ప్రపంచ పాల దినోత్సవం


1 .ఆ.వె.
ఉగ్గుపాలు కల్తి, ఉప్పు, పప్పులు కల్తి
కంటి చూపు కల్తి, కరుణ కల్తి
గాలి, నీరు, కల్తి,గ్రాసమంతా కల్తి
కన్న తల్లి పాలు కల్తి గాదు
2 .ఆ.వె.
తల్లి పాలు బిడ్డ తాగితేనే పుష్టి
దాది పాలు తాగ దగదు శిశువు
వచ్చు రోగములను వారించు శక్తులు
తల్లి పాల నుండి తనయ కందు
3 .ఆ.వె.
అమ్మ పాలు శిశువు కమృత సమానము
గట్టి రోగములను నెట్టి వేయు
తల్లి పాల బలము తనయుని రోగాల
తగిన మందు వోలె తరిమి వేయు
4 .ఆ.వె.
అందము చెడుననుచు ఆరాటపడు తల్లి
కొడుకు ఆకలి తీర్చ కోరుకొనదు
ఏడ్చినా కొమరుని ఎత్తి కుదేసును
పాల నిడక డబ్బ పాలు పోయు
5 .ఆ.వె.
తల్లులార మీకు దండాలు పెడతాము
కన్నబిడ్డ సుఖము కాంచ మేలు
కన్న సంతు శక్తి గల వాడిగా జేయ
మధురమైన పాలు మానకండి

                                                                         ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా...

                                                                                                    ...... కోట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *