పుత్తడి బొమ్మలా వచ్చి

 

అంశం :- నీరాజనం
రచన :- ఆదిత్య శివశంకర కలకొండ
ఊరు :- మాటూరు (మిర్యాలగూడ)

పుత్తడి బొమ్మలా వచ్చి
పున్నమి రేయిన
జాబిలి ని ముద్దెట్టుకున్నావు..

వెన్నెల మధువు ను సేవించి
చందమామ ఒడిలో
కలల ఊయలలూగుతున్నావు..

చీకటిని కావలించుకుని
ప్రమిదను ప్రక్కకు నెట్టి
రాతిరి సెగ లో నన్నల్లుకున్నావు..

అమృతము నాకు ఇచ్చి
గరళము సేవించి నీవు
ప్రేమ క్షీరసాగర మథనానికి తెరతీశావు..

ప్రేమలో నేను అమరుడనైతే
నీవు సమిధవై
నన్ను గెలిపిస్తూ నువ్వోడిపోయావు.

నాది స్వార్థం , నీది ప్రేమ
నాది వాంఛ , నీది అనురాగం
నాది అవసరం , నీది త్యాగం…

ప్రేమ కు కొలమానాలు ఎన్ని వున్నా
ప్రేమకు నిర్వచనాలు ఎన్ని చూపినా
ప్రేమకు పరమార్థం ప్రేమ నే…

అనిర్వచనీయ నిర్వచనాలకు
నిలువెత్తు అర్థం చెప్పే
మరణం లేని నీ అమర ప్రేమకు..

నేనిచ్చు ఆమరణ అమర నీరాజనం…

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *