పిసినారి రంగయ్య
ఒక ఊర్లో రంగయ్య అనే యువకుడు ఉండేవాడు.
వాడికి పన్నెండేళ్లు ఉన్నప్పుడే తల్లితండ్రులు ఒక
యాక్సిడెంటులో చనిపోయారు..
అప్పుడు వీడు బడికెళ్లడం వలన బ్రతికిపోయాడు..
ఒక్కడే సంతానం కావడంతో తోబుట్టువులెవరూ లేరు..
దగ్గరి బంధువులు కూడ ఎవరూ లేరు దాంతో ఒక్కడే
ఒంటరి జీవనం సాగిస్తున్నాడు..
పల్లెటూరు కావడంతో ఆ ఊరి వాల్లె వానికి అండగా
నిలిచారు.
చదువు మానేసి అన్ని పనులు చేసుకుంటు వచ్చిన
డబ్బులతో కాలం గడుపుతున్నాడు….
ఊరి వారందరితో కలిసి మెలిసి ఉండడంతో అందరూ
వాడిని ఆప్యాయంగానె చూసేవారు….
రంగడు అలా పెరుగుతూ యుక్తవయసుకి వచ్చాడు..
చాలా కష్టపడి సంపాదిస్తుండడంతో వాడు కొంచం
పిసినారిలా తయారయ్యాడు….
వయసుకు వచ్చిన రంగయ్యకు పెళ్లి చేయాలని ఆ ఊరి
పెద్దమనిషి పక్క ఊరి నుండి సంబంధం తెచ్చాడు..
ఆ పిల్ల మనవాడికి నచ్చడంతో ఆ ఊరి వాల్లు కలిసి
ఘణంగా పెళ్లి చేసారు….
రంగయ్యకు కొత్త పెళ్లాంతో కొత్త జీవితం ప్రారంభమయింది….
రంగయ్య పెళ్లాం పేరు లక్ష్మి ఆమె ఇంట్లో అడుగు పెడుతూనె…
ఇళ్లంతా బాగా చూసింది ఎక్కడా ఒక్క దేవుడి ఫోటో
కూడ లేదు..
ఏమండీ ఏమిటీ ఇంట్లో ఒక్క దేవుడి ఫోటో కూడ లేదు??? అని అడిగింది..
లక్ష్మి లాంటి నువ్వే అడుగు పెట్టావు ఇక నాకు దేవుళ్లు
దేవతలెందుకు??అన్నాడు మన రంగడు…
దాంతో లక్ష్మి భలే ఉబ్బిపోయింది..
అయినా పూజ చేసుకోవడానికి ఉండాలి కదా!!
ఎలాగయినా ఒక ఫోటో తీసుకు రమ్మంది…
సరేలేవె తెస్తాను అన్నాడు…
వాడు రోజు కష్టపడి తెచ్చిన సంపాదనంతా ఒక కుండలో దాచుకునే వాడు…
ఎంతో అత్యవసరమయితే తప్ప దాంట్లోంచి డబ్బులు
తీసేవాడు కాదు…
లక్ష్మి వచ్చిన దగ్గరినుంచి కొంచం డబ్బులు ఖర్చు అవుతూనె ఉన్నాయి…
లక్ష్మి మంచి వంటల కోసం కుండలో డబ్బులు తీసుకుంటుంది…
రుచికరంగా వంటలు చేస్తుంది రంగడికి కొసరి కొసరి
వడ్డిస్తుంది…
ఇదంతా రంగడికి నచ్చడం లేదు…
రోజూ కుండలో డబ్బులు లెక్కపెట్టుకునేవాడు…
రోజు రోజుకి కుండలో డబ్బు తరిగిపోతూనె ఉంది…
అమ్మెా!!ఇలా అయితే లక్ష్మి తీసుకుంటుందని ఒకరోజు
లక్ష్మి పడుకునే వరకు చూసి మెల్లగా లేచి ఆ డబ్బులున్న కుండను తీసుకుని పెరట్లో ఒక చెట్టుకింద
తవ్వి పెట్టాడు..
కుండ పైన ఒక పల్చటి వెడల్పాటి బండను మూతగా పెట్టి పై నుంచి మట్టి కప్పేసాడు…
అలా లక్ష్మికి తెలియకుండా రోజూ తెచ్చిన డబ్బులన్ని
ఆమె పడుకున్నాక వాడి ఖజానలోకి పోయేవి…
లక్ష్మి ఏమండీ డబ్బుల కుండేది???అని అడిగితే ..
నీ కెందుకు??? నీకు కావాలంటె నన్ను అడుగు ఇస్తా!
అనేవాడు…
కొన్నిసార్లు ఇచ్చేవాడు కొన్నిసార్లు తప్పించేవాడు…
ఒకసారి తినగలిగే భోజనాన్నె రెండు పూటలా తినాలనే
వాడు…
ఏది కొందామన్నా అసలేం కొననిచ్చేవాడు కాదు…
వీడి పిసినారి తనానికి లక్ష్మికి విసుగొచ్చేది…
అయినా ఇక చేసేది ఏం లేక అలవాటు పడిపోయింది..
రోజూ మాత్రం లక్ష్మి పడుకున్నాక ఖజాన (అదే వాడి డబ్బుల కుండ) తెరిచి డబ్బులు లెక్క పెట్టుకోందె వాడికి
నిద్ర పట్టకపోయేది….
రోజూ టార్చ్ లైటు వెలుతురులో లెక్కపెట్టుకునేవాడు…
ఆ ఊర్లో ఎక్కడో దొంగలు పడ్డారనే వార్త లక్ష్మికి పక్కింటి
వాల్ల ద్వారా తెలిసింది….
ఏమండీ మీరు డబ్బులు ఎక్కడ దాస్తున్నారో నాకు
తెలియదు కాని ఊర్లోకి దొంగలు వచ్చారట జాగ్రత్త
మనకున్నవే ఆ కాసిన్ని డబ్బులు కదా!!దొంగలపాలు
చేయకండి అని హెచ్చరించింది…
అయినా సరే రంగడు మాత్రం తన ఖజాన అక్కడే
ఉంచాడు..
లక్ష్మి తెలుసుకుని డబ్బులు తీసుకుంటుందేమెానని..
వీడు టార్చ్ పెట్టి డబ్బులు లెక్కిస్తుంటె ఊర్లోకి వచ్చిన
ఒక దొంగ చూడనే చూసాడు….
ఇంకేముంది మరునాడు వీడి ఖజాన ఖాళీ……
పాసుపండ్లోడు(రంగయ్య) దాచి దాచిపెడితే బంగారు పండ్లోడు(దొంగ) కాజేసాడు…
పిసినారి రంగయ్య లబోదిబో మన్నాడు…
పెళ్లాం చెప్పినా వినకపాయె….
పెళ్లాం ఖర్చు చేసినా కొంతయినా మిగిలేది..
ఇప్పుడసలుకే మెాసం అయింది…..
దాంతో రంగయ్యకు బుద్ది వచ్చి పిసినారి తనం వదిలేసి
చక్కగా భార్యకే డబ్బులు తెచ్చిచ్చి అన్యోన్య కాపురం చేసాడు….
ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు….