బట్ట తల Cloth headed Person 1

బట్ట తల

బట్ట తల
బట్ట తల

మన కామేషానికి వయసు ముదిరిపోతున్నా పెళ్లి కావడం లేదండి. మరి ఎందుకు అని అంటే హార్మోన్ల లోపంతో జుట్టు ఊడిపోతుంది. అసలే పిట్ట బొచ్చు అంత ఉన్న జుట్టు కూడా రోజురోజుకు ఊడి పోతూ ఉండడంతో పెళ్లి చేసుకోవాలనే కోరిక బలంగా నాటుకుపోయింది కామేష్ మనసులో…

దాంతో ఎక్కడ ఏ నలుగురు కనిపించిన నాకు పిల్లలు చూడరా, నాకు పిల్లలు చూడరా, అని అంటూ అందరి నోట్లో నాన సాగాడు కామేశం. అలా నానడం, నానడం తన తండ్రి దినకర్ వరకు వెళ్ళింది. దాంతో కొడుకుకి పెళ్లి పిచ్చి ముదిరిపోతుందని భావించి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ లో డబ్బు కట్టి కొడుకు ఫోటో ఇచ్చాడు.

కానీ మన మ్యాట్రిమోనీ వాళ్ళు ఫోటో ని పక్కన పెట్టి డబ్బుని డబ్బాలో వేసుకున్నారు. ఆ విషయాన్ని అంటే మ్యాట్రిమోనీలో డబ్బులు కట్టిన విషయాన్ని చెప్పి కొడుకును సంతోషపరిచాడు తండ్రి. ఇక తన పెళ్లి కావడం ఖాయమని అనుకున్న కామేశం అందంగా కనపడాలని హీరోలాగా జుట్టు పెంచాలని ఆశపడి ఆన్లైన్ అంతటా వెతికి వెతికి డాక్టర్లు, స్నేహితులు చెప్పిన రకరకాల నూనెలు, షాంపూలు, కండిషనర్లు, తన తలకు అప్లై చేశాడు.

అసలే పిట్ట బొచ్చు ఆపై నూనెలు, షాంపూలు విపరీతంగా వాడటం వల్ల వారం రోజులకే పిట్ట బొచ్చు ఉన్నది కాస్తా ఒక శుభదినాన నున్నని తెల్లని గుండులా కనిపించింది. కామేశానికి అద్దంలో తనని తాను అలా చూసుకున్నా కామేశం హలో ఎవరో అపరిచితులు తన లోకి వచ్చాడని భావించి కేవ్వున కేక వేసి సృహ తప్పి పడిపోయాడు.

అతని తండ్రి కూడా వచ్చి చూసి ఎవడ్రా ఈ కొత్త వ్యక్తి అని పరకాయించి చూసి, తన కొడుకే అని నిర్ధారించి వాడి బోడిగుండుని చూసి తను కూడా కెవ్వుమని అరిచి సృహ తప్పి పడి పోయాడు. ఈ కేకలకు వంటింట్లో పప్పులో పోపేస్తున్న శివంగి అదిరిపడి పోపు గిన్నెను జార విడిచి ఏంటో ఈ అరుపులు అని అనుకుంటూ బెడ్ రూం లోకి వచ్చి చూసి గట్టిగా నిట్టూర్చిoది.

ఆమె నిట్టూర్పుకు బెడ్ మీద ఉన్న పరుపు అంతెత్తున ఎగరడం, కొడుకు, తండ్రి కూడా ఒక సారి కదిలి మళ్ళీ ఇక కదిలే ఓపిక లేక అలాగే ఉండిపోయారు. ఆమె నిదానంగా గజగామినిలా అడుగులో అడుగు వేస్తూ నడిచి వెళ్లి పక్కనే ఉన్న జగ్గులోని నీళ్లను తెచ్చి ఆ బక్క ప్రాణులకు స్నానం చేయించడంతో వాళ్ళు తెలివిలోకి వచ్చి శివంగిని చిత్రంగా చూసిన దినకర్ చూసావా శివ అనుకున్నంత అయ్యింది.

విడేవన్నో ఇక్కడ తగిలించేసి, వాడు ఇల్లొదిలి వెళ్ళాడే పెళ్లి చేయడం లేదని అంటూ గోల్లుమన్న భర్తను చూస్తూ (పాత సినిమాల ప్రభావం మన వాడి మీద బాగా ఉంది లెండి, హీరో అలిగి వెళ్లడం, వాడిని వెతుకుతూ తల్లిదండ్రులు వెళ్లడం లాంటి ఆలోచనలు మన దినకర్ కు కోకొల్లలుగా రావడం సహజం) భర్త మాటలు, కొడుకు పిచ్చి చేష్టలు చూసి విషయం అర్థం అయ్యిన శివంగి వారి ఇద్దరి వీపుల మీద చెరో చారుపు చరిచింది.

తన రెండు చేతులతోనూ, ఆ చారుపుకు తాత, ముత్తాతలు కూడా ముందుకు వచ్చి కనిపించారు దినకర్ కి, కామేషానికి. అయితే ప్రపంచంలోని ఏడు రంగులతో పాటుగా ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగులు కళ్ళ ముందు కనిపించి, ముందుకు జర్క్ లాంటిది ఇచ్చి అయోమయంగా తల్లి వైపు చూసాడు.

ఇంకా నయం ఆవిడ ఆకారం రాలేదు తనకు అనుకుంటూ (మనసులో) బయటకు అనే దమ్ము అతనికి లేదు మరి పచ్చడి చేస్తుందని, ఇంకో చరుపు చరుస్తుంది అనే భయం వల్ల, ఏమి అనలేక పిచ్చి చూపులు చూస్తూన్న ఇద్దరితో ఆపండి మీ పిచ్చి వేషాలు ఇప్పుడేమయ్యిందని అంతగా సృహ తప్పి పడిపోయారు, అవతల బంగారం లాంటి పోపు నేలపాలు అయ్యింది, వెళ్ళండి వెళ్లి దాన్ని శుభ్రం చేయండి అంటూ భర్తని తరిమి, కొడుకు దగ్గరగా వచ్చింది తల్లి

ఇంకో చరుపు చరవడానికి వస్తుందని భయపడిన కామేశం పక్కకు ఒక్క గెంతు గెంటాడు తల్లికి అందకుండా, ఒరేయి నాన్న ఏం అననులే కానీ నువ్వు ఆ బోడి గుండుతో ఎంత అందంగా ఉన్నావో, హాయిగా ఏ ఇబ్బంది లేకుండా అబ్బా ఎంత బాగుందో నీకా గుండు నున్నగా అంది తల్లి.

అమ్మ నాకు గుండుంటే నీకు కోడలు ఎలా వస్తుందే అన్నాడు గారంగా కామేశం. అవును రోయి ఆ మాటే మర్చిపోయాను, ఖర్చు తగ్తుంగింది అని అనుకున్నా కానీ ఇలా మొదటికే మోసం వస్తుందని అనుకోలేదు. అయితే ఒక పని చేద్దాం అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. ఆ ఊపుకు సోఫా తో పాటుగా కామేశం కూడా ఒక అంగుళం ఎగిరి మళ్ళీ సర్దుకుని కూర్చుని ఏంటమ్మా అది అని అడిగాడు ఆమె కాళ్ళ దగ్గర కూర్చుంటూ…

అమ్మా ఏదోటి చేసి నా గుండు మీద కొంచం బొచ్చును అయినా తెప్పించు అని అంటూ తల్లి కాళ్ళని నొక్కసాగాడు. అది ఆవిడకు చీమ కుట్టినట్టు కూడా అనిపించక పోవడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు, తిరిగి తల్లి ఏముంది నాలుగు రోజులు ఆ గుండు మీద మూడు పూటలా ఆముదంతో మర్దనా చేస్తే సరి, ఆఫీసుకు లీవ్ పెట్టి నేను చెప్పింది విను ఆ వెధవ షాంపూలు, నూనెలను వాడడం వల్లె ఇలా అయ్యింది.

మీ నాన్నగారి మాట విని చేడి పోయావు కాని, నేను చెప్పినట్లు వింటే ఎంత జుట్టు ఉండేదో అని కామేశం గుండుని నిమిరి, ఈ గుండుని ఏ పిల్ల మెచ్చుతుందేమిటి అంటూ ఎక్కడికి వెళ్లకు ఇంట్లోనే తగలడు అని ఆర్డర్ వేసి, రేపటి నుండి నా తడాఖా ఎంతో చూపిస్తాను అంటూ లోపలికి వెళ్ళిందావిడ. సోఫా మళ్ళీ ఒక సారి ములిగింది మూగగా…

బట్ట తల

బట్ట తల
బట్ట తల

తల్లి అలా ధైర్యం చెప్పడంతో అప్పుడే జుట్టు వచ్చినంత సంబర పడ్డాడు కామేశం. మర్నాడు మొదలైంది ఆయుద్ద పూజ. గుండుకు పొద్దున్నే అయిదు గంటలకు కమేషాన్ని లేపి వరండాలో కూర్చో బెట్టి, గిన్నెడు ఆముదాన్ని నున్నని గుండు పై పోసి, అలా అలా అరరాగా అంటించింది. దానితో మన కామేషానికి బుడిపేలు వచ్చాయి అది వేరే విషయం.

అలా అంటిన తర్వాత రెండు గంటలు అరనిచ్చి, మందార ఆకులు, పువ్వులు, కలబందతో నూరిన మిశ్రమాన్ని తలకి పట్టిస్తు ఇక ఇంటి వైద్యం అంతా చేసింది. పాపం తల్లి కదా ఏ పుట్టలో ఏ పాముందో అని అన్ని చిట్కాలు పాటించింది వారం రోజులు. అ వారంలొనే గుండు మీద చిన్న చిన్నగా మొలకలు రావడం మొదలైంది. తన గుండును అద్దం లో చూసుకుంటూ దాన్ని నిమురుతున్న కామేషానికి మెల్లిగా వస్తున్న జుట్టు కనిపించి యురేఖా అని సంతోషం పట్టలేక గట్టిగా అరిచాడు.

అ అరుపు కు సోఫాలో పడుకున్న దినకర్ బాత్రూంలో స్నానం చేస్తున్న శివంగి ఇద్దరూ ధబెల్ మంటూ కింద పడ్డారు. ఆర్భక ప్రాణి దినకర్ పక్క బొక్కలు అన్ని పరం పరం అయితే, శివంగి దెబ్బకు బాత్రూంలో ఉన్న టైల్స్ మొత్తం రెండు ముక్కలు అయ్యాయి. అదేమి గమనించని కామేశం పార్టీ చేసుకోవడానికి పబ్బుకు వెళ్తే, దినకర్ బొక్కల డాక్టర్ వద్దకు పరుగు తీసాడు మన దినకర్,ఇక అలా వెంట్రుకలు రావడం తో ఆనంద పడిన కామేశం తల్లి చెప్పిన సూచనలు పాటిస్తూ మూడు నెలల్లో బోడి గుండు మీద బొచ్చును మొలిపించిన మాతృ మూర్తిని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలని అనుకున్నా కామేషానికి అలాంటి వాటిని గిన్నిస్ బుక్ లో ఎక్కించారేమోరా అన్న మిత్రుని మాటలు నిజమేనేమో అనిపించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు..

జుట్టు మొలిచిందని ఇక సంబంధాలు చూడొచ్చు అని అనుకుంటున్న తండ్రి అన్ని మ్యాట్రి మోనీల్లోనూ కామేష్ కొత్తగా దిగిన ఫోటోలు  ఇచ్చేసరికి మ్యాట్రి మోని వాళ్ళు ఆనందపడి దాన్ని అమ్మాయిల తల్లిదండ్రులకు పంపించారు.ఇక తనకు పెళ్లి కుదిరినట్టే అని భావించి కలలు కంటున్న కామేషాన్ని తన స్నేహితులు పార్టీ ఇవ్వమని అడిగారు.

ఎన్నడూ ఎదడగని స్నేహితులు అలా అడిగేసరికి జుట్టు వచ్చిందన్న సంతోషంలో అందరిని పబ్బు కు తీసుకుని వెళ్లిన కామేశం,తాగడానికి బీర్లకు ఆర్డర్ ఇచ్చాడు,మిగతా వారికి ఏది కావాలంటే అది తాగండి బిల్లు నాది అని చెప్పడంతో,అందరూ రెచ్చిపోయి తమకు కావాల్సినవి తెచ్చుకుని లెట్స్ స్టార్ట్ పార్టీ ఎంజాయ్ అంటూ అక్కడున్న పాప్ మ్యూజిక్ తో పాటుగా గొంతులు చించుకొని అరుస్తూ గెంతుతూ ఒకరి నడుం  ఒకరికి  తాకించుకుంటు వెర్రి తలల వికృత చేష్టలు చేస్తూ బాటిల్ మూతలు నోటితో పీకేసి,

ఆ రోజు వారికి సురాపానం చేయిస్తున్న కామేషానికి సర్ప్రైజ్ అంటూ సీసాలో ని ద్రవాన్ని అంతా తమ ఇష్టమైన రీతిలో తల మీద గుమ్మరించారు. పిచ్చి కామేశం మాత్రం తనకు జుట్టు పెరిగిందని పాపం స్నేహితులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అనుకున్నాడు.కానీ అదే అతని కొంప ముంచుతుంది అని అనుకోలేకపోయాడు.

అలా కామేశం  నెత్తి మీద బీర్లు,రమ్ము,విస్కీల వర్షం కురిసిన తర్వాత తాగి తాగి గెంతిన ఊగి అందరూ పాకుంటూ కార్ల వరకు వెళ్లి,దేక్కుంటు బెడ్ పైకి చేరారు,పబ్బు డ్రైవర్ల సహాయం తో,

తెట్టన తెల్లారింది.అందరిల్లాలోను తిట్ల పురాణం మొదలైంది.ఇక మన కామేశం బద్ధకంగా కదులుతూ పైనున్న దుప్పటిని తొలగించి,లేచి కూర్చుని ,కళ్ళు నులుము కుని చుట్టూ చూసి తానున్నది తన ఇల్లే అని కన్ఫర్మ్ చేసుకుని అలవాటుగా చెయ్యిని తలా పైన పెట్టుకున్నాడు.జుట్టు సరి చేసుకుందాం అని చేయి పెట్టి ఒక్కసారి దువ్వుకుని చెయ్యి  తీయగానే చేతికి ఎదో వచ్చింది అదేంటో చూసిన కామేశం తన తల విదిల్చి,లేచి అద్దం ముందుకు వచ్చి చూసుకున్నాడు.

అంతే కెవ్వు కెవ్వు మంటూ అరుస్తూనే ఉన్నాడు. అద్దం లో తన నున్నని గుండు చూసుకున్న కామేశం అరవడం లో తప్పేం లేదుగా మరి.పాపం తల్లి ఎన్నో గృహ చిట్కాలు వాడి మూడు నీళ్లు వాడి పెంచిన బంగారం లాంటి జుట్టు మొత్తం ఎలా పోయిందో ఇప్పటికి అర్థం కాకా పిచ్చెక్కి ఇక జుట్టు రాదని పర్మినెంట్ విగ్గును కొనుక్కున్నాడు మన కామేశం.

మనలో మాన మాట ఇంతకీ జుట్టు ఎలా ఊడిoదో అనే సందేహం మీకు కూడా వచ్చింది కదా సరే చెప్తా వినండి మాములుగా బీర్లు షాంపులు వాడతాం అది కాస్త ఘూఢతను కలిగి ఉంటాయి.అది జుట్టుకు మంచి పోషణకు ఇస్తుంది కదా అది మీకు తెలుసు,మరి రాత్రి జరిగిన పార్టీ లో ఏం జరిగిందో ఒక లుక్కేయండి అధిగది చూసారా ,,

మన కామేశం స్నేహితుల వెధవ పనికి అంటే రమ్ము విస్కీ బీరు పొసే సరికి అలా ఊడిందన్న మాట, ఎంటేంటి అయ్యి పోస్తేనే జుట్టు ఉడడం అబద్ధం  అంటారారా అయ్యా బాబోయ్ అవి మంచివి అయితే నేను అలాగే అనేదాని కానీ అది నకిలీ సరుకండి బాబు ,నన్ను నమ్మండి,లేదంటే మీరో పాలి ఏల్లి మీ జుట్టు మినా పోసేసుకుని టెస్టింగులు చేసేసుకుని నాకు సెప్పండి మరి ఉంటేనేం ..

మల్లో పాళీ మంచి నాటు సరుకు అదే కథతో  వస్తానేం …

Related Posts