పాపం ప్రేమ
ప్రేమ కెప్పుడూ గాయాలే!
పాపం ప్రేమ ఎవరి వల్లనైనా
బాధ పడడమే! అది ప్రేమికుల
విషయం లో కావచ్చు, లేదా
తల్లీ కొడుకుల విషయం, లేదా
అక్కా చెల్లీ ఇలా రక్త సంబంధాలే
కాకుండా స్నేహితుల విషయం లో
కూడా కావచ్చు…
ఎక్కువ ఎవరిని ప్రేమిస్తామెా అక్కడే
ఈ గాయాలు!
ఇంక ప్రేమికుల విషయంలో ఎక్కువ
అమ్మాయి వాల్లకు నచ్చకనో,లేదా
అబ్బాయి వాల్లకు నచ్చకనో గాయాలైతే
అమ్మాయి , అబ్బాయిల మధ్య తగాదాల
వల్ల కూడా గాయాలే!
అందుకే ఈ ప్రేమకు ఎప్పుడూ గాయాలే!
గాయాలు నాకెందుకని ముడుచుకుని
కూర్చుంటుందా? అస్సలు కూర్చోదు!
ప్రేమతో ఇదే తంటా!
ఉమాదేవి ఎర్రం