ఫార్వర్డ్ మెసేజ్

ఫార్వర్డ్ మెసేజ్

ఫార్వర్డ్ మెసేజ్

                                            రాము ఒక రోజు ఫోన్‌లో వాట్సాప్ చూస్తూ ఉన్నాడు. ప్రతిరోజు తన తెలిసిన వాళ్ళు రీల్స్ పంపిస్తూ ఉంటే రోజంతా చూడ్డానికి సమయం సరిపోవట్లేదు వీళ్ళు ఎలాగైనా నాతో మాట్లాడకుండా చేయాలి అనుకొని , అప్పుడే తనకి అకస్మాత్తుగా ఒక మెసేజ్ వచ్చింది.

“ఈ మెసేజ్‌ను 10 మందికి పంపితే… రేపటికి మీకు అదృష్టం వస్తుంది!” అని ఉంది.
రాము వెంటనే నవ్వుకుంటూ,
“అదృష్టం వస్తే బాగుంటుంది కదా!” అనుకుని 10 మందికి పంపేశాడు.
కొద్దిసేపటి తర్వాత అతని స్నేహితుడు ఫోన్ చేసి,
“అయ్యా! నువ్వు పంపిన మెసేజ్ చూసి మా నాన్న కూడా 10 మందికి పంపాడు. ఇప్పుడు మా ఇంట్లో అందరూ అదృష్టం కోసం ఎదురుచూస్తున్నారు!” అన్నాడు.
అంతలో మరో స్నేహితుడు,
“రేయ్! నీ మెసేజ్ వల్ల మా అమ్మ ఫోన్ కూడా ఫుల్ అయిపోయింది!” అని చెప్పాడు.
అది విని రాము మరింత గట్టిగా నవ్వాడు. మరుసటి రోజు నిజంగానే ఒక అదృష్టం వచ్చింది!
ఏంటంటే…
ఆ మెసేజ్‌ను పంపొద్దని అందరూ అతని నంబర్‌ను మ్యూట్ చేశారు. అప్పుడు రాము,
“వాహ్! ఇక ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయరు? ఇదే అసలు అదృష్టం!” అని మళ్లీ నవ్వుకున్నాడు.
అప్పటినుండి ఎవ్వరూ రాముకి రీల్స్ షేర్ చేయడం లేదు రాము మాత్రం సంతోషంగా తన పని తను చూసుకుంటూనే నిమగ్నం అయిపోయాడు.

మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *