అక్షర కొరకు
అంశం : ఏది మోసం ఏది నిజం
శీర్షిక : ప్రేమ గులాబీ
ప్రతి యువతికి కలల పూదోటలో ఆహ్లాదంగా
చేయి చేయి కలిపి ప్రియునితో విహరించాలని బలమైన కోరిక ……….
ఆతడు పేదవాడైనా హృదయంలో చందమామ వెన్నెల గుబాళింపు ……..
నీ మనస్సు చూరగొనాలని తహతహ అతనో ప్రేమ గులాబీ……….
అయినా కారు బంగ్లా ఉన్న విలాసవంతమైన డాబుసరి మగాన్ని నీవు ప్రేమించావు …… …
అతనిని ప్రాణప్రదంగా ప్రేమించావు ఊహల మేడల్లో కనే కలలకు అడ్డూ అదుపు లేదు………
అతను సరే అంటే చాలు పెళ్ళి పీటలు ఎక్కాలని కుతూహలం………
అతని గురించి రకరకాల చెడు పుకార్లు విని ఆలోచనలో పడ్డావు ………
డబ్బు ఎరతో ఎంతో మంది అమ్మాయిలను మోసం చేశాడని విని విగతజీవివి అయ్యావు ……….
నీకోసం సమస్తమూ అర్పించి ప్రేమ కమలాలు తన కళ్లల్లో నీ హృదయాన్ని చూసుకుంటూ జీవితాంతం తోడునీడగా ఉండే సాధారణ ఉద్యోగిని దూరం చేసుకోవడం హృదయాలను గాయపరచు కోవడమే ………..
ఆలోచనలోంచి బయటపడి నిన్ను ప్రగాఢమైన ప్రేమ అనుభూతిలో మునిగి తేల్చగల చంద్రశేఖర్ కోసం వెర్రిదానిలా పరుగు లాంటి నడకతో అతని ఇంటికి చేరి ప్రేమలు పంచియిచ్చే అతని హృదయాన్ని హత్తుకుని వెక్కివెక్కి ఏడ్చేశావు ……….
అందుకే నిజం గ్రహించి మెలుగు
అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం : ఈ కవిత నా స్వీయ రచన అని హామీ.