ పరీక్ష ఎదో రాసి సీట్ తెచ్చుకుని బయట  హాస్టల్ లో ఉంటూ తమ చదువును కొనసాగించారు.

సృజనకు కూడా బాగా చదువుకోవాలని చెప్పారు అన్నలు కానీ సృజనకూ మాత్రం సినిమాలు అన్న సినిమాల్లో నటించడం అన్న చాలా ఇష్టం  పైగా ఆమె ఎప్పుడు ఉహల్లో ఉంటూ తన తండ్రి పేరికాన్ని గుర్తించక గొంతెమ్మ కోరికలు కోరుతూ తండ్రి దగ్గర గారాలు పోయి మరి కొనిపించుకునేది తల్లి మీనాక్షి కూతుర్ని అదుపులో పట్టాలని చూసినా చలం మీనాక్షిని ఏమి అననివ్వకుండా ఉండే వాడు.

దాంతో సృజనకూ మరి అహాoకారం గర్వం బాగా ఎక్కువ అయ్యి తల్లిని అన్నలను కూడా లెక్క చేసేది కాదు ఇలా సాగుతూ ఉండగా అన్నల చదువు అలాగే వారి అదృష్టం కూడా బాగుంది ఉద్యోగాలు కూడా వచ్చాయి.అన్నలకు ఉద్యోగాలు రావడం తో వారి వెంట నేను కూడా వస్తాను అని గోల చేసింది సృజనకానీ వారి వెంట వెళ్ళడానికి తల్లి ససేమిరా ఒప్పుకోలేదు.వయస్సుకు వస్తున్న పిల్ల అలా బయటకూ పంపితే బాగుండదు అని చలం కూ చెప్పడం తో అతను కూడా వద్దు అని అన్నాడుఅన్నయ్యలు వెళ్ళిపోయారు.కానీ సృజన మాత్రం తల్లి దండ్రుల మిద కోపాన్ని పగ ను పెంచుకుంది. తనని వెళ్తా అంటే వెళ్ళనివ్వకుండా ఆపిన తల్లి పై చాలా కోపాన్ని పెంచుకుని వారిని ఎదో విధంగా బాధ పెట్టాలను వారు బాధ పడుతుంటే చూడాలని అనుకుని అప్పటి నుండి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది .అయితే సృజన ఏది చెయ్యాలన్నా చేద్దాం అని అనుకున్నా తల్లి ఆమెని ఆపుతూ అది చేయకు ఇది చేయకు బయటకు వేళ్ళకు పద్దతిగా ఉండు అని అంటూ ఆంక్షలు పెట్టడం సృజనకు నచ్చేది కాదు తను స్వేచ్చగా ఉండాలి అనిఎలా పడితే అలా తిరగాలి మగ పిల్లలాగా గోలీలు ఆడాలి  వారిలా సైకిల్ తొక్కాలి అనే కోరికలు ఉండేవి పైగా కొంత వయస్సు వచ్చాక తన ఇల్లు తను వేసుకునే బట్టలు తన తల్లిదండ్రులు ఏది తనకు నచ్చేది కాదు దాంతో  ఇంకేదో కావాలని మనసు ఆరాట పడుతూ ఉండేది.ఆడపిల్ల ఎంత లో ఎదుగుతుంది సృజన ఎదిగింది కానీ ఆమె మనసు లో అలజడి ప్రారంభం కావడానికి ఊర్లోకి వచ్చిన కొత్త పోస్ట్ మాన్ కారణం అయ్యాడు.బాల అతని పేరు కొత్తగా వచ్చాడు ఊర్లోకి అయితే ఒకటి రెండు సార్లు అన్నయ్యలు తెచ్చిన ఉత్తరాలు అందిస్తూ సృజనని చూసాడు అతను తెల్లగా ఎత్తుగా అందంగా ఉండే సరికి సృజన వయసులో ఆకర్షణకు గురి అయ్యింది.

అది గమనించిన బాల ఆమెకు ఇంకా బాగా దగ్గరవ్వడానికి ప్రయత్నించసాగాడు. ప్రతి రోజు ఆమె ని స్కూల్ దగ్గర కలుస్తూ ఆమెకి జోక్స్ చెప్తూ ఆమెని నవ్విస్తూ తనకు తెలిసిన మ్యాజిక్కులు ఏవేవో చేస్తూ ఆమె దృష్టిలో హీరో అయిపోయాడు. అతను ఏది చేసినా ఏమి చేసిన సృజన అతన్ని ఒక హీరో లా చూసేది ఆమెకి సినిమాల ప్రభావం కూడా బాగా ఉండడం తో తను అతన్ని .అతను తనని ప్రేమిస్తున్నాడు అని అనుకుని ఒక వేళ తల్లిదండ్రులకు బాల నచ్చక పొతే ఏమి చేయాలో కూడా ఆలోచించుకుంది.అతన్ని బాగా నమ్మి అతను తనకు చాలా ఆస్థి పాస్థులు ఉన్నాయి కానీ ఎదో ఉద్యోగం మగ వాళ్ళు చేయాలి కాబట్టి చేస్తున్నమది చాలా పెద్ద జమిందారి కుటుంబం అని ఏవేవో కట్టు కథలు చెప్పే వాడు దాన్ని గుడ్డిగా నమ్మేది సృజన అతని వయస్సు ఇరవై రెండేళ్ళ వయస్సు  అయితే సృజన ది పదహరేళ్ళ వయస్సు కావడం అతనికి సృజన బలహీనతలు తెలిసి పోవడం తో అతని వల లో పడడం చాలా తేలిక అయింది.

వారి ప్రేమ అదే ఆకర్షణ సృజన దృష్టిలో ప్రేమ పెరిగి పోయిముదిరి పోయి పాకాన పడింది.బాల కూడా ఆమెని అలాగే తన వెంట తిప్పుకుంటూ తను లేకుండా ఉండలేని స్థితికి తీసుకుని వచ్చాడు ఒక రోజు ఊరి చివర పొలం గట్ల మిద కబుర్లు చెప్పుకుంటున్న బాలా సృజనలను చూసిన శ్యాం.చలాన్ని దెబ్బ తీయడానికి ఇదే మంచి సమయం అని భావించి వారిద్దరిని పట్టుకుని వచ్చి పంచాయితీ దగ్గరకు వారిని తీసుకుని వచ్చి చలాన్ని రమ్మని కబురు పంపాడు .దానికి ఊరి పెద్దలంతా వచ్చి ఏమైందో చెప్పమని అన్నారు శ్యాం చూడండి అతను ఒక పెద్దమనిషి మంచి వాడు అని మీరు అనుకుంటే చాలదు కానీ అతని కూతురు చేసే గుడిసేటి పనులు కూడా చూడండి అని వెక్కిరించాడు.

శ్యాంకూ చలం మిద కోపం ఉందని దాంతో అతను ఏమి తెలియని సృజన మీద లేని పోనీ అభాండాలు వేస్తున్నాడని అనుకుని ఊరి పెద్దలు అందరూ శ్యాం ని ఏమయ్యా ఒక ఆడపిల్ల మీద నిందలు వెయ్యడానికి నీకు సిగ్గుగా లేదు ఆమె నీ ఇంటి ఆడపిల్ల కాదు కాబట్టి అలా మాట్లాడుతున్నావా నీకు ఒక ఆడ పిల్ల ఉంటె బాధ అర్ధం అయ్యేది. అయినా ఒకే ఒక్క కొడుకుని కన్నా నీకు పిల్లల మీద మమకారం ఏమి తెలుస్తుందయ్యా అని అతన్నే మందలించారు ఇదంతా చూస్తున్న సృజన ఎలా తప్పించుకోవాలా అని అనుకుని తండ్రి రాగానే తండ్రిని చూసి ఏడుస్తూ వెళ్ళి హత్తుకుంది. ఏమయింది అమ్మా అని అడిగీన తండ్రికి నేను గోరింటాకు కోసం వెళ్తే అక్కడ బాల కనిపించాడు అతన్ని ఏమైనా ఉత్తరాలు ఉన్నాయా అని అడుగుతుంటే శ్యాం మామా వచ్చి మమల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని అబద్దం చెప్తున్న సృజనను చూసి శ్యాం వయసులో అలాగే ఉంటారు అని సరి పెట్టుకున్నాడు

ఏమయ్యా చూడు పిల్ల ఎంత భయ పడిందో అంత చిన్న పిల్ల కు అతని కి రంకు కట్టడానికి నీకు ఎలా మనసు ఒప్పింది అని అంటూ శ్యాం ని తప్పు పట్టిన పెద్దలు పొలాన్ని అమ్మలేదన్న కోపం ఉండవచ్చు కానీ దాన్ని ఇలా పిల్లల మీద చూపించడం మంచిది కాదు అని హితవు మంచి చెప్పి మందలించి పంపి వేసారు వెనక్కి తిరిగి చూసిన శ్యాం బాలా ని ఒక కంట కనీ పెట్టాలని అనుకున్నాడు మనసులో. ఇది జరిగిన కొన్ని రోజుల దాకా సృజన బాల ఇద్దరు కలవకుండా జాగ్రత్త పడ్డాడు కానీ సృజన మాత్రం అతన్ని చూడకుండా ఉండలేక పొయింది ఎంతైనా ప్రేమ అని అనుకుంది కదా తల్లి తండ్రి కి తెలియకుండా అతనికి ఉత్తరం రాసి తన పక్కింటి కుర్రాడి తో పంపింది. దాంట్లో ఏమి రాసింది అంటే విషయం అందరికి తెలిసి పొయింది కాబట్టి మనం ఇక్క నుండి వెళ్ళి పొతే మంచిది అని ఉంది దానికి బాల అదే కుర్రాడితో సమాధానం రాసి పంపాడు కొన్ని రోజులు ఓపిక పట్టు విషయం సద్దు మణిగాక వెళ్ళి పోదాం అని అది చదువుకున్న సృజన బాల హీరో లా తనని ఎత్తుకు పోతాడు అని అనుకుంటూ మురిసిపోయింది.

ఇక మీనాక్షి చలం దంపతులు ఇలా జరిగింది అని కొడుకులకు ఉత్తరాలు రాసి ఏమి చేద్దామని అడిగారు కొడుకులు ఇద్దరు ఎదో ఒక సంబంధం చూసి పెళ్లి చేయమని అన్నారు దాంతో చలానికి అక్క వరుస అయ్యే ఆవిడ కొడుకుని పెళ్లి కొడుకుగా నిశ్చయించి వారిని ముహూర్తం పెట్టుకోవడానికి రమ్మని అన్నారు ఇదంతా ఏమి పట్టించుకోలేదు సృజన అసలు లోకం లోనే లేదు ఆమె తన ఉహ లోకం లో విహరిస్తూ ఉంది.సంబంధం మాట్లాడిన అక్క కూడా సృజనను చిన్నప్పటి నుండి చూస్తూ ఉండే కాబట్టి వెంటనే పెళ్లి కి ఒప్పుకున్నారు.సృజన తల్లి దండ్రుల మీద కోపం ఉంది కాబట్టి పెళ్లి జరిగే సమయం లో తానూ కనిపించకుండా పొతే అందరూ బాధ పడతారని అనుకుంది అప్పుడు అందరూ తిడుతూ ఉంటె బాగా అవుతుంది అని చిన్న పిల్ల లాగా ఆలోచించిoది తప్పితే తల్లిదండ్రుల పరువు పోతుంది అని అనుకోలేదు.

ముహూర్తాలు పెట్టారు.అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి సృజన అవ్వన్నీ చూస్తూ ఉంది పెళ్లి ఇంకో వారం రోజులే ఉంది రోజులు గడుస్తు ఉన్నాయి సృజన బాల కూ ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తు ఉంటె బాల మాత్రం ఒకే ఒక్క ఉత్తరం రాసి అందులో రోజు రాత్రి ఇంట్లో ఉన్న నగలు డబ్బు బట్టలు అన్ని ఒక బ్యాగ్ లో సర్దుకుని నువ్వు తొమ్మిది గంటలకు బస్ స్టాండ్ కు రమ్మని రాసాడు.అది చుసిన సృజన తన బాల హీరో అని తనని లేపుకు పోతాడు అని అనుకుంది. చలం అన్నలు పెళ్లి కార్డులు తేవడానికి వెళ్ళారు.ఇంట్లో తల్లి సృజన ఇద్దరే ఉన్నారు సృజన అర్ధ రాత్రి లేచి ఇంట్లో ఉన్న బట్టలు నగలు డబ్బు అన్ని తీసుకుని ఒక బ్యాగ్ లో సర్దింది తల్లి కి మెలకువ రాకుండా మెల్లిగా వెనక వైపు ఉన్న తలుపు తీసుకుని చీకట్లో కలిసి పోయింది..

అక్కడ బాల సృజన కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు బస్ స్టాండ్ లో సృజన ఎవరూ గుర్తుపట్టకుండా ముసుగు ధరించివచ్చి అటూ ఇటూ చూడసాగింది బాల కోసం ఇంతలో బాల ఆమెని గుర్తుపట్టి వచ్చిఎయి ఇంత  లేట్ గానా  రావడం అని అన్నాడు కాస్త చిరాకుగా నీకేంటి బాబు అలానే అంటావు అందర్నీ తప్పించుకుని రావాలి అంటే ఇదిగో టైం అయ్యింది అని ముసుగును ముందుకు లాక్కుంటు ఇద్దరు కలిసి కదులుతున్న ఎదో బస్ ఎక్కారు తమని ఎవరూ గమనించకుండానే వెళ్ళాలి అని  తొందరలో ఆ ఊరిని  విడిచి  శాశ్వతo గా వెళ్ళి పోయారు..

తెల్లారిన  తర్వాత సృజన  కనిపించడం  లేదన్న  వార్త  భగ్గుమంది ఊర్లో.  దాంతో ముందు  అనుమానం  శ్యాం  మీదకు వెళ్ళింది అతన్ని అంతా తీసుకుని వచ్చిచెట్టుకు కట్టేసి కొట్టి అడిగారు పిల్లని ఏమి చేసావు అనికానీ శ్యాం మాత్రం తనకు సృజన కూతురి లాంటిది  అని తానేమి చేయలేదని ఆమె మంచి కోసమే తను రోజు చెప్పినా ఎవరూ వినలేదు అని చెప్పేసరికి అందరికి బాల మీద అనుమానం వచ్చివెళ్ళి అతన్ని చూసారు కానీ అక్కడ అతను బాల కనిపించలేదు అతనితో పాటు అతని  వస్తువులు  కూడా  ఏమి లేవు  దాంతో  అందరి అనుమానం నిజం అయ్యి శ్యాం కూ ఏమి తెలియదు అని భావించి ఆతన్ని వదిలేసారు కానీ శ్యాం తన మీద పడిన నింద వల్ల సృజన ను వెతకడానికి నిశ్చయించుకుని చలం తో పాటుగా వెతకడానికి బయలుదేరాడు కానీ ఇంత పెద్ద మహా ప్రపంచం లో వాళ్ళు  మూలకు వెళ్ళింది  తెలియక  ఒక  వారం రోజులు  వెతికి  వెతికి  వాళ్ళు  దొరకక పోవడం  తో  పోలీసు కంప్లైంట్  ఇచ్చి ఊరెళ్ళి పోయారు.

వారం రోజుల్లో బాల సృజనను  ఒక గుళ్ళో పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టాడు. హైదరాబాద్ లోని ఒక మురికి వాడలో పరిసరాలు చూసిన  సృజన కూ  వాంతి  వచ్చినట్టుగా  అనిపించింది. అదే మాటను బాల తో అంటే మీ వాళ్ళు మన కోసం హోటల్ లో వెతుకుతూ ఉంటారు కాబట్టి మనం ఇక్కడ ఉండడమే మంచిది అని సర్ది చెప్పిఒక రేకుల గది ని అద్దెకు తీసుకుని నాలుగు గిన్నెలు ఒక చిన్న స్టవ్ కొన్ని సరుకులు తెచ్చి పెట్టాడు.  వాటితోనే  ప్రతి రోజు  వండుకుని తింటూ భార్య భార్తల్లా కాపురం చేసుకుంటూ ఉండేవారు.

తనని ఎంతో బాగా చూసుకుంటాడు ఎన్నో వింతలూ విహరాలల్లో  విహరింప  చేస్తాడు  అని  అనుకున్న  బాల తను తెచ్చిన డబ్బు నగలు ఖర్చు చేస్తూ తన కోరికలు తనతో తీర్చుకుంటూ ఉండడం చూసిన సృజన కూ చిరాకుగా అనిపించసాగింది. మేడల్లో బంగ్లాలలో విహరింప చేస్తాడు అని అనుకునే అతనితో  వచ్చింది  బాల  కూడా  తనకు  పెద్ద పెద్ద బంగళాలు ఉన్నాయని అన్నాడు ఒక రోజు బాల కౌగిలిలో ఉన్న సృజన విషయాన్ని బయట పెట్టింది.బాల నీకు బంగ్లాలు కార్లు డబ్బు బాగా ఉన్నాయని అన్నావు  కదా మరి మనమేప్పుడు  అక్కడికి  వెళ్తాము  అని  అడిగే సరికి  బాల వేరే మూడ్ లో ఉండి నిజాన్ని  ఒప్పుకుంటున్నట్టుగా  ఓసి పిచ్చి మొహమా  నాకు  కార్లు డబ్బు  ఉన్నాక  నేను పిచ్చి ఊర్లో  పోస్ట్ మెన్ గా ఎందుకు  ఉద్యోగం  చేస్తానే అందంగా లేని నిన్ను ఎందుకు  పెళ్లి  చేసుకుoటానే నాకు  డబ్బు ఉంటె నీ వెంట ఎందుకు పడతాను నా వెనకే వేరే వాళ్ళు పడే వాళ్ళు కష్ట పడి నిన్ను లైన్ లో పెడితే నువ్వు నా వెనక వచ్చావు కానీ  నిన్ను నీతో  పాటు మీ బాబు  పొలాన్ని ఇల్లును దొబ్బెయాలని అనుకున్నా కానీ నువ్వు ఏమో పారిపోదాo  అనేసరికి  ఇలా  బయట పడ్డ అని నిజం  చెప్పేసరికి  సృజనకు  ఎక్కడ  లేని  కోపం  వచ్చింది.

బాలకు  డబ్బు  లేదని అతను తనను డబ్బు కోసం తప్ప  ప్రేమతో  ప్రేమించలేదని  మోసం చేసాడు అని గ్రహించిన  సృజన  ఏంట్రా నీకు డబ్బు లేదా నన్ను మోసం చేస్తావా నాకు నా వారిని కాకుండా  చేస్తావా అని అంటూ కోపంగా బాల షర్టు పట్టుకుంది పట్టరాని ఆవేశం తో ఇన్ని రోజులు డబ్బుంది అనే నీతో ఉన్నానే ఇక డబ్బు నగలు కూడా అన్ని అయిపోయాయి.నిన్ను ఎలా వదిలిoచుకోవాలా  అని  చూస్తుంటే నువ్వే నాకు మార్గం  సుగమం  చేసావు నిన్ననే మా వాళ్ళు  పది లక్షల  సంభంధo  ఖయం చేసారు అని ఉత్తరం  రాసారు.

నేను  వెళ్ళి  కొత్త  పెళ్లి కొడుకులా  ముస్తాబు  అవ్వాలి అని నా షర్టే  పట్టుకుoటావా నీకు ఎంత  ధైర్యమే  బోకు దానా కాస్త అందంగా ఉండగానే నా పక్క లోకి వచ్చావు ఇలా ఇంకెందరి పక్కలో పడుకున్నావో ఏమేమి చేసావో నాకంటే ముందు నిన్ను ఎవరెవరు వాడుకున్నారో అని బూతులు  తిడుతున్నా బాల ని నివ్వెరబొయి చూసింది సృజన అన్ని రోజులు మంచి మాటలు మంచి కవితలు  వినిపించిన తన బాల ఇన్ని మాటలు ఇంత  చండాలంగా మాట్లాడతాడని  తెలియక చూస్తున్న  సృజనని వచ్చి రెండు చెంపల మీద గట్టిగా కొట్ట సాగాడు  బాల .కొట్టి  కొట్టి ఆమె  సృహతప్పేలా చేసి ఆమె సృహ తప్పక  గదికి తాళం వేసి బయటకు వెళ్ళిపోయాడు.

అదే మురికి వాడలో ఉంటున్న ఒక ముసలామే సృజన ను గమనిస్తూ ఉండేది వారి గదిలోంచి గట్టిగ మాటలు తర్వాత కొట్టిన శబ్దం విని వచ్చి చూసే సరికి బాల బయటకు వెళ్తూ కనిపించాడు ముసలి అవ్వ తన అనుభవం తో ఏమి జరిగి ఉంటాదో గ్రహించి అతను వెళ్లిన తర్వాత మెల్లిగా తన పిన్ తో తాళం తీసి సృహ లో లేని సృజనను బయటకు అతి కష్టం మీద తీసుకుని వచ్చి ఎప్పట్లా గదికి తాళం వేసి మళ్ళి  సృజనను  తీసుకుని  అక్కడికి  దూరంగా ఉన్న ఒక గుడిసె లోకి  తీసుకుని  వెళ్ళింది.గంట  అయ్యాక  సృహ  వచ్చిన  సృజనకూ  కొత్త స్థలం లో ఉన్నట్టుగా అనిపించి ఎక్కడ ఉన్నాను  అని  అడిగిం.ది దానికా ముసలమ్మా అమ్మ నేను మీ అమ్మ లాంటి దాన్నే   అబ్బాయి  నిన్ను వ్యభిచార గృహానికి అమ్మి  వేయాలని  వెళ్ళాడు అది  చూసి  నేను  నిన్ను  తీసుకుని  వచ్చాను  భయం  ఏమిలేదు  ఇక్కడ  అని  అంది..

 దాంతో తెలివి తెచ్చుకున్న సృజన  బాల  తనని  అమ్మేస్తాడా  అని  అంది  కావాలంటే నువ్వే చూడు నీ కోసం వాళ్ళు ఎలా తిరుగుతూ వెతుకుతూ ఉన్నారో అని చూపించింది అవ్వ బాల తో పాటుగా ఇంకో నలుగురు రౌడి వంటి వారు వెతుకుతూ  కనిపించే సరికి  సృజన మళ్ళి లోపలి వచ్చేసి కూర్చుని ఏడుస్తూ తాను తన తల్లి తండ్రి ని ఎలా బాధ పెట్టాలని  అనుకుందో  వారిని ఎంత అస్యహించుకుందో తన అన్నయ్యల తో ఆడుకున్న ఆటలుపాటలు బాల తో పరిచయం శ్యాం  మామయ్య  మంచితనం అన్ని గుర్తుకు వచ్చి నేను చేసింది చాలా తప్పు నాకు బతికే అర్హత లేదని అనుకుని తల్లిదండ్రులను బాధ పెట్టాలనుకున్న తనను బాల డబ్బు తీసుకుని నగలు తీసుకుని తనని వాడుకుని ఎలా అమ్మాలని చూసాడో గుర్తుకు వచ్చి తల్లిదండ్రులకు పరాయి వాడికి ఉన్న తేడా  గుర్తించి ఇక  ఇప్పుడు  చేయగలిగేది  ఏమి లేదని తాను చేసిన  పనికి  పశ్చాతాప  పడింది.

 

అవ్వ ఏడుస్తున్న సృజన ను ఓదార్చి తల్లిదండ్రులు  పిల్లలు   తప్పు చేసినా అర్ధం  చేసుకుంటారు  అని కడుపులో పెట్టి చూసుకుంటారు వాళ్ళు ఉన్నన్ని రోజులు నీకే  కష్టాన్ని రానివ్వరు  నువ్వు  ఇంకా  చాలా చిన్న దానివి నీకు చాలా జీవితం ఉందని నీ తల్లిదండ్రుల వద్దకు నేను వచ్చి దిగబెడతా అని అంది దాంతో అవ్వకు తల్లిదండ్రుల అడ్రెస్స్ చెప్పడం తో అవ్వ బాలా కు కనబడకుండా సృజనకు బురఖా వేసి ట్రైన్ ఎక్కించి ఇద్దరు కలిసి ఊరికి వెళ్లారు.ఊర్లోకి వచ్చిన సృజనని చూసిన తల్లిదండ్రులు తమ కూతురు తమ కోసం వచ్చినందుకు ఆనంద పడి హత్తుకున్నారు పాపం మీనాక్షి కూతురు కోసం బెంగ పెట్టుకుని మంచంలోపడింది ఆమె కూతుర్ని చూసి ఆనందపడి తమ కూతురు చేసిన తప్పును డబ్బును బంగారాన్ని ఏమిఅడగకుండానే కూతురు  ప్రాణం తో వచ్చినందుకు సంతోష పడ్డారు. అన్నలు కూడా చెల్లిని చూసి సంతోషించారు. అన్ని రోజుల తర్వాత తన తల్లిదండ్రులను చూసిన  సంతోషo లో  వారిని  ఎప్పుడు  వదిలి వెళ్ళి పోవద్దని నిర్ణయించుకుంది సృజన…..

 

Related Posts