పొరుగు వాడికి తోడు పడవోయి

నమస్తే ఆంటీ, నా పేరు దాక్షాయని  మేము ఇంట్లోకి కొత్తగా అద్దెకు వచ్చాము, అని తనని తాను పరిచయం చేసుకుంది దాక్షాయని ఎదురింటి భావనతో, భావన అమ్మాయిని విచిత్రంగా కింద నుండి పైకి ఒక సారి చూసి, లోపలికి వెళ్లబోయింది. అయ్యో ఆంటీ నేను మీతో మాట్లాడాలనే నిన్నటి నుండి చూస్తున్న, మీరు అలా వెళ్ళిపోతే ఎలా అంది భావనను లోనికి వెళ్లకుండా ఆపుతూ దాక్షాయని,

అయితే నువ్వు నాతో మాట్లాడడానికె ఇక్కడ నిలబడ్డవా, సరే అయితే బయట ఎందుకు లోపలికిరా, మాట్లాడుకుందాం అంది భావన తలుపును మొత్తం తీసి పెడుతూ, అవునంటి మీరు కనిపిస్తే మాట్లాడాలని అనుకున్నా, కానీ మీరెప్పుడు  బయటకు రానే రారుకదా ఆంటీ అంది లోపలికి వస్తూ దాక్షాయని, రమ్మా కూర్చో అని సోఫా చూపించింది భావన.

సోఫాలో కూర్చుంటూ, ఇల్లంతా పరీక్షించి చూస్తూ, ఆమె చూస్తున్న ఇల్లుని, ఇదేనమ్మా నా ప్రపంచం అంది. ఉన్నంతలో బాగానే సర్దుకుంది భావన తన ఇల్లుని, రెండు బెడ్రూమ్ ప్లాట్ అది, లోపల తల్లిదండ్రులు ఉన్నట్టు ఉన్నారు. అయ్యిందా అంది భావన దాక్షాయని ని చూస్తూ, అయిపోయింది ఆంటీ మీరు ఇంటిని బాగా సర్దుకున్నారు, అదే చూస్తున్న అంది దాచుకోకుండా దాక్షాయని, ఆమె మాటలకు ఒక మంచి భావన ఏర్పడింది ఆమె మీద.

ఉండమ్మ కాస్త టీ పెడతా అంది భావన. అయ్యో వద్దు ఆంటీ, మిమల్ని కొన్ని విషయాలు అడగాలని వచ్చాను, కాబట్టి మీరు ఇలా కూర్చోండి అంది దాక్షాయని. నాతో నా ఏంటమ్మా అంది భావన. అదే ఆంటీ మేము ప్లాట్ లోకి వచ్చి దాదాపు వారం రోజులు అవుతుంది. వారం రోజుల్లో ఇందులో ఉన్న వారందరూ నాతో మాట్లాడారు. ఒక్క మీరు తప్పా,మీరెందుకు ఆంటీ ఎవరితో మాట్లాడరు అంది దాక్షాయని. అయితే ఇంకా నా గురించి ఎవరు ఏమి చెప్పలేదా, నీకు ఇంకా విషపు గలు నికింక సోకాలేదులా ఉంది అంది భావన.

లేదంటి నాకు మీ గురించి ఎవరూ ఏమి చెప్పలేదు. మీ గురించి నాకు తెలుసుకోవాలి అనిపించింది అందుకే మాట్లాడాలని ఇలా కాపు కాసాను అంది దాక్షాయని. అవునమ్మా, ఇక్కడ ఎవరూ నాతో మాట్లాడారు. పైగా వచ్చిన వాళ్లకు కూడా నా గురించి ఎంతో కొంత విషాన్ని ఎక్కించి, మాట్లాడకుండా చేస్తారు. అలా చేయబట్టే నేను ఎవర్నీ పట్టించుకోకుండా ఇలా నా పనేదో నేను చేసుకుంటా అంది భావన. అదే ఆంటీ ఎందుకు మీరు ఇలా అయ్యారో నేను  తెలుసుకోవచ్చా అని అడిగింది దాక్షాయని.

సరేనమ్మ నేను నీకు అంతా చెప్తాను, మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో అందరూ మా గురించి అన్ని విషయాలు తెలీసుకున్నారు. ఆస్థిపాస్థులు, నగలు, ఇలా అన్ని విధాలా మేము ఎంత బాగున్నామో తెలుసుకున్నారు. మా ఇంట్లోకి వచ్చేవారు, మమ్మల్ని వారింటికి మాత్రం పిలిచే వారు కాదు. అలాగే మా బాబు చిన్నవాడు వాడితో పాటుగా ఇక్కడ ఉన్న వారి పిల్లలకు కూడా అన్నం కలిపి పెట్టేదాన్ని, అలా అంతా బాగున్నది అనుకునే సమయంలో మీరు ఇప్పుడున్న ప్లాట్ లో ఒక కుటుంబం ఉండేది.

మాకు వారికి ఒక చిన్న గొడవ నీళ్ల దగ్గర జరిగింది. దాంతో కొందరు అటు వైపు, కొందరు నా వైపు ఉండి రాజకీయాలు చెయ్యబోయారు. నేను వాటిని తిప్పి కొట్టి ఆవిడతో మళ్ళీ కలుసిపోయాను. అది కొందరికి నచ్చలేదు.  పైగా నేను ఎవరింటికి వేళ్ళను, ఎవరిని నా ఇంటికి పిలవను, వారికి ఎలా అంటే వారిని ఇంటికి పిలవాలి, నా ఇంట్లో వండుకున్నది వారికి పెట్టాలి నాకు లేకున్నా సరే వారికి మాత్రం పెట్టాలి.

నేను ఏదయినా కొనాలి అంటే వారిని షాపింగ్ లకు తీసుకుని వెళ్ళాలి, వారు సెలక్ట్ చేసిన దాన్నే కొనాలి, దాన్ని వారు రెండు మూడు సార్లు కట్టుకున్న తర్వాత నాకు ఇచ్చేస్తే, అదే భాగ్యం అనుకుని కట్టుకోవాలి, వారి అడుగులకీ మడుగుల వత్తుతూ, వారిని పొగుడుతూ ఉండాలి.

అలా చేస్తే వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారని అనుకోవద్దు. ఇక్కడ మన దగ్గర తింటూ మన గిరించి చెడు గా పది మందికి చెప్తారు. నాకు అవ్వన్ని నచ్చలేదు. నా ఇంట్లో, నా డబ్బుతో నాకు నచ్చింది నేను వండుకుని తింటా, వారికి ఎందుకు పెట్టాలి, పైగా షాపింగ్ లకు తీసుకుని వెళ్ళు వారికి కొనివ్వాలి అవ్వన్ని నాకు అవసరమా అని అనిపించింది.

అదేదో సామెత ఉన్నట్టుఅత్త పోరు కాదు, మమాపోరు లేదు కానీ గుడిసెలో గుడ్డీ వాడు పోరు అన్నట్టుగా అయ్యింది నా పరిస్థితి. దాంతో వారికి కొనే, పెట్టె డబ్బులు నా వారికి ఎదో కొనొచ్చు కదా అని ఆలోచించి, అందరితో మాట్లాడడం మానేశా, అలా అని నేను అంత రాక్షసి ని ఏమి కాదు. హాయ్ అంటే హాయ్ బై అంటే బై అంత వరకు బానే ఉంటా, నా పర్సోనల్ కూడా వారికి చెప్పాలి , నాకు అవసరం లేదు.

నాలుగు గోడల మధ్య నాది నేను పరిష్కరించు కుంటాను. వీరికి చెప్పనే అనుకో అది ఇక టీవీ యాడ్ కన్నా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అందుకే ఎవర్నీ పట్టించుకోకుండా, నా పనేదో నేను చేసుకుంటా, అందుకే వారికి మంట, దాంతో వచ్చిన వారికి అల్లా నా గురించి ఏదేదో చెప్తారు, నాతో కొత్తవారిని ఎవర్నీ మాట్లాడనివ్వరు.

ఇదమ్మ పెడితే పెళ్లి కోరతారు. లేదంటే చావు కోరతారు అలాంటి వాళ్ళు విల్లు అని అంటూ తన బాధని చెప్పుకొచ్చింది భావన. అంతా విన్న దాక్షాయని మరి ఇక్కడ ఎందుకు ఆంటీ ఉండడం, ఖాలీ చేయొవచ్చు కదా అంది. అవునమ్మా చేయాలనే అనుకున్నాం కానీ ఇదేమో స్వంత ఇల్లు అయ్యింది పైగా దీని అప్పు కూడా తీరలేదు.

అయినా తప్పు వాళ్ళలో ఉంది. తెరగా పడి తింటాను అంటే ఎవరు మాత్రం పెడతారమ్మా అంది భావన. అవునాoటి మీరు అన్నది నిజమే. పక్క వారి మీద పడి తింటే ఏమొస్తుంది అయినా ఇరుగు పొరుగు అన్నప్పుడు కలసిమెలసి ఉండాలి, ఏదయినా కష్టం వస్తే  ఆదుకునే లాగా ఉండాలి. కష్టమా తల్లి నాకు ఒక్క పూట తిండి లేదు అంటే ఎవరైనా పెడతారనుకున్నవా, నా ఇంట్లో కొంచం గట్టిగా మాటలు వినిపిస్తే చాలు, ఏం లొల్లి అని అందరూ ఇళ్ల ముందుకు వచ్చి కుర్చుంటారు తెలుసా

ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఇప్పుడు అందరూ బయట నిలబడి మన మాటలు వింటూ ఉంటారు. అంది భావన. ఇలాంటి వారి ఇళ్లలో లక్ష తప్పులు ఉంటాయి. కానీ వారు బయటకు  మాత్రం మంచి వాళ్ళ లా బిల్డప్ లు ఇస్తూ ఉంటారు. అంది దాక్షాయని, ఏమోనమ్మా మనం ఎందుకు వారిని అనాలి. ఎవరి జీవితాలు వారివమ్మా,మనం సహాయం చేయనప్పుడు మాట్లాడకుండా ఉండడమే మంచిది అంది భావన. అబ్బా ఆంటీ మీరు నిజంగా చాలా గ్రేట్ ఆంటీ. మీ గురించి వాళ్ళు అలా మాట్లాడినా, మీరు మాత్రం వారి గురించి తప్పుగా మాట్లాడడం లేదు మిమల్ని అంటున్న వాళ్ళు నిజంగా మూర్ఖులు ఆంటీ అంది దాక్షాయని.

ఎదో అమ్మా, నువ్వు అయినా ఇలా వచ్చి మాట్లాడుతున్నావు, చాలా సంతోషం అమ్మా, ఉండు టీ తీసుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది భావన. ఆవిడ మంచి మనసుని మెచ్చుకోకుండా ఉండలేక పోయింది దాక్షాయని.  టీ తాగి మళ్ళీ వస్తాను ఆంటీ అని చెప్పి వెళ్లి పోయింది దాక్షాయని. ఇరుగు పొరుగు అంటే బాధల్లో తోడుగా, అవసరానికి సహాయం చేసేలా ఉండాలి తప్పితే, పిశాచాల్లా వేపుకు తినకూడదు. 

మళ్ళీ ఇంకో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం….

Related Posts