ప్రియాతి ప్రియమైన నా శ్రీమతికి ప్రేమతో రాస్తున్న లేఖ…..
అనంతమైన ఈ విశ్వంలో నీవు నాకు తోడుగా లభించడం నేను చేసుకున్న పూర్వజన్మ పుణ్యం
అయిన మన మధ్య వచ్చే పొరపచ్చాలు, నిప్పులో పడ్డ ఉప్పులా చిటపట లాడినా..
అది పాలమీది పొంగులాంటిదే
అయిన అప్పుడప్పుడు నీవు అలగడం నేను నిన్ను అలక నుండి బయటకు తీయడం అదో కళ నాకు.. ఏది ఏమైనా అలకలు లేని మన కాపురం ఉప్పులేని పప్పులా ఉంటుంది..
అలకలు ఆదర్శ జీవితానికి నాంది పలుకుతు..
నిత్య నూతనంగా మన దాంపత్యం
విరబూసే పువ్వులా వికసించి గుభాళించాలని..
ఒకరికోసం ఒకరం జీవితాంతం తోడునీడగా ఉండాలని కోరుతు…
ప్రియమైన నేను.
అంకుష్.