ప్రేమ పెళ్ళి సుఖసంసారం
ప్రేమించుకున్న యువ జంట పెళ్ళి చేసుకున్న సంబరమే సంబరము
ద్విగుణీకృత సంతసం జీవితాంతం వెల్లివిరియాలి
మనసైన చిన్నదాన్ని మనుమాడిన ప్రియుని హృదయం సంధ్యాకాంతుల లోగిలి
ప్రేమ సఫలమైన సుందరి మోము గుమగుమలాడే గులాబీ
తనువులు పరవశించిన తన్మయత్వంలో మనస్సులు వెన్నెలల్లిన చాందిని
నగు మోములు సింధూర పూవుల్లా మైమరమరపించే రసడోలికలు
మందార మకరందాల పరిమళాల విరిజల్లులు
మీ దాంపత్యం జీవితాంతం ఇలాంటి హృద్యమైన అనురాగాల హరివిల్లు కావాలి
ప్రేమసాగరం ఈదిన చందం పిల్లాపాపలతో ఆదర్శ అనురాగాల కుటుంబం కావాలి
నిత్య యవ్వనంతో సరస సల్లాపాలతో ఒకే పూవు లోని మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెదలా సీతారాముల్లా సుఖసంసారం సాగించాలి,,,,,,
జీవితంలో సుఖదుఃఖాలలో ఇద్దరు కలిసిమెలిసి చర్చించుకుని పంచుకుంటూ ఓరిమితో సంసార సాగరాన్ని ఈదాలి
చుంబనాలతో ఒకరికొకరు ప్రేమామృతాన్ని పంచుకుంటూ రసాస్వాదన చేసుకుంటూ తారచంద్రుల్లా నిత్యం వసంతాల పల్లకిలో ఊయలలూగాలి
ఇరువురు చేయి చేయి కలగలిపి కష్టపడితేనే జీవనం సాఫీగా సాగిపోతుంది ఇది మరువకు,,,,,
అపరాజిత్