అంశం:- ప్రేమ లేఖలు
శీర్షిక:- టీవీకి నా ప్రేమలేఖ
టీవీ ఓ నా టీవీ
నువ్వంటే నాకు ప్రాణం
నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను
నువ్వంటే నాకు లవ్వు
నీకు రాయాలనుకున్న ఒక ప్రేమ లేఖ
నేను నిన్ను ఎన్నో సంవత్సరాలగా ప్రేమిస్తున్నాను..
చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు పిచ్చి
ఓ నా టీవీ ఒప్పుకో నా ప్రేమని
నీకోసం రాశాను ప్రేమలేఖని
నువ్వే నా ప్రపంచం అనుకుంటూ
ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా ఉంటూ
నాకు బోర్ కొడితే కాలక్షేపం అవుతావు
ఓ నా టీవీ అందుకో నా ప్రేమలేఖని
ఎదురు చూస్తాను నీ సమాధానం కోసం
నువ్వే నా ప్రపంచం అనుకుంటూ
రోజుల్లో నిన్ను ఒకసారైనా చూడకపోతే నాకు పొద్దుపోదు…
కాలాలు మారిన టెక్నాలజీ మారినా నిన్ను చూడడం మాత్రం మానుకోను…
కొన్ని సంవత్సరాలుగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను
నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను..
మాధవి కాళ్ల