అక్షర అంతర్జాతీయ మహిళా దినోత్సవం పోటీ కొరకు
అంశం :- నేటి తరం ఆడపిల్లలు వారి మనస్తత్వం
తేది:- 03/03/2026
శీర్షిక:- ప్రకృతి
కాలం మారుతున్న కొద్దీ మనుషుల ఆలోచనా విధానం, జీవనశైలి, లక్ష్యాలు కూడా మారుతూ వస్తున్నాయి.
ముఖ్యంగా నేటి తరం ఆడపిల్లల మనస్తత్వం గతంతో పోలిస్తే విపరీతంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఇంటి గడప దాటకుండా, కుటుంబ పరిమితుల్లోనే జీవించాల్సిన పరిస్థితి ఉండేది.
కానీ ఈరోజు ఆడపిల్లలు విద్య, ఉద్యోగం,సాంకేతిక రంగం,రాజకీయాలు,క్రీడలు వంటి అనేక రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు.
నేటి తరం ఆడపిల్లలలో ముఖ్యంగా కనిపించే లక్షణం ఆత్మవిశ్వాసం. తమ సామర్థ్యంపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలనే ధైర్యం వారికి ఉంది. “నేను చేయగలను” అనే భావన వారి మనసులో బలంగా నిలిచింది. చిన్నప్పటి నుంచే చదువులోనూ, కళల్లోనూ, క్రీడల్లోనూ ముందుండాలని తపన పడుతున్నారు. స్వతంత్రంగా ఆలోచించి, తమ నిర్ణయాలను తాము తీసుకోవాలనే సంకల్పం వారిలో పెరిగింది.
ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి. అలాగే ప్రతి ఆడపిల్లలో కూడా కొన్ని పరిస్థితుల వల్ల అనుభవాలు సాధించిన కూడా వాటి నుంచి ఇంకేదో సాధించాలి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ అందులో కూడా కొంతమంది పగ ప్రతీకార అన్నట్టుగా కుటుంబ సభ్యులతో ప్రవర్తిస్తూ ఉంటారు.
ప్రతి ఆడపిల్లలో ప్రవర్తనలో మార్పు వచ్చింది అంటే… దాని వెనక ఏదో బలమైన కారణం ఉందని తెలుసుకోవాలి కానీ ఆ కారణాలవల్ల అన్నిసార్లు మంచి జరుగుతుంది అని చెప్పలేను అన్నిసార్లు చెడు జరుగుతుందని చెప్పలేము.
ఒక సమస్య వల్ల ఎంత క్రుంగి కృషించిపోయి ఆ బాధలో ఎంత నరకం అనుభవిస్తే… కానీ ఆ బాధ నుంచి బయట పడలేరు. కొంతమంది ఆ సమస్యను తట్టుకొని నిలబడిన వాళ్ళు ఉన్నారు. నేనింకా భరించలేను అని వాళ్ళ ప్రాణాలను తీసుకున్న వాళ్ళు ఉన్నారు.
కొంతమంది ఇవాళ కలలను నెరవేర్చుకోవడం కోసం ఎంతటి అడ్డంకి నైనా దాటడానికి సిద్ధపడిన , అందులో మరికొందరు మాత్రం ఇంకా చాలు భరించలేం అన్నట్టుగా ఆత్మహత్యకి పాలు పడుతున్నారు.
కానీ వాళ్లు కూడా ఎంతని నరకాన్ని అనుభవించారో మనకు తెలియదు అది వాళ్ళ మనస్సాక్షికి తప్ప. ఒత్తిడి డిప్రెషన్ ఇలాంటి వాటితో ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను అర్ధాంతరంగా తీసుకున్నారు. వాళ్ల కుటుంబానికి శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయారు.
మరి కొంతమంది వాళ్ళ కలాల్ని నెరవేర్చుకోవడానికి ముందడుగు వేస్తే లేనిపోని అడ్డంకులు కొందరి వల్ల నరకం అనుభవించి వాళ్ళ చేతిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు.
ఒక ఆడపిల్ల మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేను మారుతుందని చెప్పలేరు కొన్నిసార్లు తనకి పట్టలేని ఆనందం కలుగుతుంది ఆనందం చిన్న చిన్న విషయాలకే కలవచ్చు.
కొందరు మహిళలు వాళ్ళ జీవితంలో అనుభవించే బాధలు చూసి చూసి విసిగిపోయి హత్యలు చేయడానికి కూడా పాల్పడుతున్నారు. అది వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో తెలియదు కానీ తెలిసేటప్పటికీ వాళ్ళు చేయవలసిన తప్పు చేసేస్తారు.
ప్రేమికుని కాదని భర్త చేతి భర్త చేతిలో హింసను అనుభవించిన వాళ్ళు ఎంతమంది? వాళ్ల కలల్ని నెరవేర్చుకోవాలి అని కలల కన్న వాళ్ళు ఎంతమందో?
కొన్నిసార్లు తల్లిదండ్రుల ప్రేమ కన్నా పరాయి వాళ్ళ ప్రేమే ఎక్కువ అనుకుంటారు. అది ఆ క్షణం వాళ్ళకి తెలీదు కానీ వాళ్ళ చేతిలో ఒక బొమ్మలాగా చిక్కిపోయి నలిగిపోతారు.
ఇలాంటి వాళ్లే వాళ్ళ జీవితంలో ఎన్నో సాధించడానికి ముందడుగు వేయడానికి సిద్ధపడ్డారు కూడా.
మరి కొంతమంది వాళ్ళ కుటుంబాన్ని ఒప్పించి ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతోమంది.
పెళ్లి తర్వాత ప్రేమికుడి ప్రేమ కోసం ఆరాటపడే మహిళలు ఇప్పుడు జైల్లో ఉన్నారు.
వాళ్ళు ఆ క్షణం వాళ్ళ ఆనందం కోసమే చూసుకున్నారే తప్ప తన భర్త పిల్లలు వాళ్ల గురించి ఆలోచించలేకపోయారు. సడన్గా ఇంట్లో పని చేస్తున్న భార్య భర్త మీద అరిచేసరికి , భర్తకి కోపం వస్తుంది అది ఎందుకు వస్తుంది కారణం లేకుండా ఎందుకు అరిచింది అన్నదే కదా?
ఆ క్షణంలో ఆమె ఎందుకు కోపంగా ఉంది అని ఆలోచించకుండా భర్త కూడా తన మీద అరిచాడు? ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లల మీద జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఎక్కువైనా కూడా వాళ్లేమి తక్కువ కాదు?
ఎందుకంటే… వాళ్లు కూడా వాళ్లకు నచ్చని వాళ్ళ మీద పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. అలాగని నేను అందర్నీ ఉద్దేశించి అనడం లేదు. ప్రకృతి ఒకసారి అందంగా కనిపిస్తుంది. ఆ ప్రకృతిలోనే మనం శాశ్వతంగా ఉండిపోతే ఎంత బాగుంటుంది అని ఆ క్షణం అనిపిస్తుంది.
ఒక గంట తర్వాత సడన్ గా వర్షం పడి ఆ ప్రకృతి తన ప్రళయం సృష్టిస్తుంది.
ప్రకృతిలో వచ్చే మార్పులనే మనం తట్టుకోగలుగుతున్నాం అలాగే మన పక్కనే మన చుట్టూనే ఉన్న ఆడవాళ్ళ మనస్తత్వం ఎప్పుడు ఎలా మారుతుందో గుర్తిస్తూ వాళ్లతో మంచిగా ఉంటే మంచిది?
కొత్తగా వచ్చిన కోడలికి అత్తగారు అన్ని చెప్పాలి అంటారు అలాగే ఇంటి విషయాలు కూడా భర్త తనతో పంచుకోవాలి అంటారు.
కొత్త కోడలికి ఆ ఇంటి సంగతి తెలీదు అత్తగారు చెప్తేనే తెలుస్తుంది అలాగే ఒక ఆడపిల్ల మనస్తత్వం ఎక్కడ ఎలాంటి సందర్భంలో నిర్ణయాలు తీసుకోవాలో కొందరికి తెలీదు అని నా అభిప్రాయం.
కొందరు పట్టుదలతో ఉంటారు ఆ పట్టుదల కోపం ఆవేశంలోనే ఉంటుంది వాళ్ళు కలల కన్నా లక్ష్యం పైన ఉండదు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రకృతికి ఆడవాళ్ళకి దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం..
మాధవి కాళ్ల..
హామీ పత్రం :-
ఈ వ్యాసం నా సొంతం అని హామీ ఇస్తున్నాను..