ప్రేమ విలువ

రజియకు పెళ్లి అయ్యి నాలుగేళ్ళు అవుతున్నా పిల్లలు లేరు.దాంతో ఆమె అత్తా ఆమెని ఎన్ని బాధలు పెడుతూ ఉంది. పిల్లలను కనని గొడ్డు అని అంటూ అవమానిస్తూ తన కొడుక్కు ఇంకో పెళ్లి చేస్తాను అని సంభందాలు కూడా చూసింది.తనకు ఈ విషయం లో  సహాయం చెయ్యమని తల్ల్లిదండ్రులనుఅన్నాదమ్ముల్లనుచుట్టూ పక్కల వారిని అందరిని బతిమాలింది రజియ కానీ ఎవరూ ఆమె కి సహాయం చేయడానికి ముందుకు రాలేదు.

పైగా తప్పంతా రజియదే అన్నట్టు మాట్లాడి వాడు మగడువాడేనని పెళ్ళిళ్ళు అయినా చేసుకోవచ్చు అని మాట్లాడారు అత్తాతల్లిదండ్రులు అయితే కొత్తగా వచ్చిన కోడలు తో పాటుగా నువ్వు ఉంటావుని దగ్గర ఒక నాలుగు రోజులుదాని దగ్గర ఒక నాలుగురోజులు నా కొడుకు ఉంటాడు అని అంటూ అదో గొప్ప విషయాన్నీ పెద్ద పంచాయితిని తిర్చినట్టుగా నవ్వుతు చెప్పింది అత్తా దాన్ని రజియ తల్లిదండ్రులు కూడా సమర్ధించారు.

వారి మాటలనిచేతల్ని చూస్తున్న రజియ కూ  ఒళ్ళంతా కారం పూసుకునట్టుగా అయ్యింది . ఆమె బాధనిఏడుపుని ఎవరూ పట్టించుకోకుండా వెళ్ళి రజియ భర్తకు ఇంకో పెళ్లి చేసుకుని వచ్చారు.తనతో అన్నేళ్ళు కాపురం చేసిన భర్త  తనకు సహాయం చెయ్యక పొగ తనని గొడ్డు అని తిడుతున్నా అంతా చులకనగా చూస్తున్నాతన సుఖం కోసంతన సంతోషం కోసం ఇంకో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ద పడిన భర్తని చూసిగుండెలు పగిలేలా ఏడ్చింది రజియ కానీ ఆమె ఏడుపు ఎవర్ని కదిలించలేదు.ఆమె మాటలుఆమె గోడు ఎవరూ వినిపించుకోలేదు.

పెళ్లి జరిగిపోయింది.రజియాని పెళ్ళికి ఎవరూ పిలవలేదు.పిలిచినా వెళ్ళే స్థితిలో ఆమె లేదు.వెళ్ళి చూసి తట్టుకునే శక్తి ఆమె కూ లేదు. పెళ్లి జరిగి నవ వధువు ఇంటికి వచ్చింది.ఇంట్లో రజియా ఉందనే విషయం కూడా మర్చిపోయిపదహారు రోజుల పండగని భర్త ఆనందంగా కొత్త పెళ్ళాం తో గడుపుతున్నాడు.వారి గది లోంచి నవ్వులుకేరింతలుచిలిపి మాటలుమంచం శబ్దాలు వింటుంటే రజియకు రక్తం మరిగిపోతుంది.

తన సంతోషాన్నితన వాడు అనుకున్న వాడినితన మంచాన్నితనకు మాత్రమే స్వంతం అయిన అతని దేహాన్ని అతను చేసే చిలిపి పనులు తనకే స్వంతం అయిన అతని మనసుతనకే దక్కాల్సిన సుఖాన్నితన మంచాన్నితన దుప్పటినితన బెడ్ షీట్ ని తన వాడిని తనకు కాకుండా చేస్తున్న ఆ కొత్త గా వచ్చిన ఆడదాన్ని నిలువుగా చిరేయ్యలని అనిపించింది. వెంటనే వంటింట్లో ఉన్న కొడవలిని తీసుకుని బెడ్ రూమ్ దగ్గరగా వెళ్ళింది.

బెడ్ రూమ్ లోంచి మాటలు బయటకు వినిపిస్తున్నాయి.తన కోరిక తీరిన తన వాడు అనుకున్న తన భర్త ఆ కొత్తవిడ తో రేపు మీ నాన్నని మొత్తం డబ్బు ఇవ్వమని అడుగు అనిదానికావిడ అయ్యో అబ్బా దగ్గర పైసలు లేవు ఇక అన్ని పెళ్లికే ఖర్చు అయ్యాయి అని అంటుండగా పట్ మని కొట్టిన చప్పుడుదాని కి ఆవిడా ఏడుపు వినిపించి గిరుక్కున వెనక్కి తిరిగింది రజియా..

తర్వాత తన గదిలోకి వెళ్ళి ఆలోచనలో పడింది ఏ ఆడపిల్లని ఏ తండ్రి రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేయడుపైగా మొదటి పెళ్ళాం బతికి ఉందని తెలిసిఆమెకు తలాక్ అవ్వలేదు అని తెలిసి ఇవ్వడుపెళ్లి చేయడుకానీ అతనికి ఇచ్చి పెళ్లి చేసాడు అంటే పాపం వాళ్ళ పరిస్థితి బాగా లేకపోవ్అచ్చులేదా ఎదో కష్టం వచ్చి ఉండొచ్చుఅందుకే రెండో పెళ్లి వాడు అయినాతనకు తలాక్ చెప్పక పోయిన పెళ్లి చేసారుఆమె పాపం ఎంత నలిగి పోయిందో ఈ పెళ్లి చేసుకోవడానికి

ఒక ఆడపిల్లకు ఇంతకంటే ఘోరమైన అవమానం ఏముంటుంది ఒక పెళ్లి అయిన వాడికిచాలా సార్లు పడక సుఖాన్ని పొందిన వాడితో పెళ్లి అంటే ఏ ఆడది మాత్రం ఒప్పుకుంటుందికానీ పాపం ఆమె ఒప్పుకుంది అంటే దీనికి ముందు ఎంత నరకం అనుభవించి ఉంటుంది. తన పదహారేళ్ళప్రాయాన్ని లేతయవ్వనాన్నిఇన్నేళ్ళు దాచుకునిఎవరికీ కనిపించకుండా బురఖాలో దాచిన అందాన్ని

తన ఉహల్లో తనకు కాబోయే వాడు ఇలా ఉండాలి అని ఉహించుకున్న పడుచు అమ్మాయికిఒక అనుభవం ఉన్న వాడు మొగుడు గా వస్తాడు అని ఆమె ఉహించి ఉంటుందా లేదు ఆమెకు మాత్రం తన సంగతి తెలియకుండా ఉంటుందా అలా తెలిసి ఒక ఆడదాని మొగుణ్ణి లాగేసుకుంటుంది అంటే పెళ్లి చేసుకుంది అంటే ఆమె ఎంత మధన పది ఉంటుందో కదా అని అనుకుంది రజియా.

తెల్లారిన చాలా సేపటి తర్వాత రజియని వెతుక్కుంటూ వచ్చింది ఆమె.తన గది లోకి వచ్చిన ఆమెని చూసి ఆశ్చర్య పోయింది రజియ. అమె రావడం తోనే రజియ కాళ్ళు పట్టుకుని నను క్షమించు అక్కానేను నీకు కావాలని అన్యాయం చేయలేదు.మా నాయన తొందరపడి ఇయనకు ఇచ్చి పెళ్ల్లి చేసారునన్ను కాపాడునాకు ఈ పెళ్లి ఇష్టం లేదునేను ప్రేమించిన రాము నా కోసం ఎదురుచూస్తూ ఉన్నాడునాకు సహాయం చెయ్యి రాత్రి కూడా ఆయనకు నేను లొంగలేదు

అందుకే నన్ను ఎలా కొట్టాడో చూడు అని శరీరం మిద ఉన్న వాతలు సిగరెట్ చురుకులని చూపించింది.రజియ అవి చూసి భర్త కూ కోరిక తీరకపోతే ఇలాగె చేస్తాడు అని గుర్తుకు వచ్చినువ్వు చెప్పేది నిజామానీ కోసం రాము చూస్తాడా అని అడిగింది.అవును చూస్తాడు నేను రాము ఇద్దరం ప్రేమించుకున్నాంఒకర్ని వదిలి ఒకరం ఉండలేము అని చెప్పింది కన్నీళ్ళతోసరే పద ఎక్కడుంటాడు రాము అంది రజియఈ ఊరి బస్ స్టాండ్ దగ్గర అని చెప్పింది ఆమె

వెంటనే బీరువాలో ఉన్న కొంత డబ్బునగలనుఒక సంచిలో పెట్టి తన బూరఖని ఆమెకు వేసి చూడు వీళ్ళు వెతికినా  దొరకని ఉరికి వెళ్ళిపెళ్లి చేసుకుని హయిగా పిల్లా పాపతో ఉండండి అని చెప్పి ఆమెని బస్ స్టాండ్ లో ఉన్న రాము దగ్గరికి  చేర్చిoది రజియ.

రజియా దగ్గర ఆశీర్వాదం తీసుకున్న ఇద్దరూ  అప్పుడే వచ్చిన బస్ ఎక్కి ఇద్దరు తమ చేతులని జోడించారు బస్ కనుమరుగు అయ్యే వరకు చూసిన  కళ్ళలో నిండాయి. వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ వచ్చిన రజియా భర్త చుట్టూ చూస్తూ ఏరి వాళ్ళెక్కడ అని అడిగాడు ఆత్రంగా 

భర్తని చీదరగా చూస్తూ వెళ్ళిపోయారు అంది.అతను కోపం తో చేయి ఎత్తాడు రజియా పైకి మధ్యలోనే చేయిని ఆపేసి చెంప మిద ఒక్కటిచ్చి అతని చేయిని పట్టుకుని ముందుకు సాగింది రజియా విజయం సాధించిన వీర నారిలా……

Related Posts