పూజకు పనికి రాని పువ్వు

అదొక చిన్న గ్రామం.రెండు వందల గడపలు  కూడా లేని గ్రామం  కావడం తో దాన్ని ఒక మోతుబరి రైతు ఒకరు పాలిస్తూ ఉన్నాడు.అతని పేరు వెంకటయ్య అతని కన్నుసన్నల్లో వాళ్ళంతా జీవనం సాగిస్తూ ఉన్నారు.వారిలో మల్లయ్య ,అదేమ్మ దంపతులు ఒకరు.

ఆ ఊర్లో ఉన్న పొలాలు అన్ని వెంకటయ్య వి కావడం ,అతని కిందనే వారంతా పని చెయడo జరిగేది. అతనికి ఎదురు చెప్పినా,లేదా పని చేసే చోట డబ్బు ఎక్కువ అడిగినా వెంటనే అతను ఏమి అనకుండా మెల్లిగా వారికి పని దొరకకుండా చేసి,ఆకలితో చనిపోయేలా చేసేవాడు తప్ప,వారిని బయటి ఊర్లకు వెళ్ళి పని చేసుకోనిచ్చేవాడు కాదు.

మల్లయ్య,అదేమ్మ దంపతులు ఉన్న పొలాన్ని చూసుకుంటూ,వెంకటయ్య పొలంలో కూలి పనులు చేస్తూ ఉండేవాళ్ళు.అదేమ్మ వెంకటయ్య కంట పడకుండా,జాగ్రత్తగా పని చేసుకుని,మాట మాట్లాడకుండా వెళ్ళిపోయేది,

దానికి కారణం వెంకటయ్యకు అన్ని అవకరాలతో పాటుగా ఆడవాళ్ళ పిచ్చి కూడా ఉండేది.కానీ కాలం ఎప్పుడు ఒకటే తీరు గా ఉండదు కదా ,అదేమ్మ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా,ఒక రోజు వెంకటయ్య కంట్లో పడనే పడింది.

కంటికి నచ్చిన దాన్ని వదలని వెంకటయ్య, అదేమ్మ గురించి ఆరా తీసాడు,అతనికి ఆడవాళ్ళను సప్లయ్ చేసే మంగమ్మ అదేమ్మ గురించి వివరాలు అందించింది.

అదేమ్మ అంటే ఆడపులి అని,ఆమెని లోoగదీసుకోవడం మంచిది కాదు అని,ఒక వేళ లొంగతియ్యాలని చూస్తే మొదటికే మోసం వచ్చి,ఉన్న కాస్త మంచి పేరు కూడా పోతుంది,అని కాబట్టి ఆమె జోలికి వెళ్ళాక పోవడమే మంచిది అని సలహా కూడా ఇచ్చింది మంగమ్మ.

అలాంటి పొగరు మోతు ఆడవాళ్లు అంటే ఇష్టం ఉన్న వెంకటయ్య,ఎలాగైనా ఆమెని అనుభవించాలని ఉపాయం పన్ని,ఒక రోజు అదేమ్మకు ఎక్కువ పని చెప్పమని నౌకరుకు పురమాయించి,

అందరూ వెళ్ళేదాకా ఆమెని ఉంచి,నిస్సహయoగా ఉన్న ఆమె మిద అత్యాచారం చేసాడు,ఇష్టం లేకుండా బలవంతం చెయ్యడం తో ఆమె అతన్ని బాగా తిట్టింది,అతను నవ్వుతూ నిన్ను అనుభవించాలి అని ఆనుకున్నా నువ్వు మంగమ్మ చెప్పినట్టు పొగరుమోతు దానివే,

నీలాంటి దాన్ని అప్పుడప్పుడు ఇలా బలవంతంగా అనుభవిస్తే ఆ మజానే వేరు,ఇక నువ్వు పూజకు పనికి రాని పువ్వువి అని అంటూ ఆమె మీద కొన్ని రూపాయల నోట్లు విసిరేసి,నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు వెంకటయ్య. 

భార్య ని వెతుక్కుంటూ వచ్చిన మల్లయ్య అక్కడ జరిగిన ఘోరాన్ని చూసి,ఏమి మాట్లాడకుండా అదేమ్మ వద్దకు వచ్చి ఆమె కన్నీళ్ళు తుడిచి,ఆమె భుజాలు పట్టుకుని పైకి లేపి, ఇంటికి తీసుకుని వెళ్ళాడు మౌనంగా భర్త వెంట నడిచింది  ఆ పూజకు పనికి రాని పువ్వు….

Related Posts