బత్తాయి పండు ప్రేమ

అక్షర కొరకు
అంశం :⁠- చిత్ర కవిత
తేది:⁠- 04/11/2026
శీర్షిక:⁠- బత్తాయి పండు ప్రేమ

                          అనగనగా ఒక ఊరిలో నిమ్మకాయ తోట ఉంది. ఆ తోటలోని కొన్ని బత్తాయి చెట్లు ఉన్నాయి. 

అందంగా ఎర్రగా పండిన నిమ్మకాయలు ఆ తోట యజమాని తీసి మార్కెట్ కి పంపిస్తూ ఉంటాడు. చిరునవ్వుతో… చాలా అందంగా ఉంది ఒక నిమ్మకాయ. ఆ నిమ్మకాయని చూసి మనసు పారేసుకుంది బత్తాయి పండు.
దూరం నుంచి చూస్తూ కొన్ని రోజులు మురిసిపోయింది బత్తాయి పండు. పక్కనే ఉన్న బత్తాయి పండు స్నేహితులు ,
“ఎన్ని రోజులు ఇలా చూసి మురిసిపోతావురా? ఏదో ఒక రోజు నీ మనసులో మాట చెప్పాలి కదా? లేదంటే… ఏదో ఒక రోజు ఆ నిమ్మకాయ ఈ తోటను విడిచి వెళ్లిపోయే అవకాశం ఉంది?” అని చెప్పారు.
“అవున్రా! కానీ , నాకు భయంగా ఉంది” అని బత్తాయి పండు చెప్పగానే…
“ఇలా భయపడుతూ ఉంటే… ఆ నిమ్మకాయ ఎప్పుడోకప్పుడు ఈ తోటను విడిచి వెళ్ళిపోయే రోజు వస్తుంది?”అని చెప్పారు స్నేహితులు.
ఇలా రెండు రోజులు గడిచిపోయాయి. ఆ తోట యజమాని వచ్చి ,
“నిమ్మకాయలన్నీ కోసేయండి. సాయంత్రం కల్లా మార్కెట్ కి పంపించేద్దాం” అని వినగానే… బత్తాయి పండు భయపడిపోయింది వెంటనే నిమ్మకాయతో… మాట్లాడాలని ఆలోచిస్తూ ఉన్నాడు.
బత్తాయి పండు ప్రేమించిన నిమ్మకాయని తెంపబోతుండగా…
యజమాని ఆపి ,
“భోంచేసి రండి..!” అని చెప్పారు.
“హమ్మయ్య బ్రతికిపోయావ్! వాళ్ళు రాకముందే నీ ప్రేమ విషయం చెప్పు” అని స్నేహితుడు అనగానే…
వెంటనే నిమ్మకాయ దగ్గరికి వెళ్ళింది బత్తాయి పండు. అప్పుడే అందంగా నవ్వుతూ కనిపించగానే… తనని చూస్తూ ఉండిపోయింది బత్తాయి పండు.
“ఏంటి! నువ్వు ఇక్కడికి వచ్చావు?” అని అడిగింది నిమ్మకాయ.
“నీకు… నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను”అని బత్తాయి పండు అంది.
సరే త్వరగా చెప్పు లేదంటే నేను మార్కెట్ కి వెళ్ళిపోతాను అని నిమ్మకాయ అనగానే…
“నిన్ను నెల రోజుల నుంచి చూస్తూ ప్రేమిస్తూ ఉన్నాను. నా ప్రేమను ఒప్పుకోవా” అని ఆరాధనగా చెప్పాడు బత్తాయి పండు.
“ఓ… నీకు అసలు విషయం తెలీదు కదూ! నన్ను ప్రేమించిన వాడు మార్కెట్లో ఉంటాడు. తనని కలవడానికి నేను ఇంత ఉత్సాహంగా ఆనందంగా ఉన్నాను” అని చెప్పగానే…
బత్తాయి పండు గుండె పగిలిపోయి కిందపడి గిలగిలా కొట్టేస్తుంది. అది చూసిన వాళ్ళ స్నేహితులు గలగలలాగా నవ్వుకున్నారు.
నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
ఓ చిట్టి పావురమా
ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు
ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు
ఎవరు కొట్టారు…
అని బత్తాయి పండు స్నేహితులు పాడుతూ ఉంటే… బత్తాయి పండు తన శరీరంలో ఉన్న నీరుని కన్నీరుగా కారుస్తూ ఉన్నాడు.
గంట తర్వాత కూలీ వాళ్ళు వచ్చి నిమ్మకాయలు అన్ని తెంపి మార్కెట్ కి తీసుకొని వెళ్ళిపోయారు.
అక్కడ నిమ్మకాయ నిమ్మకాయ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని హాయిగా సంతోషంగా ఉంది ఇక్కడ మాత్రం బత్తాయి పండు దేవదాసుగా మిగిలిపోయింది.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కథ నా సొంతం అని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *