పాపానికి ఒడిగట్టకమ్మా…!!!

పాపానికి ఒడిగట్టకమ్మా…!!!

పల్లవి :—–

కడుపున మోసే
ఓ చల్లని తల్లీ దయజూడమ్మా…
ఆడ పిల్లని చిదిమేసి… లోకాన
పాడుచేసే పాపానికి ఒడిగట్టకమ్మా…

చరణం :—–

నాపై కోపమా
దోషమనే శాపమా…
కడుపుకోత కరుణరసం నీ కంటికి
కనిపించని చీకటి కోణాలమ్మా…
హృదయఘోష వింటున్నా
బండ పగలని మనస్సున స్వార్ధం
నింపుకొన్న విషవలయం కావద్దమ్మా…

చరణం :—-

కొండాకోనల జలపాతాలను
నేల తల్లి దాచేను కోయిలమ్మ పాటలను
పుడమి తల్లికి వినిపించేను…
పసిగుడ్డును నేనమ్మా పయనమై
వస్తున్నా కాపాడుకోవమ్మా…
కాలాన తరుగుతున్న నీ వయస్సుకు
తోడుగా నేనుంటానోయమ్మా…

చరణం :—-

కరుణ జూపిన నా కన్నీళ్ళతో
కాళ్ళు కడుగుతానమ్మా…
మాయని మమకారపు పిలుపునై
కంటికి రెప్పలా కాపాడుతానమ్మ….
నా పుట్టుకే బరువని పెరగడమే
దండగని అనుకొన్నా…
పుట్టుకతోనే పూలు పరిమళిస్తాయనే
నిజాన్ని మరువకనే మరువద్దోయమ్మా…

దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *