ప్రేమాకర్షణ……….యుక్తవయస్సులో ఎవరు అయినా

అంశం
ప్రేమాకర్షణ

శీర్షిక
ఆకర్షణలో పడొద్దు

యుక్తవయస్సులో ఎవరు అయినా ప్రేమలో పడితే వారు కుడితిలో పడిన ఎలుకల వలె
గిల గిలా కొట్టుకుంటూనే ఉంటారు. జీవితంలో స్ధిర
పడకుండా చదువుకునే సమయంలో ప్రేమాకర్షణలో
పడితే చదువు పాడవుతుంది.
భవిష్యత్తు కూడా దెబ్బతినే
అవకాశం ఉంది. టీనేజీలో
యువతీ యువకులకు మధ్య
కలిగేది ఆకర్షణ. నిజమైన ప్రేమ
కాదని పెద్దల అభిప్రాయం. ప్రతి
పనికీ ఒక సరైన సమయం అనేది ఉంటుంది. టీనేజీలో
యువత చదువు పట్ల శ్రద్ధ చూపాలి. తల్లిదండ్రులపై
ఆధారపడే ఆ వయసులో
ప్రేమలో పడితే ప్రేమించుకునే
ఆ యువతీయువకులకు
ఇబ్బందే. వారి కెరీర్ దెబ్బతినే
అవకాశం ఉంది. ఆ వయసులో
పుట్టే ప్రేమ నిజంగా గుడ్డిదే.
ప్రేమించుకుని పారిపోయి
పెళ్లి చేసుకోవటం, ప్రేమ
ఫెయిల్ అయితే ఆత్మహత్య
చేసుకోవటం కొందరు యువతీయువకులకు
మామూలు విషయం
అయిపోయింది. వారికి
సరైన మార్గదర్శనం ఇచ్చే
వాళ్ళు తక్కువ మంది
ఉంటారు. ఒకవేళ ఎవరైనా
చెప్పినా వినే ఓపిక ఆ
ప్రేమ జంటకు ఉండదు.
చక్కగా చదువుకుని
ఆ తర్వాత మంచి
స్ధాయికి చేరుకుని
పెళ్ళి చేసుకున్న కొన్ని
ప్రేమ జంటలు హాయిగా
ఉన్న దాఖలాలు ఉన్నాయి.
ఏదిఏమైనా ప్రేమాకర్షణలో
పడిన వారికి చాలా ఓపిక
ఉండాలి. తొందరపడితే
వారి జీవితం గందరగోళం
అయిపోతుంది.
ఈ రచన నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను.
వెంకట భానుప్రసాద్ చలసాని.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *