ప్రేమ ఆకర్షణా ?…ప్రేమ ప్రేమే ఇది ఆకర్షణ

అక్షర లిపి రచయితల (కథ…)
అంశం: ప్రేమ ఆకర్షణా ?
రచన: కె.కె.తాయారు

ప్రేమ ?

ప్రేమ ప్రేమే ఇది ఆకర్షణ
కానే కాదు, మనసులోంచి
మమతలు నింపుకొని
పంచేది ప్రేమ.

ప్రేమ ఎన్ని తెరగులో
వివరించవచ్చు
అమ్మ ప్రేమ నాన్న ప్రేమ
అన్నదమ్ముల, అక్క చెల్లెండ్ర

స్నేహితులు ప్రేమికులు
జగమంతా ప్రేమమయం
మనము పూసిన రంగుల
రూపాలు రకరకాలు

అసలు ప్రేమ ఏదీ ఆశించక
ఏమి కోరక, స్వచ్ఛమైన
అపురూప మైన తేటతెల్లమైన
అభిమానాలు నింపుకొని

స్వీకరించేది, వ్యక్తీకరించేది
ప్రేమ, భగవంతునికి భక్తుడు
తల్లి బిడ్డకి ఇచ్చేది ప్రేమ
ఇది పవిత్రమైన ప్రేమ

ప్రేమికుల మధ్య కక్ష
సాధింపు ప్రేమ అది
ప్రేమ కాదు, కాదనిన
హత్య, ప్రాణాలు తీయుట

రాక్షసత్వం దుర్మార్గం
అది ప్రేమ కాదు వాంఛ
ప్రేమ పెన్నిధి,దాచలేము
కంచెలు లేవు, ఆశించదు
అందిస్తుంది అతి పవిత్రమైన
పరిపూర్ణమైన ప్రేమ!!!

ఇది నా స్వీయ రచన అనుకరణ అనువాదం కాదని హామీ ఇస్తున్నాను.
…..కె.కె.తాయారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *