పెళ్ళైన కొత్తలో

రూప లోకేష్ లు చక్కని జంట.వారికి పెళ్లి అయ్యి వారం రోజులే అయ్యింది. ఇంకా అత్తగారి ఇంట్లోనే ఉంది రూప రూప కు అన్ని దగ్గర ఉండి సర్దిస్తుంది అత్తగారు సౌజన్య. ఎందుకంటే రూప లోకేష్ లు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే కావడం వల్లఇద్దరు పెళ్లికి పెట్టిన సెలవులు అయిపోవడం వల్ల రేపే వెళ్లి జాబ్ లో జాయిన్ అవ్వాలిఈ రోజు సాయంత్రమే వారి ప్రయాణం. మొదటి రాత్రి కూడా అయిపోయింది కాబట్టి ఇక కొత్త అంతా పోయింది రూప కు తన పుట్టింట్లో ఉన్నట్టుగానే అనిపించింది. అంతగా కలిసి పోయారు అందరూ..

ఏంటి ఇంకా అవ్వలేదా మీ సర్దడం పదండి అక్కడ లేట్ అవుతుంది బస్ కికాస్త తినిరెడి అయ్యి ఉండండి బాదం కారు తీసుకుని రాగానే వెళ్దాం అన్నాడు లోకేష్ రూప నని దొంగ చూపులు చూస్తూ తల్లి తో మరి నీకేం కావాలో అన్ని సర్ది పెట్టోద్దా పైగా పెళ్లి లో స్వీట్ బాగుంది తీసి పెట్టు అన్నావుగా అది కూడా ఒక డబ్బాలో వేసి ఉంచాను అంది తల్లి అమాయకంగా. మాటకు భార్య దగ్గర ఎక్కడ పరువు పోతుందో అని ఉలిక్కిపడి

సరే సరే మాకు ఏమైనా పెట్టేది ఉందాలేదా అని అడిగాడు తల్లిని వాళ్లిద్దరూ ఎదో మాట్లాడుకుంటారని అక్కడ నుండి మెల్లిగా జారిపోయింది తల్లిఇంతలో లోకేష్ చెల్లి లత వచ్చి ఒరేయి బస్ లోఆ తర్వాత ఫ్లాట్ లో మిరే కదా ఉండేది.మిరే కదా మాట్లాడుకునేది కాబట్టి ఇప్పుడు మాతో మాట్లాడనివ్వు మా ముద్దుల వదిన ని అంటూ రా వదిన అంటూ లాక్కెళ్ళింది.

అన్నయ్య ను ఉడికించే ఉద్దేశ్యం తో లత. అది చూసి రూప మూసి మూసి గా నవ్వుకుంటూ లత తో పాటు వెళ్ళింది. సాయంత్రం లోకేష్ రూప ఇద్దరు అత్తమామల ఆశీర్వాదం తీసుకుని బస్ ఎక్కారు.బస్ ఎక్కే ముందు ఇద్దరికి జాగ్రత్తలు చెప్పింది అత్తగారు.అన్నింటికీ సరేనని తలూపింది రూప.ఇక వారి జీవన ప్రయాణం మొదలయ్యింది.ఇద్దరూ ప్రొద్దున వెళ్తే తిరిగి సాయంత్రం రావడం  వండుకోవడంసరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినడం తర్వాత రతి సౌఖ్యం లో మునిగి తెలడం జరిగేది.అలా రెండు సంవత్సరాలు గడిచాయి. 

రెండేళ్ల లో రూప కు ఇద్దరు కవల పిల్లలు పుట్టడం తో లోకేష్ ని పట్టించుకోవడం మానేసి పిల్లలని చూసుకుంటూ ఉంది. కానీ లోకేష్ కు మాత్రం తన భార్య ఎప్పటిలా అలంకరించుకోవాలి అనితాను సాయంత్రం వచ్చే సరికి తన కోసం ఎదురు చూస్తూ ఉండాలని ఉండేది. కానీ అవేవి జరిగేవి కావుదాంతో కోపం వచ్చిన లోకేష్ రూప తో గొడవ పడేవాడు. అయిన దానికి కానీ దానికి చిన్న విషయాలకు గొడవ పడుతూ ఉండేవాళ్ళు.

రూప అది గమనించి ఏంటి నేనేమైనా ఊరికే ఉన్నాన పిల్లలతో భరించలేలపోతున్నమీరు కొంచం కూడా సహాయం చేయకుండాఇలా ఎలా మాట్లాడతారుఅప్పట్లో నా వెనకే తిరుగుతూనేనేం చేసినా వద్దుబయట నుండి తెస్తా అని నాకు రెస్ట్ ఇచ్చే వారు.ఇప్పుడు కనీసం తిన్నవా అని కూడా అడగడం లేదు.

అప్పుడే నా మీద మోజు తీరిపోయిందా అంటూ అరవడం తోలోకేష్ కూడా రూప మీద అరవడం స్టార్ట్ చేసాడు. హే అరవకు అప్పుడు నీ మీద మోజు ఉంది కాబట్టినువ్వు నేనే లోకంగా అనుకున్నావు.. నేను వచ్చేసరికి నువ్వు అందంగా అలంకరించుకుని ఉండేదానివి కాబట్టి నీ వెనక పడే వాడిని అన్నాడు లోకేష్.. అంటే

మీ మగాళ్ల కు అందం ఒక్కటే కనిపిస్తుందానేను మీ పిల్లలకు తల్లినిఇంకా అలా అలంకరించుకునిమీకోసం ఎదురుచూస్తు కూర్చోవాలి అంటే కుదరదు.పిల్లలని చూసుకోవాలివారికి అన్ని విధాలా చేయాలినా కష్టం మీకు కనిపించడం లేదానీ వంశాన్ని నిలబెట్టిన నన్ను ఒక బొమ్మలా చూస్తున్నావా అని అంటూఅరవడం తో ఒక్క నిమిషం ఆమెని అలా చూస్తూ ఉండిపోయాడు లోకేష్.అవును నిజమే కదాతాను కోణం లోంచి ఆలోచించలేదు.

నా వంశాన్ని నాకు అందించిన నా ఇంటి మహారాణి ని నేనెలా తప్పు బడతాను.అవును నిజమే పిల్లలు పుట్టిన తర్వాత అందంగా అలంకరించుకోవాలి అంటే ఎలా కుదురుతుంది.తానెప్పుడూ తన గురించే ఆలోచించాడు. తప్పితే తన గురించి ఆలోచించలేకపోయాడు. తన జీవితంలో మగాడు అన్న బిరుదుని ఇచ్చిన భార్యని ఎలా తప్పుబడుతున్నాడు.

 తనకి నిష్కృతి లేదుపాపం ఎంత భాద పడిందో అని అనుకున్న లోకేష్  ఇంకా ఎదో అనబోతున్న భార్య రూప ని చటుక్కున కౌగిలి లోకి తీసుకునితన రెండు పెదాలతో ఆమె పెదవులను మూసేసాడు భర్త కౌగిలిలో గువ్వలా ఒదిగి పోయింది రూప..”

Related Posts

5 Comments

  1. చిన్న దానిలో మంచి జీవితం చూపించావు భవ్యా

  2. Short గా బాగుంది.మంచి పొలిటికల్ అంశం వస్తువుగా తీసుకోవడం బాగుంది.రాయడంలో కామాలు, ఫుల్ స్టాప్ లు మిస్ అయ్యాయి.

  3. చాలా చాలా చాలా బాగుంది మేడం..నైస్..👌👌👌👌💐💐💐💐

  4. ప్రతి కుటుంబం లోనూ అతి సహజంగా ఏర్పడే సంఘటనను సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించారు. బాగుంది. ఓర్పు ఎప్పుడూ గెలుస్తుందని నిరూపించారు. కృతజ్ఞతతో.

Comments are closed.