బస్ ప్రేమ

నేను ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాను రోజు బస్ లో 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న నా  వెళ్ళి రావడానికి పాఠశాల నేను బస్ పాస్ తీసుకుని వెళ్తుండే వాడిని అలా వెళ్ళడం వల్ల నాకు దాదాపు అన్ని ఊర్లు అన్ని బస్ లలోని  కండక్టర్లు  డ్రైవర్లు పరిచయం  అవ్వడం  జరిగింది.

నేను బస్ ఎక్కగానే నాకోసం ఒక సీట్ ని ఉంచేవారు ఎవరైనా అలా ప్రయాణం సాగిస్తూ ఉండగా వేసవి సెలవులు వచ్చాయి. వేసవిలో మాకు కొన్ని పనులు ఉండడం వల్ల నేను మా పల్లెకు వెళ్ళాను కుటుంబం తో సహా. వేసవి సెలవులు అయిపోయి తిరిగి నేను డ్యూటీ లో జాయిన్ అయ్యే  రోజు  వచ్చింది 

డ్యూటీ లో చేరిపోయి కాస్త స్థిమిత పడ్డాక అయ్యో మీకు చెప్పనే లేదు కదా నాకో అలవాటు ఉందoడి అందరూ బస్ ఎక్కగానే  పడుకుంటారు చల్ల గాలికి  కానీ నేను అలా కాదు నేను బస్ లో ఉన్న వారిని పరిశీలించడమే నా పని… 

ఎవరైనా కొత్తగా వింతగా కనిపిస్తే నేను వారి బొమ్మలు వేస్తాను నాలో కూడా ఒక చిత్రకారుడు  ఉన్నాడు లెండి మడిసన్నాక కాసింత కళ  పోసన ఉండాలి అని రావు గారు అన్నట్టు నాకు అభిరుచి ఉంది ..

అలా  నేను  గమనిస్తున్నప్పుడు  నాకoట్లో ఒక అమ్మాయి  పడింది ఆమె చాలా మాములుగా ఉంది కానీ నన్ను ఆకర్షించిన విషయం ఏమిటంటే ఆమె ఛామన ఛాయగా ఉన్న మొహం లో తెల్లని పలువరుస కాకుండా ఆమె నవ్వినప్పుడు ఆమె బుగ్గలో పడుతూ ఆమెకు మరింత  అందాన్ని తెచ్చి పెడుతున్న సొట్ట  కావచ్చు

నేను ఆమెని  చూడడానికి  కారణం నేను అంత మంచి బుగ్గలు  సొట్టలు  పడే అమ్మాయిని  ఇంత వరకు చూడక పోవడం కూడా ఒక కారణం కావచ్చు. చాలా రోజులు అలా గమనించిన తర్వాత నాకు అర్ధం అయ్యింది ఏమిటంటే అమ్మాయిని  నేనే  కాకుండా  ఇంకో వ్యక్తి  కూడా  చూస్తున్నాడు  అని  తెలిసి నేను అతన్ని గమనించాను 

అతను అమ్మాయి కంటే కొంచం పెద్దవాడు  కావచ్చుకానీ అతను అమ్మాయిని చూడడం లో ఎదో కోరిక ఆరాధన కనిపించిoది నాకు ఆమె కూడా  తన్ని  ఓర చూపులు  చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉండేది. 

వారిద్దరూ ప్రేమలో పడ్డారు అని నాకు అర్ధం అయ్యిందిఎందుకంటే మనది అదే బాచ్ కదా అంటే ప్రేమ పెళ్ళే కదా అలాoటి వాళ్ళు ఎలా ఉంటారో నాకు అనుభవం కాబట్టి నేను వెంటనే పోల్చుకోగలిగాను వారు ప్రేమలో ఉన్నారు అని బస్ లో ఉన్నంత సేపు చూపులతోనే మాటలు మాట్లాడుకునే వారు

డ్రెస్ బాగుంది అని జడ బాగుంది అని గాల్లో ముద్దులు పెట్టుకుంటూ ఇలా అన్ని బస్ లోనే చేసేవాళ్ళు వారిని నేను గమనిస్తూ వారి చిలిపి పనులని చూస్తూ నా పాత రోజులని గుర్తు చేసుకునేవాడిని.

అలా రెండేళ్ళు గడిచాయి. రెండేళ్ళ లో వారి ప్రేమని ఆస్వాదిస్తూ వారి మౌన ప్రేమని చూస్తూ సెలవుల్లో వారి విరహాన్ని నేను అనుభవిస్తూ గడిపాను. నాకు వారిని చూస్తుంటే వారు ఎలాగైనా పెళ్లి చేసుకుంటారు అని అనిపించింది

వాళ్ళు అంతగా ప్రేమించుకున్నారు మరి . సారి సెలవులు అయ్యాక నేనే వారిద్దరి తోని మాట్లాడదం అని అనుకున్నా కూడా అలా భారంగా సెలవులు అయ్యేవరకు వేచి చూసి

మళ్ళి డ్యూటీ లో జాయిన్ అయ్యా కానీ పని ఒత్తిడి వల్ల కొన్ని రోజులు వారి విషయాన్నీ పక్కన పెట్టాను. నా పనులన్నీ అయ్యాకతిరిగి బస్ లో ఎక్కికూర్చున్న బస్ కి సమయం ఉండడం వల్ల ఇంకా ఎవరూ ఎక్కలేదు ఇంతలో నేను చూసిన అమ్మాయిఆ అబ్బాయి బస్ ఎక్కుతూ కనిపించారు.

హమ్మయ్య మొత్తానికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు అని అనుకున్నా బస్ బయలు దేరింది కొంచం కునుకు పట్టిన నాకు బస్ కుదుపు తో మెలకువ వచ్చిందిలేచి చుట్టూ చూసాను అది అమ్మాయి ఊరే అమ్మాయి  బస్ దిగుతూనా వైపు చూసింది

 

నేను ఉలిక్కి పడి చూసా నన్నేనా అన్నట్టు ఏంటి ఇంత ఆలస్యం డ్రైవర్ ఏమైనా  నీ బాబా అంటున్న  గొంతుని ఆశ్చర్యంగా కిటికిలో నుండి చూసాను అతను ఆమె ప్రేమించిన అబ్బాయి  కాదు.

నల్లగా బండగా ఉన్న వ్యక్తి ఆమె మీదకి అరుస్తున్నాడు నేను చటుక్కున వెనక్కి తిరిగి చూసా  నా వెనక ఆమె ప్రేమించిన అబ్బాయి కళ్ళు తుడుచుకుంటూ కనిపించాడు నాకు 

నేను గట్టిగా నిట్టూర్చి కొన్ని జీవితాలు ఇంతే అని అనుకున్నా మనసులో…..

Related Posts