ప్రేమ పక్షులు

 

హాయ్ అన్నాడు నవీన్ ,హాయ్ అంది త్రిష ,నీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్నడు నవీన్ , అవునా చాలా థాంక్స్ అంది మళ్ళి త్రిష. మరి నా వీడియోస్ ని  లైక్ చేయ్యవా అని ఆడిగాడు నవీన్ సరే చేస్తాలే అని అంది త్రిష ,అలా వారిద్దరూ ఒకరి వీడియోలను ఒకరు లైక్ లు చేసుకుంటూ ఉన్నారు.. అప్పుడే వారిద్దర్నీ ఫాల్లో అవుతూ వచ్చింది ఉష అనే అమ్మాయి, వారి విడియోలను చూసి బాగున్నాయి అని ఇద్దర్ని మెచ్చుకుని, తన వీడియోస్ కూడా చూసి ,ఫాల్లో అవ్వమని  చెప్పింది.  త్రిష, నవీన్ మధ్యకు వచ్చిన ఉష కూడా తన వీడియోలని లైక్ చేయమంటూ ఇద్దర్ని అడిగింది. ఇద్దరూ కూడా ఆమె వీడియోలను చూసి లైక్ చేశారు. వారి వీడియోలకు కూడా ఉష లైక్ కొట్టింది. అలా వాళ్ళ పరిచయం పెరిగింది. ఒకరి వీడియోలు ఒకరు చూస్తూ, లైక్ లు కొట్టుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ ఉండేవారు.

అయితే ఉష నవీన్ ని చూసి, అతని వీడియోలో ఉన్న కంటెంట్, అతను ప్రతి ఒక్కరికి ఇచ్చే మర్యాద అవ్వన్ని చూసి అతనితో ప్రేమలో పడిపోయి, నవీన్ తో మాటలు కలిపింది. ఇక త్రిషతో మాటలు తగ్గించిన నవీన్, ఇటూ ఉషతో మాట్లాడ్డం మొదలు పెట్టాడు. సంగతి తెలియని త్రిష నవీన్ గురించి కలలు కంటూ, అతను తనకు ప్రపోజ్ చేస్తాడని అనుకుంటూ ఎదురుచూస్తున్నది. కొన్ని రోజులు అయ్యాక త్రిషకు అనుమానం మొదలయ్యింది. నవీన్ ఇంతకు ముందులా తనతో మాట్లాడక పోవడం, తనతో డ్యూయెట్ చెయ్యకుండా ఉషతో చెయ్యడం చూసి, ఒక సారి తన వీడియోలకు అతను లైక్ లు కొట్టాడా లేదా అని చూసుకోసాగింది.

కానీ తన వీడియోలలో మాత్రం తనకు వచ్చిన కామెంట్స్ చూసి ఆశ్చర్య పోయింది. అంతగా ఉన్నాయి కామెంట్స్, అవ్వన్ని తనకే వచ్చాయి అని అనుకుని ఒక్కొక్కటిగా చూడసాగింది. కానీ అవి ఉష, నవీన్ మాట్లాడుకున్న మాటలు, అంటే లవ్ చేసుకుంటూ, ఎవరికి తెలియకుండా మాట్లాడుకోవడం కోసం త్రిష వీడియోలో మాట్లాడుకున్నారు అన్న మాట.

ప్రేమ పక్షులు మాట్లాడుకున్న మాటలని చూసి త్రిష ఆశ్చర్య పోయింది. అందులో అన్ని మాటలు, నీకు ఎం ఇష్టం, ఎలా ఉండాలి, ఎక్కడ పెళ్లి చేసుకుందాం అనేవన్ని ఉన్నాయి. తాను నవీన్ మీద పెట్టుకున్న ఆశలు అన్ని ఆవిరి కావడంతో త్రిషకు పట్టారని కోపం వచ్చింది. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఉష వీడియోలో ఒక దాంట్లో చున్నీ లేకుండా చేసిన వీడియో చూసి, దాన్ని ట్రోల్ చేసే వారికి పంపింది.

అందులో నిజం ఉండడంతో వాళ్ళు ఒక నాలుగు వీడియోలు ఉష చున్నీ మీద చేసి పెట్టారు, అది చూసిన నవీన్ తన లవర్ ని అనడానికి మీరెవరు అంటూ వారితో గొడవ పెట్టుకున్నాడు. మరి ఆమె అలా చెయ్యొచ్చా అని వాళ్ళు అడగడంతో, అరె నా పిల్ల, నా ఇష్టం అని అన్నాడు, నీ పిల్లనా, ఏం పెళ్లి చేసుకుంటావా, ఏదీ చేసుకో అని వాళ్ళు రెచ్చ గొట్టడంతో, నవీన్ తన ఇంట్లో ప్రేమ విషయం చెప్పి, పెద్ద వాళ్ళని ఒప్పించాడు.

అటూ ఉష కూడా తన తల్లిదండ్రులకు విషయం చెప్పి ఒప్పించుకుంది. పిల్లల ఇష్టాలు తెలిసిన పెద్ద వాళ్ళు అన్ని బాగుండడంతో ఒప్పుకున్నారు. నాలుగు రోజుల్లోనే నవీన్, ఉషల పెళ్లి జరిగిపోయింది. ఎదో చేద్దాం మని అనుకున్న త్రిష, వారిని ఏమి చెయ్యలేక, వారి పెళ్లికి కరణమయ్యింది. ట్రోల్ చేసిన వారి ద్వారా విషయం తెలిసిన నవీన్, ఉషలు త్రిషకు మా పెళ్లి జరగడానికి కారణమైన త్రిషకు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో చేశారు.

అటూ నవీన్ ప్రేమ గురించి చెప్పక, చేసిన తప్పుని, పైగా ట్రోల్ చెయ్యమని చెప్పి వారి పెళ్లిని జరిపించిన తన తెలివి తక్కువ తనానికి తనని తానే నిందించుకుoటూ ప్రేమ పక్షులు ఇద్దరూ నవ్వుతున్న వీడియోని చూస్తూ ఉండిపోయింది త్రిష……

 

Normal
0

false
false
false

EN-US
X-NONE
HI

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-fareast-font-family:”Times New Roman”;
mso-fareast-theme-font:minor-fareast;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}

Related Posts