manassu tanadi kaakapothe

ప్రేమ అలియాస్ The Broken

ప్రేమ అలియాస్ The Broken

సరిగ్గా ఆలోచిస్తే,
మనుషులు మోసపోవడం కాదు..
మనుషులు ప్రేమ అనే పదాన్ని వాడుకొని వదిలేస్తునందుకు..
ప్రేమ అనే పదం మోసపోతుంది..
ప్రేమకి ప్రాణం ఉంటే,
తన అర్థాన్ని కోల్పోయి, మనిషి చెప్పిన మాటలలోనే మిగిలిపోయి..
ఒంటరిగా ఉన్న ప్రతిసారీ, మళ్ళీ ఇంకో మనిషి..
ప్రాణం లేని ప్రేమని మోసం చేస్తుంటే, ఒంటరితనం కూడా నవ్వుతుంది..
నువ్వు ఒంటరిగా కూడా ఉండలేవని..!
బహుశా ప్రేమకి, బాధపడటం కూడా ఒక అలవాటుగా మారిపోయి,
అసలు బాధంటే ఏంటో గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళిపోయిందేమో..
నిజంగా ప్రేమకి ప్రాణం ఉంటే,
ఎన్నో సార్లు పుట్టి, మరణిస్తున్న తరుణంలో,
ప్రేమకే ఎక్కువ సమాధులు ఉండేవేమో !!
తన జీవనశైలిలో అస్థిత్వాన్ని, స్థిరత్వాని కోల్పోయి,
మోసం అనే వ్యసనానికి అలవాటుపడి బ్రతుకుతూ ఉంటుందేమో..!!
ఇది రాసిన నా మనసుకి, చదివిన నీ మనసుకి
ప్రేమ – అలియాస్ The Broken అనిపిస్తుందేమో..

~ప్రేమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *