ఫూల్ A Fool 4

ఫూల్

ఫూల్
ఫూల్

అందరూ అందర్నీ పూల్ చేయాలి అని చాలా సార్లు అనుకుంటారు అయితే అలా ఫూల్ చేయడం వల్ల అవతలివారు కూడా సంతోషంగా ఫీల్ అవ్వాలి కానీ వారి జీవితమే ఫూల్ అవ్వకూడదు మరి ఫుల్ అయినా అజయ్ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు దాని పర్యవసానంగా ఎలా మారింది.

అజయ్ అరేయి అజెయ్ ఇలా రారా అంటూ పిలిచాడు దేవేంద్ర ఏంటి సార్ అంటూ వచ్చాడు అజయ్ ఇదిగో నీకు సార్ ఈ ఫైల్ ఇమ్మనారు అంటూ ఒక ఫైల్ ఇచ్చాడు కార్తీక్ ఎంధి సార్ ఇది అడ చాలా ముఖ్యమైన ఫైల్ రా దాన్ని చాలా జాగ్రత్తగా దాచు అన్నాడు అజయ్ అది పోయిందనుకో మల్ల సార్ నన్ను తిడతాడు అంటూ దిల్ ఇచ్చేసి తను వెళ్ళిపోయాడు.

ఇక అజయ్ కూడా ఆ ఫైల్ తీసుకుని వెళ్లి చాలా జాగ్రత్తగా డ్రాయర్ లో పెట్టీ తన ఇంటికి కూడా వెళ్ళిపోయాడు తెల్లారి ఆదివారం ఆ తెల్లారి ఏదో పండగ ఉండడం తో ఆఫీస్ కు ఎవరూ రారు ఇక తాళాలు కూడా జాగ్రత్తగా తన దగ్గరే పెట్టుకున్నాడుఅజయ్…

అదే ప్రైవేట్ కంపెనీ లో అజయ్ ఈ మధ్యనే క్లర్క్ గా జాయిన్ అయ్యాడు కార్తీక్ పని చేయబట్టి చాలా రోజులు అయ్యింది మంచిగా పని చేస్తాడు ఖచ్చితంగా ఉంటాడు అని అందరూ తనని గౌరవిస్తారు అయితే పెద్దవారిలో పెద్దగా చిన్నవారితో పిల్లల్లో పిల్లలాగా కలిసిపోతాడు.

అయితే అతను అలా అందరితో కలిసి పోతుండటంతో వల్ల అతను అంటే అందరికీ చాలాఇష్టం,అయితే ఒక వ్యక్తి నీ ఇష్టపడాలి అంటే అతన్ని అర్ధం చేసుకోవాలి, అతనితి సహజీవనం చేయాలి ఎన్నో రోజుల పరిచయం అయినా ఒక్కోసారి అర్ధం చేసుకోలేము, కొన్ని సమయాల్లో మాత్రం ఒక్క రోజుల్లోనే అర్ధం చేసుకుంటారు.

మంగళవారం పదకొండు గంటల సమయంలో కార్తీక్ అజయ్, అజయ్ అంటూ పిలిచాడు ఏంటి సార్ అంటూ వచ్చాడుఅజయ్ మొన్న నీకొక ఫైల్ ఇచ్చాను కదా ఆ ఫైల్ ఎక్కడ పెట్టావు అంటూ వెళ్లి తీసుకుని రా అనగానే అలాగే సార్ అంటూ వెళ్లి డ్రాయర్ తెరిచాడు అజయ్, కానీ అందులో ఫైల్ లేదు. అజయ్ కంగారుగా అంత వెతుకుతూ ఉనాడు, గంట అయ్యింది, వెతుకుతూనే ఉన్నాడు అయితే కార్తీక్ వచ్చి ఏంటి అజయ్ ఏమైయ్యింది ఫైల్ దొరికిందా సార్ అడుగుతున్నారు అంటూ దగ్గరగా వచ్చాడు.

అప్పటికే పాలిపోయిన మొహం తో బిత్తరపోయి ఇక ఏడవడమే తక్కువ అన్నట్టుగా మొహం తో ఉన్న అజయ్ లేదు సార్ కనిపించడం లేదు అనగానే ఏంటి కనిపించడం లేదా అంటూ గట్టిగ అరిచాడు. సార్ మెల్లిగా సార్ అందరూ మనల్నే చూస్తున్నారు ప్లీజ్ సార్ అలా అరవకండి సార్ నేను వెతుకుతాను అన్నాడు.

ఏంటి నువ్వు వెతికేది ఎంత సేపు వెతికినా పోయిన ఫైల్ వస్తుందా అమ్మో ఇంత నిర్లక్ష్యం గా ఉంటావు అని నేను అనుకోలేదు అయ్యో అనవసరంగా నీకు ఇచ్చాను ఇప్పుడు సారు కు నేనేం చెప్పుకోవాలి, అని కార్తీక్ అనగానే ఏమయ్యింది అంటూ ఆఫీసులో ఉన్న అందరూ బిలబిల మంటూ వచ్చారు వాళ్ళను చూసి కార్తీక్ వాళ్ళతో చూడండి.

ఫైల్ ఇస్తే ఎక్కడో పారేసాడు అన్నాడు అయ్యో అవునా అది అంత ముఖ్యమైన ఫైల సార్ అంటూ అందరూ అడిగారు అవును అంటూ కార్తీక్ అనడం తో అజయ్ సార్ ఫైల్ నేను ఇక్కడే పెట్టాను సారు ఎవరు తీసారో ఏంటో నాకు అర్ధం కావడం లేదు ఇందులో నా తప్పేo లేదు సార్ అంటూ కన్నీళ్ళతో కార్తీక్ ను వేడుకున్నాడు.

ఏంటయ్యా కార్తీక్ గారు ఎంత మంచి వారు అతన్నే నువ్వు అనుమానిస్తావా అయినా నువ్వు జాగ్రత్తగా ఉండక్కర్లేదా నీకు అసలు తెలివి లేదా ఉద్యోగం లో ఉండాలని లేదా ఏమిటి కార్తీక్ గారిని అంటావా?అంటూ తలా ఒక మాట అనేసరికి అందర్నీ చూస్తూ ఇన్ని మాటలు ఎప్పుడు పడనీ కార్తీక్ ఏడుస్తూ సార్ నన్ను క్షమించండి సార్ నేనేం తీయలేదు ఇక్కడే పెట్టాను సార్ అంటూ..

కార్తీక్ కాళ్ళ మీద పడిపోతున్న సమయం లో ఏయి కార్తీక్ ఏంట్రా ఇది లే లే ఇది జెస్ట్ ఏప్రెల్ ఫూల్ రా అంతే నిన్ను ఫూల్ చేయాలనీ నేనే ఆ ఫైల్ తీసి దాచాను అంటూ దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు కార్తీక్ ఆ మాట వినగానే కార్తీక్ కు చాలా తేలికగా అనిపించింది మనసు అంతవరకు ఉన్న ఆందోళన కాస్త తగ్గింది.

ఫూల్

ఫూల్

అయితే…..

ఓహ్ కార్తీక్ సార్ అజయ్ ని ఫూల్ నీ చేసారా అంతేనా పాపం అజయ్ ఎంతగా ఏడ్చాడు పిరికోడు ఆడంగి వాడిలా సార్ ను పట్టుకుని ఏడ్చాడు పిచ్చోడు అని తల ఒక మాట అనుకుంటూ నవ్వుకుంటూ ఎవరి సీట్లకు వాళ్ళు వెళ్ళిపోయారు, కార్తీక్ అజయ్ నీ రేయి అజయ్ ఇదంతా కామన్ ఒకే నా డోంట్ వర్రీ అని అంటూ తన సీట్లోకి వెళ్ళిపోయాడు.

కానీ అజేయ మనసు మాత్రం కుత కుత ఉడికి పోతుంది కార్తీక్ తనను ఎంత ఎదవను చేశాడు అని , మనసులో బాధ పడుతున్నా లోలోపల మాత్రం చాలా ఫీలవుతున్నాడు అజయ్. బయట కు మాత్రం అందరి ముందు నవ్వుతూనే తిరుగుతూ ఉన్నాడు.

ఆ రోజు సాయంత్రం బస్ స్టాండ్ కి వెళ్ళిన కార్తీక్ కు వాళ్ళ క్యాషియర్ అతను దగ్గరగా వస్తూ సానుభూతి గా అజయ్ నిజంగా కార్తిక్ మంచి వాడే కానీ అన్నిట్లో తన మార్క్ వేయాలని చూస్తూ ఉంటాడు అతనేం చేసినా సరదాగానే ఉంటాడు అతను చాలా గొప్పవాడు అందరితో కలిసి మెలిసి పోతాడు.

ఎవరైనా ఒక్కసారి కార్తీక్ తో మాట్లాడితే చాలు ఇక ఎప్పటికీ అతన్ని మర్చిపోరు అంటూ అగ్ని కి ఆజ్యం పోసినట్టుగా మాట్లాడడం చూసి అజయ్ వేరే ఏదో బస్ ఎక్కి వెళ్ళాడు అయ్యో అది నీ బస్ కాదు కదా అని క్యాషియర్ అంటున్నా వినకుండా బస్ ఎక్కి వెళ్ళిపోయాడు.

అజయ్ అతను చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నాడు అందరి ముందు కార్తీక్ తనను అవమానించాడు అనే కోపం మనసును కాల్చి వేస్తుంది. అతను తనను అందరి ముందు అవమానించాడు.

కాబట్టి అతన్ని ఏదో చేయాలి అవును ఏదో చేయాలి అప్పుడైతే నే నా మనసుకు శాంతి అవును ఎం చేయాలి అని ఆలోచిస్తూనే తెల్లార్లు గడిపిన అజయ్ కి ప్రొద్దున్నే తండ్రి తన సామను కడుగుతూ ఉండగా చటుక్కున ఒక ఆలోచన రావడం తో గబగబా రెడీ అయ్యి తల్లితో చెప్పి స్పెషల్ గా గట్క చేయించి అందు లో ఏదో ముఖ్యమైనది వేసి దాన్ని తీసుకుని బయలుదేరి కార్తీక్ రూమ్ కు వెళ్ళాడుఅజయ్..

ఏ అజయ్ ఎంటి ఇలా వచ్చావు అదేంటి బాక్స్ లో నా కోసమే నా రారా నీకు నా రూం ఎలా తెలుసు అన్నాడు కార్తీక్ సార్ మా అమ్మ గట్కా మంచిగా చేస్తది సార్ తినండి చాలా బాగుంటది తినండి మీకే బాక్స్ తెచ్చాను అన్నాడు బాక్స్ తీసుకుని పట్టుకుంటూ అయితే ఇచ్చేయి అన్నాడు టిఫిన్ బాక్స్ లాక్కుంటూ ఆ వద్దు సార్ గ్లాస్ లో పోస్తాను తాగండి గ్లాస్ పట్టండి అన్నాడు అజయ్.

సరే గ్లాస్ లో తాగితే బాగుంటుందా అయినా అమ్మ చేసింది ఏదైనా బాగానే ఉంటుంది లే అంటూ కార్తీక్ గ్లాస్ పట్టుకున్నాడు అజయ్ అందులో పోశాడు ఇందులోకి మామిడి కాయ పచ్చ ఉంటే బాగుండేది.

ఫూల్

ఫూల్

అయినా అమ్మ చేతి తో విషం ఇచ్చినా బాగుంటుంది కదా అంటూ గ్లాస్ తాగేసి , కడిగి పక్కకు తిరిగే సరికి ఏదో తేడా గా అనిపించి గొంతు, కడుపు లో మంటగా అనిపించి ఏంటి కార్తీక్ ఎదో తేడా గా ఉందని అనుకుంటూ అనుమానంగాకార్తీక్ అజయ్ వైపు చూస్తూ ఏం కలిపావు రా అని గొంతు పట్టుకున్నాడు కార్తీక్.

ఏంట్రా నువ్వు పెద్ద హీరో వా, నువ్వు పూల్ చేస్తే పూల్ కావాలా, నీ ముందు అందరూ ఎదవలు గా ఉండాలా, నీకే తెలివితేటలు ఉంటాయి అనుకుంటావా నీ యాబ్బా నలుగురి ముందు నన్ను అవమానించి నవ్వుతావా, నన్ను హేళన చేస్తావా ఇప్పుడు చెయ్యి రా పూల్ ను ఇప్పుడు నవ్వు,ఇప్పుడు నువ్వు కాదు నేను నవ్వుతూ ఉంటాను.

నేను ఎంజాయ్ చేస్తాను ఒకే హా హా హా అంటున్న అజయ్ తో కార్తీక్ అదంతా కేవలం జోక్ చేసాం కదా నువ్వు కూడా ఏం ఫీల్ అవ్వలేదు గా నిజంగా కావాలని చేయలేదు ఊరికే జెస్ట్ జోక్ అని మర్చిపో అని చెప్పాను కదా రా నువ్వు కూడా లైట్ తీసుకున్నావు కదా అనగానే..

ఎవడ్రా తీసుకున్నది లైట్ అది నీకు జోక్ కావచ్చు కానీ నాకు మాత్రం రక్తం మరిగిపోతోంది నీ ముందు నేను చిన్న ఉద్యోగిని కావచ్చు కానీ నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది  నేనూ మనిషినే నాకు ఒక మనసు నా పవర్ అన్ని ఉంటాయి నా మనోభావాల పైన దెబ్బ వేసి నన్ను చీప్ గా చూసావు నన్ను ఆడుకున్నావు చూడు ఎవడు కావాలని పూల్ అవ్వాలనుకొడు ఇప్పటికైనా నువ్వు కరెక్ట్ కాదని తెలుసుకో అంటూ ఫోన్ తీసాడు.

అవును నాదితప్పే అజయ్ నువ్విలా సీరియస్ గా తీసుకుంటావు అనుకోలేదు నేను జోక్ చేశాను అంతే ప్లీజ్ నన్ను కాపాడు ఇంకెప్పుడు నీ జోలికి రాను దయచేసి నన్ను కాపాడు ఈ విషయం కూడా నేను ఎవరికీ చెప్పాను దయచేసి కాపాడు అంటున్నా కార్తీక్ ను చూస్తూ ఫోన్ నంబర్స్ కలిపి అంబులెన్స్ కు ఫోన్ చేసాడు అడ్రస్ చెప్పాడు.

తర్వాత కార్తీక్ దగ్గరకు వచ్చి నేను కొత్తగా ఇప్పుడే లోకాన్ని చూడడానికి బయటకు వచ్చాను ఇంకా చాలా జీవితం చూడాలి కానీ ఎవరి మనోభావాలతో ఇంకొక సారి అడుకోకు అనగానే సరే అంటూ తలూపాడు కార్తీక్.ఇంతలో అంబులెన్స్ రావడం వల్ల అతన్ని అందులో ఎక్కించాడు అజయ్ ..

హాస్పిటల్ లోకి వచ్చిన ఆఫీస్ వాళ్ళతో ఏమైంది నీకెలా తెలిసింది అనగానే ఏదో పురుగుల మందు తాగాడు నేను మా అమ్మ చేసిన గటక ఇద్దామని పోయాను కానీ అప్పటికే పడిపోయి ఉండడం చూసి అంబులెన్స్ కు మీకు ఫోన్ చేశాను అన్నాడు. అంతా పిరికోడా కార్తీక్ సారు ఆడదానిలగా ఆత్మహత్య చేసుకునుడు ఎంది అంటూ నలుగురు మాట్లాడే మాటలు వింటున్న కార్తీక్, అజయ్ కళ్ళ లో నీళ్ళు తిరిగాయి..

ఇద్దరికీ నిజంగా నేను కార్తిక్ ను చంపి ఉంటే నా జీవితం నాశనం అయ్యేది, నా వాళ్ళు నాపై పెట్టుకున్న ఆశలన్ని నిరాశ లు అయ్యేవి.

చివరిలో నేను కలిపిన పురుగుల మందు మొత్తం పోయకుండా కొంచం వేయడమే నయం అయ్యింది అనుకుంటూ అజయ్, అతని చేతిలో చనిపోతే నా వాళ్లకు దిక్కు లేకుండా అయ్యేది అనుకుంటూ కార్తీక్ఇద్దరూఇలాఆలోచనలోమునిగిపోయారు..

ఇందులో ఇద్దరి తప్పు ఉంది కదా కానీ ఇందులో ఒక నీతిని చెప్పాలని అనుకున్నాను అదేంటి అంటే  ఎవరు ఏమన్నా ఎంత ఎగతాళి చేసినా మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి అన్ని విషయాలను పాజిటివ్ గా తీసుకోవాలని ఏ విషయాన్ని మనసు పైకి తెచ్చుకోకూడదు అని చెప్పలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం ఆచరిస్తారు కదు ..

Related Posts

1 Comment

  1. ఈ రోజుల్లో విమర్శలు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలేమో అనే విధంగా ఉంది కధనం.
    కధ బాగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *