ప్రేమికురాలు

హలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటూ అడిగాడోక అబ్బాయి ఇంట్లో ఎవరూ లేకపోతె ఇంటికి తలం వేసి ఉంటుంది కదా మరి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడుగుతావు ఏంటి అన్నాను నేను బయటకి వచ్చి అతన్ని చూస్తూ అతను భయపడుతూ అది అది అని అనసాగాడు .

దానికి నేను పక్కున నవ్విలేదండి ఏంటో చెప్పండి అని అన్నానుఅదేమీ లెండి అన్నాడు ఆ అబ్బాయి.లేకపోతె మరి ఎందుకు ఎవరైనా ఉన్నారా అని అడిగావు అన్నాను కోపం తో పాటు నవ్వును దాచుకుంటూ దానికి ఆ అబ్బాయి బిత్తర పోయి చెయ్యి ముoదుకు చాచిచేతిలోని గ్లాస్ ని చూపిస్తూ..

మా అమ్మగారు మిమల్ని పాలు ఇమ్మని అడిగారండి అన్నన్నాడు ఎయి ఎం మాట్లాడుతున్నావ్ నేను పాలు ఇచ్చే తల్లిలా కనిపిస్తున్నానా అన్నాను కోపం తో నాకు అతనికి ఏమి కావాలో అర్ధం అయినా అతన్ని ఆట పట్టించాలి అని అనుకునిఅలా అనగానే అతను హయ్యో అది కాదండీసారీ అండి అంటూ తడబడుతున్నాడు.

ఇంతలో లోపలి నుండి మా అమ్మ వచ్చి ప్రేమి ఏంటి అతన్ని ఆట పట్టిస్తున్నావా చూడు అతను ఎంత అల్లడిపోతున్నాడో అంటూ

బాబు మా ప్రేమి అలాగే అల్లరి చేస్తుది లే నీకు పాలు కావాలి అంతే నా నేను తెచ్చి ఇస్తాలే అని లోపలి వెళ్ళి తెచ్చి ఇచ్చింది.అంతలోనే నేను మళ్ళి అతన్ని నా కళ్ళు ఎగరేసి అడిగా ఎయి నీ పేరేంటి అని దానికి అతను భయంగా నా పేరు రిషి అండి అని అన్నాడు .

రిష బుశ నేను మాత్రం ఏయ్ అనే పిలుస్తా అని అంటూ అతన్ని చక్కిలిగిలి పెట్టి బయటకు వెళ్లానురౌడి అని అతను గోణగడం విని లోపల నవ్వుకున్నాను

ఇక అప్పటి నుండి నాకు అతన్ని ఆట పట్టించడం ఒక అలవాటుగా మారింది.మేము చాలా క్లోజ్ అయ్యాము అంటే రిషి కాదు వాళ్ళ అమ్మ గారు మేము కూడా బాగా అంటే బాగా ఒకరింట్లో అన్నం వండితేఇంకోరింట్లో కూర వండుకుంటే చాలు అనేంతగా కలిసి పోయాము.

కానీ మాకు మాత్రం ఎప్పటికి గొడవలే నేను తనని ఆట పట్టించేదాన్ని.అతను నువ్వు అసలు ఆడ దానివేనా అని అంటూ నన్ను వెక్కిరిoచేవాడు

నేను పోవోయి అని రౌడి వేషాలు వేసేదాన్నిపాపం రిషి కి అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని కొన్ని ఆశలు ఉండేవిదానికి భిన్నంగా నేను ఉండేదాన్ని నేను ఎప్పుడూ దానికి విరుద్దంగా జేన్స్ టి షర్ట్స్ వేసుకునే దాన్ని అతనికి అమ్మాయిలు అంటే అతనికి పద్ధతి గ ఉండాలి చిర కట్టుకోవాలిపువ్వులు పెట్టుకోవాలిచేతుల నిండా గాజులు వేసుకోవాలి అని బాపు బొమ్మల ఉండాలి అని అతనికి ఆశ

కానీ మనం దానికి బిన్నంగా ఉండేవాళ్ళం కదా అందుకే అతనికి మనం నచ్చలేదు.నా పేరు కూడా అతని కి నచ్చలేధు అనుకుంటా నన్ను ఎప్పుడూ రౌడి అనే పిలిచే వాడు .కానీ ప్రేమి అని ఒక్కసారి కూడా పిలవలేదు…

అతన్ని చూసిన మొదటి క్షణం లోనే నేను ప్రేమలో పడ్డనేమో అనే సందేహం నాకుంది అయినా ఎప్పుడూ నేను బయట పడలేదు తన కోసంతన ప్రేమ కోసం ఎప్పుడైనా అతను ప్రేమగా ప్రేమి అని పిలుస్తదేమో అని అనుకున్నా కానీ ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా అతను నన్ను రౌడి అనే తప్ప పేరుతో పిలవలేదు.

మేము బాగా అంటే మా రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటె చూడలేని దేవుడు వాడికి అదే బుషీ గాడి కి పెద్ద కష్టాన్నే తెచ్చి పెట్టాడు.ఆంటీ వాళ్ళది కర్ణాటక రాష్టంఅక్కడే వాళ్ళ చుట్టాలు అందరూ ఉన్నారుఅంకుల్ కి ఉద్యోగం కాబట్టి ఇక్కడకు వచ్చారు బదిలీ మిద

అంకుల్అంటి లది లవ్ మారేజీ అంట వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే లేచి పోయి పెళ్లి చేసుకున్నాము అని బంధువులు ఎవరూ రారనితమని వెలి వేసారు అని చెప్పి బాధ పడేది అంటిఇలాంటి ఒక సమయం లో అంటి కరెంటు షాక్ తగిలి చనిపోయింది

అది అంకుల్ కె కాదు మాకు కూడా షాక్ కలిగించే విషయమే ఆ పరిస్థితి లో మేము తనకి చాలా అండ గా ఉన్నాము అంకుల్ ని రిషిని బాగా చూసుకున్నాం..

రిషి అయితే అంటి పోవడం అసలు తట్టుకోలేదు.ఇరవై నలుగు గంటలు అంటి ని తల్చుకుంటూ ఏడ్చేవాడునేను తనని ఓదార్చేదాన్నిఅప్పుడు కూడా నన్ను రౌడి అనే పిలిచేవాడు తప్ప ప్రేమి అని పిలిచేవాడు కాదు

సరే అతనికి అంటే రిశికి అప్పుడు పరిక్షలు ఉన్నాయిఅతన్ని ఓదార్చిపరిక్షలకు సిద్దం చేయడం అంటే నాకు చాలా కష్టం అనిపించిందికానీ డిగ్రీ పట్టా పొందడం ఆంటీ కల కాబట్టి నేను తనని చదివించాను

పరిక్షలు కూడా దగ్గర ఉంది రాయించాను.ఒక సంవత్సరం పాటు తనే నా లోకంగా తనే నా ప్రాణంగా బతికాను అతన్ని మాములు మనిషిగా చెయ్యడానికి నాకు అంత సమయం పట్టింది.

ఆంటీ చనిపోయిన దుఖం లో ఉన్న అంకుల్ తాగుడుకు బానిస అయ్యాడు తాగకుండా ఉండలేకపోయే వాడుమా అమ్మానాన్నలు ఎంత చెప్పినా తనే లోకంగా బతికినా అంకుల్ ఆతి ని మర్చిపోలేక అలా తయారు అయ్యారు

కానీ ఎంత తాగినా తిని పడుకునేలా నేను చూసుకునేదాన్నిఅంకుల్ అసలు ఉద్యోగానికి కూడా వెళ్ళకుండా తాగుతూ ఉండేవాడు ఆ సమయం లో నేను నా పాకెట్ మణి ని వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తేవడానికి ఉపయోగించేదాన్ని

నేను వాళ్ళింట్లోకి వెళ్ళడం చుసిన అమ్మా వాళ్ళుఅంతవరకూ అంటి ఉంది కాబట్టి నేను వెళ్ళినా ఏమి అనని వాళ్ళు ఆంటీ లేకపోవడం ఇంట్లో ఇద్దరూ మగవాళ్ళే ఉండడం తో అబ్యంతర పెట్టె వాళ్ళుకానీ నేను వాళ్ళ మాటలని లక్ష్య పెట్టక వారికీ అన్ని విధాల చూసుకుంటూవారికీ వండి పెడుతూ ఉండేదాన్ని.

రిషి చదువు అయిపోయిందితనకు ప్లసేమెంటు లో ఉద్యోగం కూడా వచ్చిందిఅది తెలిసి నేను చాలా సంతోషించాను.ఇంతలో వాళ్ళ బందువులు అంటూ కొదరు వచ్చారువాళ్ళ రాకతో అంకుల్ లో కొత్త మార్పు కనిపించిందితాగడం మానేసారుకన్నడలో ఏదేదో మాట్లాడుకున్నారు

వారం తర్వాత ఎవరో ఒక అమ్మాయి కొత్తగా వచ్చింది.ఆమెని చూసినా రిషి అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని నాకు తనని చూపిస్తూనన్ను రౌడి అని వెక్కిరించేవాడు.అది చూసినా నేను మనసులో బాధ పడ్డా బయటకు మాత్రం నవ్వుతూ నోర్ముయి బుషీ అని అంటూ తప్పించుకునేదాన్ని . 

కొన్ని రోజులకు నేను వాళ్ళింటికి రిషి కోసం వెళ్తే వచ్చిన చుట్టాలు వారికీ వచ్చిరాని తెలుగు లో నన్ను రావద్దు అని అనడం చూసినా కూడా ఏమి అనకుండా వెళ్ళిపోతున్న అంకుల్ ని చూసి నా మనసు చివుక్కుమంది. నేను ఒక వారం రోజులు వారి ఇంటి వైపు వెళ్ళ లేదు.వారం తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చిన రిషి ని చూసి నా రిషి నన్ను వెతుక్కుంటూవచ్చాడు అని అనుకున్నా లోపల కానీ బయటకు మాత్రం ఏంట్రా బుషీ ఇలా వచ్చావు అని అడిగాను నేను

దానికి రిషి ఎంటే రౌడి వారం రోజులుగా రావడం లేదు మా పోట్టి చిర కట్టుకోవడం చూసి అమ్మాయివి అని గుర్తొచ్చిరావడం మానేశావాలేక నేర్చుకున్తున్నావా మీ అమ్మ దగ్గర అన్నాడు నవ్వుతుఅతని మాటలు నాలో అగ్నిని రగిలిస్తున్నా అతను నన్ను అర్ధం చేసుకోకుండా మాటలతో హింసిస్తున్నా

నేను నవుతునే సర్లే కానీ నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగాఅదా మా నాన్నకు కర్ణాటకకు ట్రాన్స్ఫర్ అయ్యిందిమేము రేపు వెళ్ళిపోతున్నాంఅది చెప్పడానికే వచ్చానుఇన్ని రోజులు మా ఇంట్లో పని చేసినందుకు నీకు చెప్పి వెళ్ళాలని వచ్చాను అని అన్నాడు.

నాకు వాళ్ళు వెళ్ళి పోతునందుకు బాధ పడాలోననను వారింట్లో పని మనీశి అని అంటున్న రిషిని చూసి నవ్వుకోవాలోనాలో ప్రేమిక ని చూడని అతని అమాయకత్వానికి ఏడవాలో నాకు అర్ధం కాలేదు.నేనేమి అనక ముందేనా సమాధానం వినక ముందే అతను ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోయాడు.

వెళ్ళాలని లేకున్నామళ్ళి ఎప్పుడు నాకు కనిపించని రిషి కోసం అతని ప్రేమను దక్కించుకొని నేను వెళ్లానునన్ను చుసిన అంకుల్ నవ్వుతూ ఓ వచ్చావా రావేమో అనుకున్నా

తోరగానే వచ్చావే అని అంటూ ఒక పాకెట్ ని చేతిలో పెట్టాడునేను దాన్ని విప్పకుండానే ఏంటి అని అడిగా అదా ఇన్ని రోజులు మమల్ని చుసుకున్నందుకువండి పెట్టినందుకు నీకు ఒక చిర ఓ నువ్వు చీరలు కట్టావు కదా

సరే లే దాన్ని ద్రీస్స్ లా కుట్టుకో అని అన్నారు అంకుల్ పక్కవారితో నా గురించి ఎదో చెప్తూ నాకు ఎలాగో అనిపించింది.నా ప్రేమనినన్ను అవమానిస్తున్నట్టు గా అనిపించింది 

అయినా నేను రిషి కోసం చూస్తున్నా చివరి సరిగా అతన్ని చూద్దామనిరిషి నవుతూ వస్తున్నాడుపక్కన అతనికి కాబోయే భార్య అనుకుంటా చేతిలో చెయ్యి వేసుకుని వస్తున్నారు.

నన్ను చూసి దగ్గరిగా వచ్చిఓ రౌడి వచ్చావా రావేమో అనుకున్నాఏంటి మా దాడి గిఫ్టు కూడా ఇచ్చారాసరే లే అవును నికి ఒక్క మాట చెప్పాలి

ఇది అయితే నేను మనస్పూర్తిగా చెప్తున్నా మా అమ్మ పోయినప్పుడు నువ్వు మాకు చాల ధుఇర్యం చెప్పావు అందుకు మాత్రం నీకు చాలా థాక్స్ అన్నాడు.

పక్కనున్న అమ్మాయి ఏంటని అడుగుతోంది వాళ్ళ బాషలో దానికి రిషిఇమే పేరు రౌడి అని అంటూ బై రౌడి అని వెళ్ళి కారు ఎక్కాడు.

అతనికి ఎప్పుడు అర్ధం అవుతుందో నేను అతన్ని ప్రేమించిన అనిఅతన్ని ఎంతో ఆరాధించాను అని ఓ పదేళ్ళు అయిన తర్వాత అయినా రిశికి నేను గుర్తు ఉంటానాఉండనా

కనీసం అమ్మాయిగా కాకున్నా ఒక రౌడి పిల్లగా అయినా అతను నన్ను గుర్తు పెట్టుకుంటాడు అని నేను ఆశ పడోచ్చాకానీ ఇన్నేళ్ళు నేను చేసిన ఉపకారానికి వాళ్ళు నాకు ఇచ్చిన బహుమతి చిర

సరే దిన్ని నేను జాగ్రత్తగా జీవితాంతం నాకు పెళ్లి అయినా కూడా దాచుకుంటానుఇది రిషి వాళ్ళ నాన్నగారు ఇచ్చినానాకు అది రిషి గుర్తుగానే గుర్తు ఉంటుంది.

ఎప్పుడో ఒక యాభై ఏళ్ల తర్వాత అయినా నేను దాన్ని తీసి నా మొదటి ప్రేమికుడి గుర్తుగా చూసుకోవాలి అని అనుకుంటున్నా 

ఏమో మరి అదే జరుగుతుందేమోనేను ఒక అనామిక ప్రేమికురాలు గా మిగిలి పోతానేమో నా ఆలోచనలో నేను ఉండగానే అందరు  ఎక్కిన తర్వాత కారు వెళ్లిపోయింది నా కంట్లో దుమ్ము కొడుతూ. …

Related Posts