పుట్టిన రోజు

పుట్టిన రోజును అందరు ఎందుకు చేసుకుంటారు మీకు తెల్సా నాకు అసలు తెలియదు బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషపడి పడి మందికి చెప్పుకుంటారు కదా మళ్ళి ప్రతి సంవత్సరం చెప్పుకోవడం చేసుకోవడం ఎందుకు ? ఏం సాధించారని చేసుకోవడం చిన్నపిల్లలు అంటే బళ్ళో చాక్లెట్స్ పంచి దాన్నొక పండగలా చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి వారికీ పుట్టిన రోజు పండగలు చేస్తాం

మరి మనం ఎందుకు చేసుకుంటాం బట్టల కోసమా లేదా కేకుల కోసమా నాకు వయస్సు పెరిగిపోతుందోచ్ అని చెప్పుకోవడానికా ఎందుకో ఏమోపుట్టిన రోజు పండగ రోజైనా కనీసం సంతోషంగా ఉండొచ్చుఅనా ఏమో అంతే అయ్యి ఉంటుంది పాపం మిగతా రోజుల్లో మనలని ఎంతో మంది తిడుతుంటారు అవన్నీ తప్పించుకోవాలి అంటే ఇదొక్క రోజే మన రోజు గా అయ్యింది ఇప్పుడు ఎలా అంటే అమ్మ తిట్టింది అనుకో అయ్యో పుట్టిన రోజు నడు తిడుతున్నావు అంటారు దాంతో అమ్మ మనకు ఇంకో వంద ఎక్కువ ఇచ్చి సారి అంటుందితర్వాత లవర్ తిడితే బున్గాముతి పెట్టమనుకో మనకు ఇంకో పెద్ద గిఫ్ట్ వస్తుంది.

ఇంకా ఆ రోజు మనం ఏ పని చేయకుండా ఉండొచ్చు హయిగా లేట్ గా లేవోచ్చుకొత్త బట్టలు కట్టొచ్చు ఇక బాస్ అయితే బర్త్డే విష్ చేస్తూ మనలని ఆ రోజు ఏమి అనడుఇదంతా ఒక వైపు మరో వైపు అంటే నిజం ఉన్న వైపు ఏమిటో తెల్సా ఒక్కో పుట్టినరోజు వస్తున్న కొద్ది నీ వయస్సు పెరుగుతుంది కానీ నీకున్న బాధ్యతలను తీర్చుకోనీ వారికీ మంచి భావిష్య్తుని ఇవ్వుఉన్న అప్పులు కట్టుకోఎదిగిన కుతుర్ల పెళ్లి చెయ్యికొడుకులకు దరి చూపునీ భార్యకు ఏ కష్టం రాకుండా చూసుకోనీ తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకో అంటూ మన బాధ్యతలని గుర్తుచేస్తూఒక్కో యేడు పెరిగిన కొద్ది ఒంట్లో ఉన్న సత్తువ తగ్గి చావు దగ్గరికి వస్తున్నాడని రోగాలన్ని దరిచేరతాయంటూ గుర్తుచేస్తుంది పుట్టిన రోజు 

ఇది ఉన్న వాడికి పండగ లేని వాడికి పండగేమధ్యతరగతి వాడికి పండగే ఎందుకంటే కనీసం ఆ రోజైన కడుపు నిండా తినొచ్చు అని ఎందుకంటే ఉన్న వాడు డైటింగు పేరు తో కడుపు మాడ్చుకుంటాడు ఆ ఒక్క రోజు చేటింగు డే అంటూ కడుపు నిండా నచ్చినవాన్ని తినోచ్చ్చు అని వాడి ఆశఇక లేని వాడికి ఆ రోజు పండగ ఎందుకంటే కనీసం ఆ రోజైనా కడుపు నిండా తినొచ్చు ఈ అవరోధాలు లేకుండా అని ఎలా వాడు లేనోడు కదా అని అడక్కడి అడుక్కుని అయినా  కడుపునిండా తింటాడు కనీసం వాడు పని చేసే దగ్గర చెప్పుకున్నా అయ్యగారో అమ్మగారో వాడికి తిండిలేదా బట్టలు ఇస్తారు దాంతో వాడు కడుపునిండా తింటాడు ఉన్న దాంతో..

ఇక మధ్యతరగతి వాడు వాడె అసలు వాడు వాడికి ఎన్నో కోరికలు అటూ ఉన్న వాడు కాదు ఇటూ పూర్తిగా లేని వాడు కాదు మంచి బట్టలు తొడగాలి అనికేకులు కట్ చేయాలనీ పెద్ద హోటల్ లో డిన్నర్ చేయాలనీ ఇలా వాడి కోరికలకు అంతు ఉండదు త్రిశంకు స్వర్ఘం లో తన ఉహల్లో విహరిస్తూ ఉంటాడు

ఇవేవి తిరేవి కావని తెల్సినా ఆశ పడుతూ ఉంటాడుకనీసం ఆ రోజైనా అమ్మ పాయసం చేస్తుంది అని పచ్చడితో కాకుండా కూరవేసుకుని అయినాతినొచ్చు కడుపునిండా అని తండ్రి అప్పుచేసైనా కొత్తబట్టలు కొంటాడు అని ఆశగా ప్రతియేడు తన పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటాడు మధ్యతరగతి వాడు.  

మధ్య తరగతి వాడికే అన్ని కావలి ఎందుకంటే వాడి కోరికలు తీరే మార్గం ఇదే కాబట్టి కనీసం పుట్టిన రోజు నాడైనా కడుపునిండా తినాలని ఆశ పాపం వాడు మాత్రం మనిషి కదా కోరికలు ఉండవా ఎంతసేపు భాద్యతల నడుమ నలిగి పోతాడుఒక్క రోజైనా మటన్ చికెన్ తినాలనిమంచి బట్టలు కట్టుకునిబాల్కనీ లో కుర్చుని సినిమాచూడాలనికుల్ద్రింక్ తాగలనిఆటోలో వెళ్ళాలి అని స్నేహితుల ముందు ఐసుక్రీం తినాలని వాడికి అనిపించదు

మరి ఇవ్వన్ని తీరే మార్గం ఏంటయ్యా అంటే అదే పుట్టిన రోజు పండగ అది ఎవరికీ గుర్తు లేక పోయినా వాడె వారికీ రేపు నా పుట్టిన రోజు అంటూ చాటింపు వేసి ఆ ఒక్క రోజు రాజులా ఫీల్ అవుతాడు కాదా ?అవునా ?చెప్పండి మీరు కూడా మీ చిన్నతనం లో ఇలాగె అంటే స్నేహితుల ముందు బిల్డప్ లు ఇచ్చారా నాకు చెప్పండి.. 

అదండీ పుట్టిన రోజుల ప్రస్థానం మరి ఇదంతా ఇప్పుడెందుకు అంటారా ఎందుకంటే ఎందుకంటే మరి మరి రేపు నా పుట్టిన రోజండి అందుకే ఇదంతా చెప్పేస్తున్నా అండి హ హా మీరు నాకు శుభాకాంక్షలు చెప్తారా మరి ..

Related Posts