పూవులు చంద్రహాస స్వప్నాలు
పూవులు నేలతల్లి పసిబిడ్డలు
నవవధువు పూసిన ముసిముసి నగవులు
కళల నేత్రాలలో సిరిసిరి మువ్వలు
అలల కెరటాలలో విరబూసిన నురగలు
చందమామ జలతారు వెన్నెల వర్షం పూజితలు
రంగు రంగు కలల సృజనల స్వరూపాలు
మనస్సు వేదనలు కరిగించే విరబూసిన పూవులు
ఏడేడు సముద్రాల కావలి లోకం పరిమళాల పుష్పితలు
నయనానందకరమైన శోభలలో వింత వింత అకృతులు
నాట్యమయూరి వాల్జడకు అల్లిన పూవులు సుశోభిత ఆకర్షితలు
ప్రియురాలి కోసం సేకరించిన రంగుల హృదయం ఒంపుకున్న పరిమళాలు
పుప్పొడి వెదజల్లి గండుతుమ్మెదలను ఆకర్షించే వికసించిన పూరేకులు
పూవులన్ని గుత్తులు గుత్తులుగా గృహిణి సౌందర్యం ఇనుమడింపజేసే జీవనజ్యోతులు
పూవులు రంగవల్లులు అలంకృత ముదిత మోము రాగాలు
జవ్వని భవిష్యత్తు స్వప్నాలు ఫలింపజేసే సహజసిద్ధ సుందరభావనలు
సురభామిణుల సౌందర్యం ఇనుమడింపజేసే గగుర్పొడిచే చర్మంలోని రక్తకేషనాళాలు
హరివిల్లు రంగుల పూవులు సుకుమారి మర్థవ ఆనందంలో అనకువల కువకువలు
ముఖంలో కష్టసుఖాల జీవితం అనుభవాల అనుభూతుల
నడివయస్సు మహిళల జీవనరాగాల రూపాలు,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట