"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

ప్రేమ జంట..

శీర్షిక:⁠- ప్రేమ జంట

ఒక రోజు శ్యామ్ మేడ మీద పడుకున్నాడు. కిషోరి తన గదిలో ఒంటరిగా ఉండడం వల్ల నిద్ర పట్టడంలేదు అని మేడ మీదకి వెళ్ళాను.

శ్యామ్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడు.

కిషోరి మెల్లగా వచ్చి కూర్చుని తన ఫోన్ చూసుకుంటుంది.

కోపంతో ఫోన్ పెట్టేస్తాడు శ్యామ్. ఐదు నిమిషాల తర్వాత కిషోరి వంక చూసి ,
“నువ్వా… నువ్వు ఎప్పుడు వచ్చావ్? ఇంకా నిద్రపోలేదా?” అని అడిగాడు శ్యామ్.
“లేదు బావ. నాకు నిద్ర రావడం లేదు. కాసేపు నీతో కబుర్లు చెప్పడానికి వచ్చాను. ఎవరితో బావ ఫోన్ మాట్లాడుతున్నావ్” అని అడిగింది కిషోరి.

“నా స్నేహితుడితో మాట్లాడుతున్నా…”  అని చెప్పాడు శ్యామ్.

“మరి ఎందుకు కోపంగా ఫోన్ పెట్టేసావ్?” అని అడిగింది కిషోరి.

“ఇప్పుడు ఆ విషయం ఎందుకే చెప్పు?” అని కిషోరి తల మీద మొడికాయ వేస్తాడు శ్యామ్.
సర్లే బావ అని దిగులుగా చెప్పింది కిషోరి.

ఆకాశంలో ఉన్న చందమామని చూసి ,
“బావ ఈరోజు పౌర్ణమి నా వెన్నెల రాత్రి లా ఉంది” అని అడిగింది కిషోరి.
“నాకు తెలీదు కానీ మొన్న నువ్వు నీ స్నేహితురాలు పెళ్లికి వెళ్ళావుగా అక్కడ సంగతులు చెప్పు” అని అడిగాడు శ్యామ్.

telugu stories with moral

“వాళ్ళ పెళ్లి చాలా బాగా జరిగింది. పెళ్ళికొడుకుని మేము చాలా ఏడిపించాము” అని చెప్పుతుండగా
కిషోరికి ఫోన్ వస్తుంది అయిన ఎత్తడం లేదు.
అది గమనించిన శ్యామ్  ,

“ఎందుకే ఫోన్ ఎత్తడం లేదు?” అని అడిగాడు.
కొంచం కంగారుగా “అది… బావ…అది” సాగదీస్తుండగా…
కిషోరి ఫోన్ తీసుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు శ్యామ్.
“ఏంటే… మీ బావకు నీ ప్రేమ విషయం చెప్పవా?
ఏం అన్నారు?” అని అడుగుతుంది అఖిల.
శ్యామ్ వెంటనే ఫోన్ కట్ చేసి కిషోరి వంక కోపంగా చూడగా ,
“బావ… అది” కిషోరి అంటుండగా ,
“కంపెనీ కాల్ అని చెప్పి , నేను ఇప్పుడే వస్తాను” అని చెప్పి వెళ్ళిపోయాడు శ్యామ్.
ఒక అరగంట తర్వాత వచ్చి కిషోరి కళ్ళు మూశాడు.
కిషోరి కళ్ళు తెరిచిన కాసేపటికి ,
“తన ప్రేమ విషయం చెప్పడానికి భాషలే సరిపోలేదు అందుకే ఇలా అక్షరాలుతో చెప్తున్నాను” అని చెప్పాడు శ్యామ్.
“ఈ వెన్నెల రాత్రి నా ప్రేమ విషయం చెప్పాలనుకున్న ఈలోపే నువ్వే చెప్పడం నాకు ఆశ్చర్యకరంగా ఉంది బావ. ఈ వెన్నెల రాత్రి రోజు నీతో ఎన్నో కబుర్లు చెప్పాలనుకున్నాను” కొంచెం ఆనందభాష్పాలతో చెప్పింది కిషోరి.
“ఈ వెన్నెల రాత్రంతా మనం కబుర్లు చెప్పుకునే ఉందాం” అని నవ్వుతూ చెప్పాడు శ్యామ్.
ఈ వెన్నెల రాత్రిలో ఒక ప్రేమ జంట ఒకటయ్యి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.

మాధవి కాళ్ల

telugu stories with moral

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *