పోసిన రాసుల ఫలితానికై…

చతుర్విదాల ప్రారంభకమై…!!!

పోసిన రాసుల ఫలితానికై
నిష్పక్షపాతాల తేజాన్ని తూర్పారబోస్తే…
దాగన నిజాల సమ్మేళనాలు అంతులేని
విద్యుక్త ధర్మాలతో నిరంతరాన్ని
వడగట్టుతు ఆదేశాల అనుసారాలను
వంచుతు పోయే…
గడిచిన గతమెంతటి గుణమో తెలిసింది…

తెలియని ఆరాటాల వెల్లువ వడివడిగా
వేగమవుతు అనుక్షణపు పోకడలు
పొద్దు తిరుగుడులుగా రూపం మారుతు…
అర్థంలేని ప్రయాణాలు ఎడబాటులై
ఉదయించేది సూర్యుడే అయినా…
మదిని నింపని వర్థమానం కుదుటపడని
కుయుక్తులతో నిండిపోయి అడిగిన
కుత్తుకలను కోస్తున్నది…

ఆలోచిస్తున్నా ఏ భవిష్యత్ వ్యహమో
వాస్తవమై ఏకాంతంగా నన్ను ముట్టడి చేసి…
జీవితమన్నది తెగుతు అతుకుపడే
బంధాలను కలిగిన బాధల గొలుసు
వంటిదేనని పరమసత్యాన్ని ప్రభోదగీతంగా
ప్రపంచానికి ఎప్పుడు బోధిస్తుందోనని
చూస్తున్నా…

జాగు చేయని ఓర్పు క్రియాశీలకమై
చేపట్టిన ఆచరణలు చతుర్వాదాల
ప్రారంభకమై తలచిన ఆశయం వేకువ
లోంచి పుట్టిన తొలిపొద్దై…స్వార్థం తెలియక
సామర్థ్యాల ప్రతిభలను వెనుదిప్పక
నేను నేర్చినది ప్రామాణికమై ప్రతి మనసున మానవత్వాన్ని నిలుపాలని కోరుకొంటున్నా…

దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *