ప్రేమేనా??

నాకో గర్ల్ ప్రెండ్ కావాలి అన్నాడు తేజ్, అంటే అమ్మాయా అన్నారు ఫ్రెండ్స్ శ్రీధర్, మహేష్, నవీన్, లాస్య, చందనలు అవును గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయే అంటారు మీకు తెలియదా అని అడిగాడు తేజ్. తెలుసు కానీ ప్రేమించడాని కా ? పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. మళ్లీ లేదురా ప్రేమకు కాదు పెళ్లికి కాదు జస్ట్ వెంటపడే నా వెంట కుక్కలా తిరిగే ఒక అమ్మాయి నాకు కావాలి, తను నా వెనకే తిరగాలి, నేను చెప్పిన చోటుకు చెప్పిన టైం కి రావాలి, వెళ్లమంటే వెళ్ళాలి అదే నాకు కావాల్సిన అమ్మాయి అంతే అన్నాడు తేజ్.

దానికి అమ్మాయిల లోని చందన తేజ్ నువ్వు అనుకున్నట్టుగా ఉండే అమ్మాయిలు చాలా తక్కువ, నువ్వు అమ్మాయిలు అంటే చులకనగా చూస్తున్నావు, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. కాలేజీలో చేరినప్పటి నుండి అమ్మాయిలు అంటే అంత చిప్ గా కనిపిస్తున్నారా నీకు అని అంటూ క్లాస్ పీకింది.

హే అపు నువ్వు నీ బోడి సలహాలు నీ వేదాంతం అమ్మాయిలు అలా కాదు, అమ్మాయిలు ఇలా కాదు అని అంటూ ఏమో చెప్తున్నావ్, చూడు అమ్మాయిలు అంటే ఎలా ఉంటారో, ఏమి చేస్తారో, మా నుండి వారికి ఏమి కావాలో నాకు అన్ని తెలుసు అని అన్నాడు. ఏంట్రా నీకు తెలిసింది చెప్పు అన్నాడు శ్రీధర్ .

ఒరేయి బాబు వాళ్ళు లవ్ చేసేది మేకప్ కోసం, గిఫ్ట్స్ కోసం, లేదా వారి చిన్న చిన్న సరదాలు తీర్చుకోవడానికి ప్రేమ అంటూ వెంట పడతారు అన్నాడు తేలికగా తేజ్, నీ బొందరా, నీ బొంద అమ్మాయిలు కొందరు అలా ఉంటారేమో కానీ అందరూ అలా ఉండరు.

అందరూ మంచి మనస్సు తోనే ప్రేమిస్తారు అన్నాడు మహేష్. అరెయి మహేష్ ఇంతగా చెప్తున్నావు కదా మరి నీతో తిరిగిన ప్రియ నిన్ను ఎందుకు వదిలేసిందో చెప్పు అన్నాడు తేజ్. దానికి మహేష్ ఆదా తనకి, నాకు మనస్సులు కలవలేదు, కొన్నిరోజులు అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేశాం, కానీ తాను నాకు, నేను తనకు అర్థం కాక పోవడంతో ఎవరి దారిలో వాళ్ళం వెళ్లిపోయాం అన్నాడు మహేష్.

సోది అర్థం చేసుకోక పోవడం అంటూ ఏమి లేవు, తనకి నీ మీద ఇంట్రెస్ట్ పోయింది కాబట్టి నువ్వు అర్థం కాలేదు అంటూ సోది చెప్పి, ఇంకొకడ్ని చూసుకుంది అంటూ తేల్చేశాడు తేజ్. ఇంతగా వాళ్ళని బాగా ఏరిగినట్టు చెప్తున్నావ్ నువ్వు ఎంత మందితో తిరిగావ్ ఏంటి అన్నాడు నవీన్.. నేనా నేను చాలా మందితో తిరిగాను.

ఎనిమిదో తరగతి నుండి మొదలు నాకు అమ్మాయిలు పడడం మొట్టమొదటి పిల్ల పేరు తస్లిమ్, తర్వాత బిందు, ఉష, అను, రెజీనా వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరినీ నేను చాలా సార్లు పిక్నిక్ లకు, సినిమాలకు, షాపింగ్ లకు తీసుకుని వెళ్ళాను. మా  నాన్నా జేబులోంచి డబ్బుని తీసుకుని మరి వాళ్ళని తీసుకెళ్ళాను అని చెప్పిన తేజ్ ని చూసి అయితే నువ్వు వారి వల్ల అమ్మాయిలు అందరూ అంతే అని అనుకుంటున్నావు అన్న మాట అన్నారు ముక్త కంఠంతో..

దానికి తేజ్ అవును రా వాళ్ళు అలా చేయబట్టే నేను అమ్మాయిలని నమ్మడం మానేసాను అన్నాడు తేజ్. అతని మూర్ఖత్వం చూసి నవ్వుకున్న స్నేహితులు, అప్పుడు వారిది ప్రేమ కాదని, ఆకర్షణ అని తెలుసుకోలేక, అసలు ఆలోచన కూడా రాని తేజ్ మనస్సు చూసి పోనీలే అని వదిలేశారు. కానీ బిందు మాత్రం అలా వదిలెయ్యలేక పోయింది. అతనికి తగిన బుద్ధి చెప్పాలని, అమ్మాయిలు అంతా ఒక్కటే కాదని, ప్రేమిస్తే ప్రాణాలు కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారని అతనికి తెలియాలని అనుకుని అప్పటికి అక్కడి నుండి వెళ్ళిపోయింది..

కొన్ని రోజులు అయ్యాక ఒక రోజు తేజ్ సాయంత్రం కాలేజీ అయ్యాక ఇంటికి వెళ్తున్నాడు బైక్ మీద హలొ అంది ఒక అమ్మాయి అతని పక్కనే తన స్కూటీ ని ఆపుతూ, తేజ్ చూసి చూడనట్లు చూసాడు. ఎయి తేజ్ ఏంటి అలా చూస్తున్నావు నేను సింధుని గుర్తు పట్టలేదా నన్ను అంటూ స్కూటీ ఆపేసి దగ్గరికి వచ్చిందా అమ్మాయి. తేజ్ తెల్లబోయి చూసి, హే ఎవరు మీరు అని అడిగాడు తేజ్ అమ్మాయిని. పక్కన  ఆగిన వాళ్ళు అతన్ని విచిత్రంగా చూడడం తో తేజ్ ఇబ్బందిగా మొఖం పెట్టి ఎవరండి మీరు అని మళ్ళీ అడిగాడు.

హలొ ఏంటి ఓవర్ చేస్తున్నావు/ ముందు పద ఇంటికి నాలుగు రోజులు కనిపించకుండా పోయేసరికి నేను ఎవరో తెలియనట్లు నాటకం ఆడుతావా, బుద్ధి ఉందా అసలు నీకు సరే ఎలాగూ ఇంటికే వెళ్తున్నావ్ కదా, పద ఇంటి దగ్గరే తేల్చుకుందాం నేను ఎవరో ఏంటో ఆంటితోనే ఆడిగిస్తా అంటూ స్కూటీ ముందుకు దూకించింది.

ఏంటయ్యా రోడ్ మధ్య మీ గొడవ అని అంటూ పక్కనుండీ విసుగ్గా అన్నారు బైక్ వాళ్ళు. అయినా ప్రేమలో ఇవ్వన్నీ మాములే కానీ, పిల్లనే తెలియదు అని అనడం ఎందయ్యా అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు వాళ్ళు. ముందు వెళ్తున్న అమ్మాయి కనిపించక పోవడంతో, ఎవర్నీ చూసి ఎవరో ఆనుకుంది అని సరి పెట్టుకుని ఇంటికి వెళ్ళాడు తేజ్.

కానీ అక్కడ ఇంటి దగ్గర తన తల్లి సుహాసినితో మాట్లాడుతున్న అదే అమ్మాయిని చూసి ఆశ్చర్య పోయి ,హే ఏంటి నువ్వు ఇక్కడ ,అమ్మా అది అని నసగాసాగాడు ,దానికి తల్లి అరేయి ఏంట్రా నువ్వు చెప్తున్నది. సింధు ని అలా అనవచ్చునా ,ని కోసం పాపం ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చింది అని అంటున్న తల్లి ని అలాగే చూసాడు తేజ్ .

చూసి అమ్మా నీకు అమ్మాయి ఎవరో తెలుసా అని అడిగాడు ,అయ్యో రామా ఏంట్రా నాన్న నికేమయ్యింది ఇది సింధు రా మనం విజయవాడలో ఉన్నప్పుడు అదే నువ్వు ఎనిమిదో తరగతిలో ఉండగా ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసావు కదా ఆమె నీ ఇది, పాపం నీ మిద చాలా  ఆశలు పెట్టుకుని ,నువ్వే జీవితం గా బతుకుతుంది. నిన్ను ప్రేమిస్తున్నా అని మా అందరికి చెప్పింది. నేను మీ నాన్నగారు కూడా ఒప్పుకున్నాం కదా నీ ఇంటర్ మొదట్లో, అయితే మీ చదువులు అయ్యాక పెళ్లి చేద్దాం అని అనుకున్నా ,దాంతో తను అమెరికాకు వెళ్లిపోయింది చదవడానికి ,మళ్ళి ఇన్ని రోజుల తర్వాత వచ్చిన దాన్ని అదే సింధుని పట్టుకుని నువ్వు తెలుసా, నువ్వు ఎవరూ అని అడుగుతావా, అయినా ఇదేమి బుద్ధిరా నీకు అమ్మాయి అంతగా ప్రేమించినా అని వస్తే నువ్వు కాదు అంటావా ,నీకసలు బుద్ది లేకుండా పోతుంది, నువ్వు రా అమ్మా అని అంటూ లోనికి తీసుకుని వెళ్తూ, చూడు తేజ్ అమ్మాయిని ప్రేమించి ,ఇప్పుడు కాదు పొమ్మంటే బాగోదు, నీకు తనకి వారం రోజుల్లో పెళ్లి చేస్తాను ,రెడీగా ఉండు అనిచెప్పి కోపంగా లోనికి వెళ్లిపోయింది తల్లి సుహాసిని .

తనని ప్రేమించిన ఎనిమిదో తరగతిలోని సింధునా ,అసలు తానెవరో నాకు గుర్తులేదు అమ్మా , అమ్మాయితో నాకు పెళ్ళేంటి అని మనసులో అరుస్తూ, తల్లికి ఎదురు చెప్పలేక, లోలోపల బాధ పడసాగాడు తేజ్ .ఇంట్లో తల్లి తండ్రి అమ్మాయితో కలిసిపోయి మాట్లాడుతున్న సన్నివేశం చూసి ,అయ్యో ఎవరో తెలియని అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి. అసలు ప్రేమ అంటే ఏంటి, ఎనిమిదో తరగతిలో ఎక్కడైనా ప్రేమ ఉంటుందా, ఆమె చెప్పాగానే వీళ్ళు నమ్మడం, పెళ్లి చేస్తాము అని అనడం ఎంటి? నన్ను అసలు పట్టించుకోరా, నా మాట వినరా, నన్ను అడగరా, నాకు ఇప్పుడు అమ్మాయి అవసరం లేదు, కాదు నాకు ఇప్పుడు అమంయి నచ్చడం లేదు ,నాకు వేరే అమ్మాయి కావాలి.

నాకు నచ్చిన అమ్మాయి కావాలి అని అనుకుంటున్నాడు మనసులో.. రోజు అలా జరిగిపోయింది. కానీ తేజ్ మనసులో అలజడి మాత్రం రగిలిపోతూనే ఉంది. కారణం తను ఎప్పుడో ప్రేమించిన అని చెప్తున్నా అమ్మాయి అసలు తనకు గుర్తే లేదు. అయినా ఎప్పుడో ప్రేమించిన అంటూ ఇప్పుడు రావడం ఏంటి , రాత్రి నిద్ర పోలేదు తేజ్, ఎవరా సింధు ,నన్ను ఎందుకు ఇలా చేస్తుంది ,తను లవ్ చేస్తున్న అని అంత బరి తెగించి చెప్తుంది, ఆలోచనలతో తల బద్దలు అయిపోతున్నా ,ఏమి అర్ధం కాలేదు తేజ్ కి ,అర్ధం కాకుండానే అతనికి తెల్లారి పొయింది.

తెల్లారింది సింధు తేజ్ కి పాలు తీసుకుని తేజ్ బెడ్ రూమ్ లోకి వచ్చింది, హలో తేజ్ ఇదిగో అంటి నీకు పాలు ఇచ్చి రమ్మంది అని కప్ టేబుల్ మిద పెట్టింది, హే ఛి నున్ను ఎవరూ తెమ్మాన్నారు పాలు పో అవతలికి పో అని అన్నాడు, ఏంటి ఉరుకుంటుంటే పో పో అంటున్నావు , నిన్ను నేను ప్రాణం లా ప్రేమించాను, చిన్నప్పుడు మనం ఎన్నో సినిమాలకు షికార్లకు తిప్పావు నన్ను, అయినా మీ అబ్బాయిలకు ప్రేమ అంటే, నాలుగు రోజులు టైం పాస్ చేసి వెళ్ళే అమ్మాయిలే మీకు నచ్చుతారు కదా, మేము ఇంతగా ప్రేమించి, మిరే కావాలని దగ్గరికి వస్తే, మిరే ప్రాణం, మిరే లోకం అని మిమల్ని ప్రేమిస్తూ ఉంటె మీరు మాత్రం మమల్ని కుక్క కన్నా హీనంగా చూస్తారా?

నువ్వు అయితే మరి నన్ను హినగా చూస్తున్నావు, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తే మా అమ్మవాళ్ళని వదిలేసి వస్తానో ఒక్కా సరి ఆలోచించు అని, ఒక్కాసరిగా ఏడుస్తూ ఛి ఇంట చెప్తున్నా నీకు నా ప్రేమ అర్ధం అవుతలేదు, నీకు నా ప్రేమ ఎంతనో, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసుకో, చూడు అమ్మాయిలు ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు.

నేను నీ కోసం నా ప్రాణం కూడా ఇస్తాను. అప్పుడైనా నా ప్రేమ నిజమని నమ్ముతావో, లేదో అని అంటూ రెందంతస్తులు ఉన్న బిల్డింగ్ పైన నుండి కిందకూ దూకింది సింధు.

హే ఏమి చేస్తున్నావు అని అంటూ దగ్గరికి వెళ్ళబోయిన తేజ్ ని అగమంటూ అప్పటికే కిందకి దుకేసింది. అమ్మో అమ్మో అని భయపడిన తేజ్ సింధు మాట్లాడిన ఒక్కొక్క మాట తల్చుకుంటూ అమ్మాయిలను తను చిప్ గా చూడడం వారి గురించి తన స్నేహితుల దగ్గర హేళనగా మాట్లాడడం గుర్తొచ్చి, చాలా బాధ పడి, కిందకి వెళ్ళాడు, అక్కడ రక్తపు మడుగులో ఉన్న సింధుని చూస్తూ, తల్లి తండ్రి ఇద్దరు ఎంత పని చేసావురా నిన్ను ప్రేమించిన అంటూ వచ్చిన అమ్మాయిని , ఇలా చనిపోయేలా బాధ పెడతావా, అయినా ఏమంది రా అమ్మాయి నిను ప్రేమించ అంది అంతేగా, అయినా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే పెట్టి పుట్టాలిరా, మేము కూడా ప్రేమించిన వాళ్ళమే, మేము లవర్స్ మె నీకు విషయం తెలిదు ఇన్ని రోజులు, అమ్మయిలు అంటే బొమ్మలు కాదు రా వాళ్ళు ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, అయినా మేము కూడా ఒప్పుకున్నాం కదా రా మరి నికేంటి అడ్డు అమంయిని పెళ్లి చేసుకుంటే తప్పా ఎనిమిదో తరగతి నుండి ప్రేమించిoది కదా అని అన్నాడు తండ్రి .

ఇక తేజ్  నాన్న అదేంటి మీరు కూడా అలాగే అంటారు. అప్పుడు మేము చిన్న పిల్లలం, మాకు తలిసి తెలియని వయస్సు, ఎదో ఆకర్షణ, అమ్మాయి చూసి నవ్వితే అదే ప్రేమ అని అనుకునే వాళ్ళ, సరదాగా తిరిగితే, షాపింగ్ లు చేస్తే అది ప్రేమెలా అవుతుంది. అప్పుడు ఎదో తిరిగాము అని, ఇప్పటికి ఆమెని ప్రేమిస్తాను అని ఎలా అనుకున్నావు, నాకు ఇష్టాలు, కోరికలు ఉంటాయి కదా.

మరి నాకు నచ్చకుడదా అమ్మాయి, అయినా ఇలా చస్తుంది అని నేను అనుకోలేదు, అయినా అంత చిన్న వయస్సులో ప్రేమేంటి అని అన్నాడు తేజ్.. కదా మరి నువ్వు ఎనిమిదో తరగతిలో, తొమ్మిదో తరగతిలో ప్రేమించిన అమ్మాయిలు కేవలం నీ పాకెట్ మణి కోసం, షాపింగ్ ల కోసం ప్రేమించారు, వాళ్ళ అవసరం తీరగానే వెళ్ళిపోయారు అని, పైగా నీకు ఇష్టాలు ఉంటాయి, కానీ వాళ్ళకి అంటే అమ్మయిలకు ఉండొద్దు, ఆమె నీ వెంట కుక్కలా తిరగలి కానీ నువ్వు ఆమె ని పట్టించుకోవు కదా, పద ఇక సింధు చనిపోయినందుకు నీకు జైలే గతి అంది బిందు వస్తూ.

ఏంటి బిందు నేను జైలుకు వేలడం ఏంటి అన్నాడు తేజ్ మరి ఆమెని ప్రేమించింది ఎవరూ ఎనిమిదో తరగతి నుండి ప్రేమ నడిపింది ఎవరూ, కుక్కలా నీ వెంట పడినా నువ్వు మోసం చేసేసరికి ఆమె ఆత్మహత్య చేసుకుంది. నీ కోసమే కదా అంది బిందు, నో, నాకేమి తెలియదు, ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, నేను వెళ్ళను జైలు కి అని అన్నాడు తేజ్.

మరి నువ్వు చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి కదా నీకోసం వచ్చింది కదా అని అనగానే అమ్మా, నాన్న నా బుద్ధి తక్కువ అయ్యి, అమ్మాయిల గురించి చిప్ గా మాట్లాడను, నన్ను క్షమించండి దయచేసి నాకు, దీనికి సంబంధం లేదు, నన్ను జైలుకి వేళ్ళకుండా కాపాడండి నాన్నా, ఇక నుండి అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడను, వారిని కలలో కూడా తిట్టను అని అంటూ ఏడుస్తూ మోకాళ్ళ మిద కూలబడ్డాడు తేజ్.

అమ్మా సింధులే వాడు ఇక జన్మలో అమ్మాయిల గురించి మాట్లాడాడు లే తల్లి అన్నారు హర్షవర్ధన్ గారు, దానితో సింధు లేచి నిలబడింది, ఆమె లేవడం చూసి తేజ్ కళ్ళు తిరిగి పడిపోయాడు. గంట తర్వాత సృహలోకి వచ్చిన తేజ్ ని చూస్తూ తండ్రి ఇదంతా బిందు ఆడించిన నాటకoరా, నువ్వు అమ్మాయిల గురించి చెడుగా మాట్లాడడం నాకు వచ్చి చెప్పింది, దాంతో నీలో మార్పు రావాలనే మేము నాటకం అడము. ఇందులో మీ అమ్మ కూడా ఉంది. నీలో మార్పు వచ్చింది అది చాలు మాకు అని అన్నారు.

తన బాగు కోసం,తన మంచికోసం ఆలోచించిన బిందునే తేజ్ తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు అని వేరే చెప్పక్కర్లేదు కదా మీకు.….

Related Posts