పోలిక

హాస్పిటల్ లో నీరసంగా కళ్ళు తెరిచింది జ్యోతి ఏంటి బాగా భయ పెట్టావు తెలుసా అన్నాడు పక్కనే ఉన్న రామ్ అవునా అంటూ నీరసంగా నవ్వి తిరిగి కళ్ళు మూసుకుంది అలసటగా ఉండడం తో ఆ కళ్ళ వెనక అంత వరకు పడిన కష్టానికి ఫలితం ఎదన్నది గుర్తుకొచ్చి మళ్ళి కళ్ళు తెరిచింది అలా ఉల్లిక్కి పడి కళ్ళు తెరిచిన జ్యోతిని చూసి నవుతూ నాకు తెలుసు నువ్విలా చూస్తావని అన్నాడు సరే కానీ ఎవరు అంది పొడిబారిన పేదలను నాలిక తో అద్దుతూ బాబే అన్నాడు ఎక్కడ అని అడిగింది పక్కనే ఉన్న బెడ్ లోని బాబుని తీసి చూపించాడు తీసి పక్కనే పడుకో బెట్టండి అంది

లేదు జ్యోతి ఇప్పుడే కాదు డాక్టర్ గారు ఇంకో అరగంట అయ్యాక ఇవ్వమని అన్నారు అని నీకు తెలుసా బాబు అచ్చు ప్రకాష్ లాగానే ఉన్నాడు అంటూ నవ్వుతూ ఆ పక్కనే ఉన్న బెడ్ లో పడుకోబెట్టాడు జ్యోతి దగ్గరికి వస్తూ జ్యోతి నువ్వు నన్ను తండ్రిని చేసావు నాకొక హోదాని ఇచ్చావు చాలా థాంక్స్ నీకు వేడి పాలు తెస్తాను అంటూ నుదుటి పైన ముద్దు పెట్టుకుని వెళ్ళి పోయాడు బయటకు ..ఆ మాట తో ఆమె హృదయం ఉప్పొంగి పొయింది అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది…. జ్యోతి,

అమ్మ కాస్త కళ్ళు తేరు బాబుకి పాలు పట్టు, అంటున్న తల్లి గొంతు విని కళ్ళు తెరిచింది జ్యోతి. ఇంతలో ఎంటమ్మ? ఇప్పుడు ఎలా ఉంది అంటూ వచ్చింది డాక్టర్ నవ్వుతూ…. బాగుంది అన్నట్టు తల ఊపింది జ్యోతి. ఈరోజు పాలు పడతాయి మూడు రోజులు సరేనా? ఇవే ముఖ్యం బాబుకి. అవును బాబుని చూసావా? ఇవ్వమ్మా అంది తల్లితో. పక్కనే పడుకోబెట్టిన బాబుని తీసి జ్యోతికి అందించింది తల్లి. పక్క మీద పడుకున్న జ్యోతి, బాబుకి తన అమృత ధారలను బాబు నోటికి అందించింది.

ఆ అలా కాదమ్మా, ఇదిగో ఇలా అంటూ బాబుని సరిగ్గా పడుకోబెడుతూ, ఇదిగో ఇలాగే ఇవ్వాలి అని చెప్పి, మరి నేను వెళ్తాను అని అనగానే, డాక్టర్ గారు, అమ్మాయికి పత్యం ఏం పెట్టాలి? అంది తల్లి. పత్యం అంటూ ఏమి లేదమ్మా అన్ని పెట్టండి అంటూ ముందుకు వెళ్ళింది డాక్టర్. ఆమె అలా వెళ్ళగానే, జ్యోతి బాబు అచ్చం ప్రకాష్ పోలికే అంది నవ్వుతూ, ఆ మాటతో కొంచెం చిరాకు పడిన జ్యోతి, అమ్మా ఎంటమ్మ నువ్వు కూడా, ఆయన కూడా ఇదే మాట అన్నారు. దాంతో తల్లి, అచ్చు అలాగే ఉన్నది చెప్తే విసుక్కుoటావు ఏంటి? అని అంటుండగానే, జ్యోతి అత్తగారు, మామగారు మిగిలిన బంధువులు అటా అక్కడికి వచ్చారు.

దాంతో అక్కడ అంతా సందడిగా మారింది. అందరూ బాబుని చూడడం, ప్రకాష్ లాగానే ఉన్నాడు అని అనడం, ఇలా జ్యోతి తల్లి దండ్రులే కాక, అత్తగారు, అక్కలు, బావలు, చివరికి భర్త కూడా, అంతా ప్రకాష్ నామ స్మరణ చేస్తుంటే జ్యోతికి చాలా చిరాకు వేసింది. అసలా మాట వింటుంటే, పాపం చేసినట్టు, తానేదో తప్పు చేసినట్టు అనిపించింది జ్యోతికి.

అందరు బాబుని అలా పోల్చడం తనకి నచ్చడం లేదు. ఎవరికైనా పిల్లలు పుడితే, తల్లి లాగానో, తండ్రి లాగానో పోలికలు రావడం సహజం. కాని ఇలా ఏ సంభంధం లేని వ్యక్తి పోలికలు రావడం ఎవరికీ మాత్రం ఇష్టం ఉంటుంది? అందులోనూ తానూ వద్దనుకున్న వ్యక్తి, తనని మోసం చేసిన వ్యక్తి పోలికలు రావడం, తన దురదృష్టం. ఈ ఆలోచనలో జ్యోతిని డిశ్చార్జి చేసారు.    

మూడు రోజుల తరవాత వచ్చిన చుట్టాలు బంధువులు అందరూ తనని తనకు పుట్టిన వాడిని చూసి పోలికలు మాత్రం రాలేదన్నారు వారిలో కొందరికి ప్రకాష్ గురించి తెలుసు కాబట్టి వాళ్లు మాత్రం అం ఇక ఇంటికి వచ్చేలోపు చాలా వరకు అంతా ప్రకాష్ పోలిక అని తీర్మానించారు కానీ జ్యోతికి అసలు మింగుడు పడడం లేదు ఎందుకంటే ఇలా తనకు పుట్టిన వాడిని అలా పోలిస్తే తన మీద  అనుమానము పెట్టుకున్నట్లు అనిపిస్తుంది ఏదో తప్పు చేసినట్లుగా ఫీల్ అవుతోంది ఇంటికి వచ్చిన తర్వాత ఇరవై రోజులకు బారసాల రోజు చాలా ఆడంబరంగా చేయాలని ఏర్పాట్లు కూడా అంత ఘనం గా చేశారు

మ్యాజిక్ షో ఏర్పాటు చేసారు పిల్లల కోసం  డెకరేషన్ కి భోజనాలకు చాలా ఖర్చు అయింది. ఆ రోజు ఉదయం అంత హడావుడిగా సాగిపోయింది. సాయంత్రం ఆరుగంటలకు బాబును ఉయ్యాలో వేసే సంబరం మొదలైంది జ్యోతి తయారవుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన రామ్ జ్యోతి ని చూస్తూ జ్యోతి బాబు కి ఏం పేరు పెడదాం అని అడిగాడు అద్దంలో చూసుకుంటున్న జ్యోతి మీ ఇష్టం అండి అంది దాంతో రామ్ అయితే ప్రకాష్ అనే పెడదాం అన్నాడు సంతోషంగా

ఒక్కసారిగా తనలోని కోపాన్ని అసహనాన్ని ఆపుకోలేక పక్కనే ఉన్న గాజు గ్లాస్ తీసి నేలకేసి కొట్టి కోపంతో తిరిగి ఆవేశంగా భర్త ని చూస్తూ ఏంటండీ అసలు ఏమనుకుంటున్నారు మీరు అసలు నన్ను ఇలా అవమానించాలని అందరూ కట్టకట్టుకుని లేదా నాపై నిందలు వేయాలని అసలేంటి నీ ఉద్దేశం నేను మనిషిని అని నాకు ఫీలింగ్స్ ఉంటాయని మీకు కాస్తయినా కనికరం లేదా నేను ఏ తప్పు చేయలేదని మీకు తెలియదా చిన్నప్పటి నుండి చూస్తున్న మీరే ఇలా అపార్థం చేసుకుంటారు

నన్ను మానసికంగా హింసించి చంపాలని కంకణం కట్టుకున్నారు అదే నిజమైతే నాకింత విషమిచ్చి చంపండి అంతేకానీ ఇలా ఒక్క క్షణం చంపుతూ ఉండే కంటే ఒక్కసారి చేయడం మంచిది ఏదో ప్రేమించిన పాపానికి పెళ్లి సమయంలో అంతా రెడీ అయ్యాక వాడు మోసం చేస్తాడని నేను కలగన్నన్నా ఆ సమయంలో మీరు నా మెడలో  తాళీ  కట్టకపోతే అసలు ఇదంతా ఉండేది కాదు నా మానాన నేను చనిపోయేదాన్ని .

అప్పుడు చావననీయకుండా, ఇప్పుడు అన్నీ మర్చిపోయిన ఈ సంతోష సమయంలో నన్నిలా చంపడం మీకు భావ్యమా అంటూ నేనేం తప్పు చేయలేదు నేనేం తప్పు చేయలేదు వెక్కివెక్కి ఏడుస్తూ పగిలిన గాజు పెంకుల మధ్యలోనే కూలబడిపోయింది జ్యోతి రెండు చేతుల్లో మొహం దాచుకుని ఏడవకు అంటూ దగ్గరగా వచ్చిన రామ్ భుజాలు పట్టుకుని లేపుతూ జ్యోతి నిన్ను ఎవరు అనుమానించ లేదు అవమానించలేదు అసలు ఈ మాట అంటే నువ్వు ఇంతగా బాధపడతావని అని మేము అనుకోలేదు నిన్ను ఇంతగా మానసిక క్షోభకు గురి చేసినందుకు మమ్మల్ని క్షమించు అంటూ భార్యని గుండెల్లో పొదుపు కున్నాడు రామ్

ఈ హడావిడికి ఏడుపు లోనికి వచ్చిన అత్తగారు తల్లి మిగిలిన వారంతా జరిగింది ఏమిటో గ్రహించి తామంతా జ్యోతి ఇలా మానసికంగా బాధ పెట్టారా అని మనసులో అనుకొంది.ఇంతలో తల్లిని చూడగానే జ్యోతి వెళ్లి తల్లి కౌగిలిలో వాలిపోయి ఏడవసాగింది. ఏడుస్తున్న కూతుర్ని తలపై నిమురుతూ అమ్మ జ్యోతి నువ్వు ఏమి తప్పు చేయలేదు అమ్మ ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు మేము అంతా సరే అన్నా పెళ్లి కూడా పెట్టుకున్న తర్వాత పీటల మీద కూర్చున్న సమయంలో ఆ వెధవ చేసుకొనంటూ ఉత్తరం పోస్ట్ చేసి వెళ్ళిపోయాడు 

ఎవరూ లేని వాడని నమ్మి దగ్గర తీసినందుకు వాడికి ఇచ్చి నిన్ను ఇచ్చి ఇల్లరికం పెట్టుకోవాలని అనుకున్న మాకు పెద్ద షాక్ ఇచ్చాడు నమ్మకద్రోహం చేశాడు అదే సమయం లో నీ బావ నిన్ను అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడం అంతా ఒక కల లాగ జరిగింది ఇది జరిగిన ఇన్ని ఏళ్ళ తర్వాత బాబు పుట్టడం తో అతను గుర్తుకు వచ్చి  తెలియక అన్నాము  నిన్ను మా మాటలతో బాధపెట్టాను క్షమించమ్మా బాబు మీ ఇద్దరి బాబేనమ్మ అందులో ఏం సందేహం లేదు ఆ మోసగాడి వలలో నువ్వు పడలేదని నాకు తెలుసు, నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు అమ్మ

కానీ అతని ఆలోచనలతో ఉండడంవల్ల పోలికలు అలా రావడం సహజం నీ పై మాకు ఎవరికీ ఏ అనుమానము లేదమ్మా జ్యోతి అంది తల్లి . ఇంతలో అత్త గారు కూడా అవునమ్మా మాకు ఎవరికీ నీ పై అనుమానం లేదు కేవలం అభిమానం మాత్రమే ఉన్నాయి ఇదంతా నీకు కష్టం గా ఉంటే ఇక మీదట మేము ఎవరo అతని పేరుని తీసుకు రాము  కళ్ళు తుడుచుకో ఈ సమయంలో ఏడవడం మంచిది కాదు అంటూ జ్యోతిని ఓదార్చింది

ఆ మాటలతో జ్యోతి మనసు తేలిక అయ్యింది కళ్ళు తుడుచుకొంటూ ఇక నా మనసులోంచి మీ మనసులో నుంచి ఆ పోలికను ఆ పేరుని తీసేయండి అత్తయ్య అనగానే అలాగే అమ్మ అందరం ఆ విషయాన్ని మర్చిపోయి బాబుకి తేజ అని పేరు పెట్టుకుందాం అంటూ జ్యోతి తీసుకొని బయటకు వెళ్లారు వెళ్తున్న భార్య అని చూస్తున్నా రామ్ కు గతం కళ్లముందు మెదిలింది జ్యోతి ప్రకాష్ ఇద్దరూ ప్రేమించుకున్నారు జ్యోతి నాన్న గారు ప్రకాష్ ని తెచ్చి ఇంట్లో  పెట్టుకున్నారు.

అతను ఒక అనాధ ఓ సారి ఇలాగే ఫీజుకు డబ్బులు అడుగుతూ దారిలో కనిపించిన ప్రకాష్ ని ఇంటికి తెచ్చి చదివించ సాగారు. దాంతో అతని ఇంట్లోనే ఉంటూ వారికి చిన్నా చితకా పనులు చేస్తూ వారిలో ఒకడిగా కలిసిపోయాడు కానీ జ్యోతి అతని ప్రేమలో పడిపోయింది ఆ విషయం అందరికీ తెలుసు వారిద్దరూ దాచారని కూడా అనుకోలేదు ఒక్కతే కూతురు కావడంతో ప్రకాష్ ని ఇల్లరికం తెచ్చుకోవచ్చు అనే ఆలోచన వారికి ఉంది దాంతో బావ ని అయిన  తాను కూడా ఆ సంగతి తెలిసి జ్యోతి పై పెంచుకున్న తన ఆశలన్నీ తుంచుకొని వారిద్దరిని ఆశీర్వదించాడు.

చదువులు అయ్యాక పెళ్లి పెట్టుకున్నారు వారం రోజులలో పెళ్లి ఉంది అనగా ఓ రోజు సాయంత్రం ఫోన్ చేసి  ఒక చోటికి రమ్మన్నాడు ప్రకాష్ తన ఫోన్ చేసిన విషయం కూడా ఎవరికీ చెప్పకుండా రావాలని కోరాడు అతను చెప్పిన స్థలానికి చెప్పిన సమయానికి వెళ్ళాడు రా o. తాను వెళ్లేసరికి ప్రకాష్ ఒక పార్కులు దిగులుగా కూర్చుని ఉన్నాడు ఏమైంది అంటూ అడిగిన తనకు తన చేతిలోని పేపర్స్ ని ఇచ్చి కళ్ళు మూసుకున్నాడు, అవి చదివి తాను నిర్ఘాంతపోయాడు,

ఏంటి నువ్వు చెప్పేది నిజమా నువ్వు చెప్పేది అబద్ధం ఇది నిజం కాదు అంటూ అరిచాడు కానీ ప్రకాష్ తనను తీసుకుని వెళ్లి డాక్టర్ తో నిజం చెప్పించాడు దాంతో తాను నమ్మక తప్పలేదు కానీ వారం రోజుల్లో పెళ్లి అయితే ఆ వెంటనే ప్రకాష్ అస్తమయం అయితే జ్యోతి  పరిస్థితి ఏంటి ఆ విషయాన్ని ఎలా చెప్పాలి ఏం చేయాలి అని సతమతం అవుతున్నప్పుడు అప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రకాష్ ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేశాడు ఆ తర్వాత జ్యోతిని తనను చేసుకోవాల్సిందిగా తాను మాట ఇచ్చేవరకు బ్రతిమాలాడు ఇక చేసేది లేక మాట ఇచ్చాడు.

జ్యోతి దృష్టిలో తాను ఒక మోసగాడులా మిగలనిమ్మని తాను చనిపోయిన విషయం ఎన్నటికీ జ్యోతి కి తెలియకుండా చూడమని తాను జ్యోతి ని ప్రాణంగా ప్రేమించాను కానీ తనతో ఏ తప్పు చేయలేదు అంటూ చెప్పాడు మాట ఇచ్చిన తర్వాత ఆసుపత్రిలో తన చేతుల్లోనే ప్రకాష్ చనిపోవడం తనకు ఎంతో బాధ అనిపించింది అతన్ని చివరి సారిగా చూసుకునే భాగ్యం కూడా  జ్యోతి కి దక్కకుండా చేసిన తాను చివరిసారిగా అతని మొహాన్ని చూసి అతనికి నిప్పు పెట్టిన చేతులతోనే ఆమె మెడలో తాళి కట్టవలసి వచ్చినప్పుడు ఎంతో దుఃఖించాడు 

కానీ ప్రకాష్ కి ఇచ్చిన మాట ప్రకారం ఈ విషయాన్ని జన్మలో తనకి తెలియనివ్వరు ఏదో బాబు ని చూడగానే మళ్ళీ ప్రకాష్ పుట్టినట్లు అనిపించింది అందుకే అలా అన్నాడు.కానీ జ్యోతి ఇంత బాధ పడుతుంది అని అనుకోలేదు ఇకముందు తాను అతని పేరును ప్రస్తావించకూడదు అని గట్టిగా నిర్ణయం తీసు ఉన్నాడు రామ్. ఇంతలో బావ ఇంకా ఇక్కడే ఉన్నావు అక్కడ పిలుస్తున్నారు అంటూ జ్యోతి లోపలికి వచ్చింది . 

జ్యోతి దగ్గరగా వెళ్లి ఇంకెప్పుడూ నిన్ను బాధపెట్టాను నన్ను క్షమించు అన్నాడు. ఇంకెప్పుడు ఆ మోసగాడిని గుర్తు చెయ్యకు అతను నా దృష్టిలో చనిపోయినట్లు అంటూ అతని గుండెల్లో తల దాచుకుంది హే భగవాన్ అని అనుకుంటూ కళ్ళు తుడుచుకున్నాడు రామ్ ప్రకాష్ కు మనసులో క్షమాపణలు చెప్పుకుంటూ….

Related Posts