పిల్లలు ప్రశ్నించడం మొదలు పెట్టాలి
చాలా మంది పిల్లలు క్లాసులో టీచర్ పాఠం చెప్పే సమయంలో వారికి వచ్చిన
సందేహాలు వ్యక్తం చెయ్యరు. టీచర్ గారిని ప్రశ్నలు అడగాలి అంటే చాలా భయపడుతూ ఉంటారు.
అలాంటి పిల్లలలో రాహుల్ ఒకడు రాహుల్ తెలివిగల వాడు. బాగా చదివేవాడు కానీ టీచర్ పాఠం చెప్పే సమయంలో ఒకవేళ
తనకు పాఠం అర్థం కాకపోయినా ప్రశ్నలు అడగడానికి మొహమాట
పడేవాడు.ఒక రోజు సర్ ఒక కొత్త పాఠం చెప్పారు. రాహుల్ కు కొంత అర్థం కాలేదు. పాఠం చెప్పటం పూర్తి అయిన తరువాత ఏమైనా సందేహాలు ఉంటే
అడగండి అని టీచర్ చెప్పారు . రాహుల్ మాత్రం మొహమాటపడి తన సందేహాన్ని మనసులోనే దాచుకున్నాడు. ఇతర పిల్లలు టీచరుని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కూడా మౌనంగా కూర్చున్నాడు.
తరువాత పరీక్షలు వచ్చాయి.. రాహుల్ కొన్నింటికి సరైన సమాధానాలు రాయలేకపోయాడు. టీచర్ అతన్ని పిలిచి అడిగారు:
“రాహుల్, నీకు పాఠం అర్థం కాలేదా?”
రాహుల్ నెమ్మదిగా, “అవును సర్ . నేను ప్రశ్న అడగడానికి మొహమాట పడ్డాను” అని చెప్పాడు.
సర్ చిరునవ్వుతో
“ప్రశ్న అడగడం అంటే తెలివితక్కువ తనం కాదు రాహుల్. అది తెలివి ఉన్నవారి లక్షణం.
ప్రశ్నలు అడిగితేనే సందేహాలు దూరం
అవుతాయి.”
ఆ మాటలు రాహుల్ మనసులో నిలిచిపోయాయి.
ఆ రోజు నుంచి అతను ధైర్యంగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ప్రశ్నించడం నేర్చుకున్న రాహుల్ కొద్దికాలంలోనే క్లాస్‌లో ఉత్తమ విద్యార్థిగా
పేరు తెచ్చుకున్నాడు.
వెంకట భాను ప్రసాద్