అక్షర కొరకు
అంశం – బంధం విలువ
రచన – ఉమాదేవి ఎర్రం
శీర్షిక – బంధాలు – అనుబంధాలు
ఈ జీవితంలో ఉండేవే
బంధాలు, అనుబంధాలు
అవి బంధుత్వంలో కావచ్చు
స్నేహితులలో కూడా కావచ్చు!
రక్త సంబంధాలైతే మరీను
అమ్మా,నాన్న,అమ్మమ్మ,నానమ్మ
తాతలు, అత్తలూ,పెదనాన్న,బాబాయిలు
అక్కా,చెల్లీ, అన్నా,తమ్ముడు అందరూ!
ఆత్మీయత అనురాగాలు ఉన్నంత
వరకూ బాగుంటాయి ఈ బంధాలు
డబ్బుతో ముడిపెట్టి స్వార్థం మెులకెత్తిందో
అవి చచ్చుబడి పోతాయి!
ఏ బంధాలు వద్దు బాబు అని
వాటికి దూరంగా పారిపోతాం!
కానీ ప్రేమానురాగాలు పంచుతుంటే
వాటికి బంధీలమైపోతాం!
బంధాల విలువలు తెలియకుండా
బాధ్యతలు ,బరువులు మెాయకుండా
మాయమై పోతున్నాయి సత్సంబంధాలు
కాపాడుకుందాం! ప్రేమా మాధుర్యాలను!
ఇది నా స్వీయ రచన..