బలి
కన్నులు తెరవని పసితల్లెం పాపం చేసిందో
ముళ్లకంప లో ఉయ్యాలుగుతుంది
మగాడు చేతికి అందివస్తాడు
వంశాన్ని నిలబెడతాడు
పున్నమ నరకం నుండి తప్పిస్తాడు
నీ పేరు నీ ప్రాఖ్యాతి పొందేలా చేస్తాడు
వంశ పరువు కాపాడతాడు
ఆడపిల్ల అంటే మరియు ఇంటికి పోయేది
కానీ వీడు నీకు నిడవుతాడు, తోడుగా ఉంటాడు
వాడేo పాపం చేసాడు
వాడిని కూడా కమోడ్ లో వేశారు
ఆడ, మగ తేడా లేదు ఎవడైనా ఒకడే
అని అనుకున్నారేమో నిజమే
మగాడికి కూడా ఈరోజుల్లో విలువ లేదు
అటు పరుగేట్టే సమాజం లో బ్రతకలేక
ఇటు పెళ్ళాం చేతిలో చావలేక
తల్లిదండ్రులు అనుకున్న ర్యాంకులు
సాధించలేక, పరాయి వాడితో పోల్చుకోలేక
ఎవర్ని మెప్పించలేక,టార్గెట్ ను చేరుకోలేక
అందరిలో ప్రత్యేకంగా నిలవలేక
అలసి, సొలసి పోరాడి పోరాడి
చివరికి తనువు చాలించే ధైర్యం లేక
వాడిలో వాడే మండిపోతున్న అగ్నిగోళం
అమ్మాయి అయితే ఎవడు ఎప్పుడు
మానభంగాలు చేస్తాడో తెలియక
ఏ వైపు నుండి ఆపద వస్తుందో తేలిక
అలాగని బతుకుని ఆపలేక
జీవితాన్ని సాగదీయలేక
నరకాన్ని భరించలేక పోరాడుతూ
బతుకు బండిలో కొనసాగుతూ
ఏదైనా అనర్ధం జరిగితే…
సూటి పోటీ మాటలు పడలేక అలాగని
సమాజాన్ని ఎదురించలేక ఎందరో మరేందరో
బలి అవుతున్నారు సమానత్వాన్ని ఈ విధంగా
సమాజంలో చూపుతున్నారు….
భవ్యచారు