ప్రేమనా? వ్యామోహమా?

హాయ్ అని ఫోన్ కూ ఒక సందేశం వచ్చింది నేను ఎవరో అనుకుని ఏమి సమాధానం ఇవ్వలేదు అలా ఏమి ఇవ్వకున్నా ప్రతిరోజు నాఫోనుకు ఒకే సమయం లో కొన్ని సందేశాలు రావడం అలాగే ఆ రోజు నేనేమి బట్టలు వేసుకున్నానో

ఎక్కడికి వెళ్ళానో వాటిని వర్ణిస్తూ,ఆ రంగుల దుస్తులలో నేను ఎలా ఉన్నానో తనకి ఎలా ఉంటె ఇష్టమో అని కవితల రూపం లోనూ చిన్న చిన్న కొటేషన్ల రూపం లోనూ సందేశాలు వచ్చేవి.

ఇంతకి నేనెవరో మీకు చెప్పనే లేదు కదా చెప్తాను వినండి నా గురించి నాపేరు షీలా నేను ఒక ఇంటర్ చదివే అమ్మాయిని మా ఇంట్లో నన్ను చాలా గారాబంగా పెంచారు.

నేను అమ్మానాన్నలకు ఒక్కతినే కూతుర్ని నా తర్వాత తమ్ముడు ఉన్నాడు మా తల్లిదండ్రులు నాకు ఎంతో స్వేచ్చని ఇచ్చారు చదువులో,ఆట పాటలో కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నా కూడా నాకు వెళ్ళే  స్వాతంత్రం ఉంది.

అలా  వాళ్ళు నాకు ఇచ్చిన ఆస్వేచ్చని దుర్వినియోగం చేయలేదు ఇప్పటి వరకు వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోలేదు నేను నా హద్దులో ఉండడం నాకు తెలుసు అలాగే ఉంటున్నా కూడా

అలాoటి సమయం లోనే ఇదిగో ఇలా నా ఫోన్ కూ సందేహాలు రావడం మొదలయ్యింది.కానీ నేను దాన్ని ఏమి పట్టించుకోలేదు కొన్ని రోజులు ఒక అమ్మాయి మెత్తబడడానికి ఏమి చేయాలో ఈ అబ్బాయిలకు తెల్సు అనుకుంటా కదా,

నిజానికి నాకు అలా రావడం బాగానే అనిపించేది నన్ను ఒక అబ్బాయి చూస్తున్నాడు,నన్ను వర్ణిస్తూ ఉన్నాడు అంటే  ఏ అమ్మాయికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి.

నేను అతను పంపే సందేశాలు,కవితలు చూస్తూ గొప్పగా ఫిల్ అవుతూ ఉన్నాను నన్ను అతను ఎంత గొప్పగా ఆరాధిస్తూ ఉన్నాడో ఎంత ప్రేమిస్తున్నాడో అని అనుకుంటూ అతను ఎంత అందంగా ఉన్నాడో అని కలలు కంటూ ఉన్నాను.

అలా రోజులు గడుస్తున్నాయి నెలలు సంవత్సరాలు అయినా అతను ఇంకో అడుగు ముందుకు వెయ్యకుండా నాతో చాలా మర్యాదగా ఉన్నా అతన్నిచూసి నాకు కూడా మనసు కరగసాగింది .

నేనుకూడా తనని ప్రేమిస్తున్నాఅని అనుకుని ఇక ఉపేక్షించి లాభంలేదని భావించి అంతకు ముందు అతను చేసిన సందేశానికి నేను మళ్ళి హాయ్ అని పంపాను వెంటనే అక్కడి నుండి నాదేవత ఇన్నేళ్ళకు కరుణించిందా అని సమాధానం

అలా అలా మా ఫోనులు రెండు బిజీ అయ్యాయి ఇరవై నాలుగు గంటలు సందేశాల తో నిండి పోయింది.అలా మాట్లాడుకుని మాట్లాడుకుని మాఇష్టాలు మా అభిప్రాయాలూ మా కుటుంబం గురించి నాచదువు గురించి అన్ని వివరంగా చెప్పుకున్నాం.

అలా మాట్లాడుకున్న తర్వాత ఇద్దరికీ కలవాలి అని అనిపించింది.సరే అని ఒక రోజు కలుద్దాం అని అనుకున్నాం కలిసాము కూడా ఒక కాఫీ షాప్ లో నేను తనని చూడగానే చాలా ఆనందపడ్డాను.అతను నా కోసం పెద్ద పెద్ద రోజు పువ్వులు,మంచి చాక్లెట్లు ఎన్నో తెచ్చాడు.

కానీ నేను అతనికి ఏమి తీసుకు పోలేదు అయినా అతను ఏమి ఫీల్ అవ్వలేదు పైగా నేను రావడమే గొప్ప అని అన్నాడు.

అలా మా పరిచయం కొనసాగింది అతను నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడు నాకు అందులో వింతేమి కనిపించలేదు. నేను సరే అని ఒప్పుకున్నాఅలా మా ఇద్దరి లవ్ మొదలయ్యింది.

మేము చాలా బాగా ప్రేమించుకున్నాం అంటే బాగా తిరిగాము సినిమాలకు,షికార్లకు,షాపింగ్ లకు కూడా వెళ్ళాము.అలా చాలావరకు చాలా చోట్లా మేమే కనిపించాము అందరికి.

ఎప్పుడు పద్దతిగా ఉండే నేను అలా అతనితో తిరగడం,చూసినా నా స్నేహితులు అందరూ నన్ను విచిత్రంగా చూడసాగారు నాకు నీతులు చెప్పారు కూడా అయ్యో షీలా నువ్వు చాలా మంచి దానివి అని అనుకున్నాం,

కానీ నువ్వేంటి అతనితో అలా తిరుగుతున్నావు అతను మంచి వాడు కాదు అతనితో తిరగకు అని నన్ను  వెనక్కి లాగాలని ప్రయత్నం చెయ్యసాగారు.

అతను మంచితనం ముసుగులో నీతో ఆడుకుంటున్నాడు అని అంటూ నాకు చాలా చెప్పారు కానీ నేను అవ్వన్నీ పట్టించుకోలేదు వినలేదు కూడా.

నా ఇంటర్ కూడా అయిపోవచ్చింది నేను అతను నన్ను పెళ్లి చేసుకుంటాడు అనే ఆలోచనలో ఉన్నాను ఎందుకంటే  నేను అతన్ని బాగా నమ్మాను నాకు అతను ఒట్టేసి కూడా చెప్పాడు

నిన్ను ఎలాంటి పరిస్థితిలో అయినా పెళ్లి చేసుకుంటాను అని అందుకే ఎవరూ ఏమి చెప్పినా వినకుండా అతని మీదే నమ్మకం పెట్టుకుని ఉన్నాను అతను కూడా నన్ను తప్ప  ఎవర్ని ప్రేమించడం లేదు

అతని ప్రేమలో ఉన్న నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను అతను డిగ్రీ ఫెయిల్ అయ్యాడు ఇది తెల్సి మాఇంట్లో వాళ్ళు నన్ను బాగా తిట్టి కాలేజి మానిపించేసారు.

నాకు మాచుట్టాల పిల్లలు వారు చదువుకుని ఏమేమి సాధించారో నేనేమి చేయాలో అని విప్పి మరి చెప్పడం తో నేను చాలా రియలైజ్ అయ్యిబయట ప్రపంచం లో ఏమి జరుగుతుందో చూసాను బయట అందరూ అంటే నా వయస్సు ఉన్నవాళ్ళు, నాలా ఇంటర్ చదివేవాళ్ళు చదువులో ఎన్నోవిజయాలు సాధించడం చూసి వాళ్ళతో నన్ను నేను పోల్చుకుని చూసాను.

అవును వాళ్ళని చూస్తుంటే నేను చాలా చాలా వెనక బడినట్టు అనిపించింది.పైగా మాఅమ్మ నన్ను కూర్చోబెట్టుకుని తను నామీద ఎన్ని ఆశలు పెట్టుకుందో వివరించి చెప్పక నేను మా అమ్మ కలని నిజం చేయాలి అని అనిపించింది.

మా వాళ్ళు నన్ను ఆఊరి నుండి తీసేసి వేరే ఊర్లో ఉన్న హాస్టల్లో వేసారు,నేను అన్ని మర్చిపోయి చదువేలోకంగా బతికాను అలా అలా చదువుతూ మాఅమ్మ చెప్పినట్టు అందులో విజయం సాధించాను ఒక డాక్టర్ని  అయ్యాను మంచి పేరు తెచ్చుకున్నాను.

ఇప్పుడు ఆలోచిస్తే నాకు అర్ధం అవుతుంది.నేను అప్పుడు ఎంత సిల్లి గా ఆలోచించాను,ఒకవేళ అప్పుడే అతన్ని నేను పెళ్లి చేసుకుంటే ఇలా డాక్టర్ని అయ్యేదాన్నికాదుగా,అప్పుడుప్రేమ,పెళ్లి అనేది ఎంత పిచ్చి పనో అర్ధం అవుతుంది.

ప్రేమంటే ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది నాకు అప్పుడు నాకు కలిగింది ఆకర్షణ,వ్యామోహమా,ప్రేమనా అని నేను ఆలోచిస్తుంటే నవ్వు వస్తుంది నాకు పాపం మరి నన్ను ప్రేమించిన అతను మాత్రం ఎలా ఉన్నాడో అనే ఆలోచన నాకు కలిగింది. 

అయినా చదువుకునే వయసులో ప్రేమ ఆకర్షణ అనేవి సర్వసాధారణం కానీ వాటినుండి బయట పడితే నాలా డాక్టర్ అవ్వొచ్చుకదా ఆలోచించండి…

 

 

Related Posts