పెనునిద్దుర వీడవోయ్ సోదరా,,,,!!
జీవితంలో ఆఖరి శ్వాస దాకా పోరాడుతూనే ఉండు
నీ గళం సహృదయులకు తట్టేది కలంతోనే
నీ అక్షరాలు యువతరం పెనునిద్దుర మేల్కొలిపే గీతాలు కావాలి,,,,,,
అంబరం దాకా నీ అక్షరాలు ఎగిసి ఎగిసిపడాలి
సామాజిక రుగ్మతలను ఎత్తిచూపుతూ పరిష్కారం సూచించాలి,,,,,
ఉరికంభం ఎక్కే పరిస్థితిలో సైతం నీ ఆలోచనలు జీవజలములు కావాలి,,,,,,
ఎన్నెన్నో కష్టాలకోర్చే నిరుపేదలు, అభాగ్యుల గుండెల్లో ధైర్యం నూరిపోసి అదనులో సంకెళ్ళు తెంచుకునే స్టైర్యం నివ్వాలి,,,,,
కేవలం అక్షరాల ఆర్భాటమే కాకుండా హృదయాల్లో వెలుగు పుంజాల మార్గం వేయాలి,,,,,,
నీ జీవితానుభవాల లోని సుమధుర ఘట్టాలను అక్షరాలను అంబులపొదిలోంచి తీసి వాడివేడి ఆలోచనలను సంధించి మూఢుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా గురిచూసి కొట్టాలి,,,,,,,
ఇంకెన్నాళ్లీ శారీరక వెట్టిచాకిరి ,అక్షరాల బానిసత్వం,,,,,,
అజ్ఞాన తిమిరాల్లో అంతెత్తున ఒడలు హూనమయ్యే కట్టడాలు అడ్డగోలుగా బలిసిన వాడికి చేసిపెడుతూ ఈ కన్నీటి రోదనలు ఇంకెన్నాళ్లు,,,,,,,
సంస్కారం,స్వయం ఉపాధి,స్వయం సమృద్ధి నేర్పని చదువులు చదివి బ్రిటిష్ కాలపు కొలువులనే గుమస్తాగిరి ఆఫీసర్లకై పెంపర్లాట ఇంకెన్నాళ్లు,,,,,,,
ఆవల నిరుపేద దేశాలు అనబడేవి మేధావులు ,శాస్త్రజ్ఞుల సేవలు ఉపయోగించుకుని అభివృద్ధి వైపు దూసుకెళ్తూ ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరుకుంటుంటే కళ్ళు కనిపించట్లేదా,,,,,,
తెగబలిసిన రాజకీయ నాయకులు అధికారం కోసం కులమతాల కుమ్ములాటలు పెట్టి ఓట్ల కోసం డబ్బులు గుప్పించి వెర్రి జనంతో దొమ్మీ యుద్దాలు చేయిస్తూ మేధావులు, విజ్ఞానులను అండర్ గ్రౌండ్లోకి నెట్టేసి రాజకీయ సమీకరణాలతో అందళాలెక్కి దేశాన్ని ఏం చేయడానికి,,,,,,,,
ఈ దేశంలో ప్రజాస్వామ్యం విఫలమైందని అందరికీ తెలుసు, ఎవ్వరూ ముందుకు రాకుండా కుమ్మక్కయ్యారా డాబుసరీ డబ్బుల నాయకులు,,,,,,,,,
ఉన్నత విద్యలు చదివిన జ్ఞానులు వలసలు పోతుంటే చోద్యం చూస్తున్నాయా ప్రభుత్వాలు,,,,,,,
మేల్కొపు గీతం నీ కోసమే రగిలి పొగమంటలై ఎగిసిపడాలి చేవవుంటే,,,,,
అపరాజిత్
సూర్యాపేట