ప్రేమలో పగ

ప్రేమ ఇది ఎందరినో మంచివాళ్ళని చెడ్డవాళ్ళని అమ్మాయిల మీద యాసిడ్ పొయ్యాడానికి వారిని చంపడానికి గాని చావాడానికి గాని ఇంకేమైనా చెయ్యడానికి గాని ఇదే ప్రేమ ని సాకు గా పెట్టుకుంటారు.అలా చంపడం చావడం చెయ్యలేని వాళ్ళు కొందరు ఇలా కూడా చేస్తారు.అదేంటి అంటారా సరే చెప్తా వినండి మరి…. 

అనిత అనిల్ లది ఒకే ఊరుఒకటే కాలేజీ ఒకేటే క్లాస్ కావడంతో సహజంగానే ఇద్దరికి ఆకర్షణ కలిగి అది ప్రేమగా మారింది. ఇంటర్ లో డిగ్రీ లోను ఇద్దరు కలిసి తిరిగారు. ప్రేమించుకున్నారు.సహజంగా అందరికి తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలిసినట్టే ఇక్కడ అలాగే జరిగింది.ఇంట్లో వారికి అనిల్ అనిత విషయం తెలిసి కాలేజీ మానిపించారు అనితను అనిల్ ని వాళ్ళింట్లో వాళ్ళు కూడా అనిల్ ని బెదిరించి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు కొన్ని రోజులు అక్కడ ఉండి పొమ్మని చెప్పారు.అలా కొన్ని రోజులు వాళ్ళని కట్టడి చేసి అతన్ని చేసుకుంటే తమ కులంలో వచ్చే మాటలు కష్టాలు కన్నీళ్ల గురించి అనితకు వివరంగా చెప్పిఆమె మనసు ని మార్చారు ఇంట్లో వాళ్ళు..

దాంతో ప్రేమలో ఇన్ని కష్టాలు ఉంటాయని తెలియని  అనిత దాంట్లో ఉన్న బాధలన్ని  తెలిసి అమ్మో ఇన్ని ఉంటాయని తెలియక ప్రేమలో పడ్డాను.అనిమీరే సంబంధం చూసిన చేసుకుంటా అని తల్లిదండ్రులతో చెప్పింది.దాంతో అనితకు సంబంధాలు చూడసాగారు.ఒక నెల రోజులు అయ్యాక వాళ్ళు మారారు అని అనుకున్న తర్వాత అనిల్ ని మళ్ళీ ఊరికి రప్పించారు.అనిల్ ఎంతో ఆశతో ఊరికి వచ్చాడు అనిత మీద ఇష్టం పెంచుకున్నాడు అనిల్.కానీ ఊర్లోకి  వచ్చాక స్నేహితుల  ద్వారా  తెలిసింది అనితకు సంబంధాలు చూస్తున్నారు అని దాంతో షాక్ అయ్యాడు.

పైగా సంబంధాలు చూడడం అనితకు కూడా ఇష్టమే అని తెలిసి నిజం కాదేమో అని అనుకున్నాడు.స్నేహితుల ద్వారా అనితని పిలిపించి చాటుగా మాట్లాడాడు. అతన్ని చూసి అనిత అయ్యో అనిల్ ఎంత సన్నగా అయ్యావు.మా వాళ్ళు ఇలా చేశారా అని బాధ పడుతుంది అనుకున్న అనిల్ కి ఏంటి ఎందుకు రమ్మన్నావు నన్నుతోరగా వెళ్ళాలి చెప్పు  అని చిరాకుగా అంటున్న అనితని చూసిన అనిల్ బాధ పడ్డాడు. ఏమి లేదు వెళ్లిపో అన్నాక ఇది నన్ను ప్రేమించి నాతో తిరిగి అన్నిఅయిపోయాక ఇప్పుడు  నీతి సూత్రాలు వల్లిస్తోంది దీనికి పెళ్లి కాకుండా చేస్తా అని శపథం చేసుకున్నాడు మనసులో

ఇక అప్పటి నుండి అనితకు వచ్చిన సంబంధాలు అన్ని తన తెలివితో  చెడగొట్టసాగాడు.వచ్చిన ప్రతి సంబంధం ఇంట్లో కుదరడం ఆ తర్వాత వాళ్ళు వెళ్లిపోవడం తర్వాత ఫోన్ లోను ఉత్తరాలు ద్వార వద్దoటూ చెప్పడం చేస్తూ వస్తున్నారు..ఇలా వచ్చిన సంబంధాలు అన్ని తిరిగి పోవడం తో అనిత వాళ్ళ ఇంట్లో కలకలం మొదలయ్యింది.ఎవరూ సంబంధాలు చెడ గొడుతున్నారు అనే బాధ కలిగింది. ఎలాగైనా కనుక్కోవాలి అని అనుకున్నారు.

రోజు వచ్చిన పెళ్లి కొడుకు వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వారిని అనుసరించారు. వాళ్ళు వెళ్లే సమయంలో అనిల్ వాళ్ళని కలుసుకుని తామిద్దరు ప్రేమించుకున్నాము అనితమని విడదీయకండి అంటూ వాళ్ళతో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు.పాపం అని వాళ్ళు తమకు సంబంధం ఇష్టం లేదని చెప్తాం అని మాట ఇచ్చి వెళ్లి పోయారు..

అనితకు పెళ్లి కాకపోవడానికి కారణం అనిల్ అని తెలిసి పెద్దవారు ఆశ్చర్య పోయారు.కానీ అనిల్ కి ఇచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదనిఅనిల్ ని బాగా కొట్టి బుద్ధి చెప్పారు. అయినా పని చేయడం ఆపలేదు అనిల్. అలా వారిద్దరి  ప్రేమ యవ్వనం కాలం తో పాటు కరిగిపోయాయి. ఇద్దరూ ముసలి వారు అయినా పెళ్లిళ్లు చేసుకోలేదు చూసారా ప్రేమ పగ ని ఎలా పెంచిందోఇలాంటి ప్రేమలు కూడా ఉంటాయి ఉన్నాయి  కూడా ఇది ఎవర్నీ ఉద్దేశించి కాదు

Related Posts