బహుమతి

ప్రొద్దున హడావుడిగా ఆఫీస్ కి రెడీ అయ్యి వెళ్తున్న నాకు ఒక ఫోన్ వచ్చింది.ఎదో తెలియని నెంబర్ సరే ఎవరో అని అనుకుని లిఫ్ట్ చేసి హలో అన్నాను .హలో సర్ మేము ఫలానా వెబ్ సైట్ నుండి మాట్లాడుతున్నాము అంటూ ఒక అమ్మయి గొంతు వినిపించింది.

ఆఫీస్ కూ వెళ్ళే తొందరలో ఉన్న నాకు అది ఫేక్ కాల్ అని అర్ధం అయ్యి,నాట్ ఇంటరెస్ట్ అని ఫోన్ కట్ చేయబోయ్యాను, హల్లో సర్ దయ చేసి ఫోన్ ని కట్ చేయవద్దు నా మాటలు వినండి అంది అర్దింపు గా మనకు ముందే మొహమాటం ఎక్కువ,

అందులోనూ ఆడపిల్ల  అలా అర్దింపు గా అడిగే సరికి, ఆఫీస్ పోయినా సరె అని అనుకుని బైకు పక్కగా ఆపేసి, హా ఇప్పుడు చెప్పండి అన్నాను.

సర్ దయచేసి ఇప్పుడు మీకు నేనొక పిక్ పంపిస్తాను,వాటిలో ఉన్న ప్రశ్నలకు సమాధానం రాసి మళ్ళి నాకు పంపండి అందా అమ్మాయి అదే గొంతు తో నేను అలాగే అన్నాను, నన్ను అలాగే లైన్ లో ఉండమని చెప్పి ఆవిడ ఎదో ఫైల్ పంపింది,

అందులో ఉన్నవన్ని నాకు తెలిసినవే కావడం తో వెంట వెంటనే అన్ని ఫిల్ చేశాను, ఆమెకి మళ్ళి అదే ఫైల్ ని సెండ్ చేశాను. ఆమె కొన్ని నిముషాలు అయ్యాక  సర్ మీరు మేము అడిగిన  ప్రశ్నలకు  సమాధానాలు చెప్పి ,లక్ష రూపాయల గిఫ్ట్ ఓచర్ ని గెలుచుకున్నారు అంటూ ఆనందం నిండిన  స్వరం తో చెప్పింది. 

అవునా,నిజామా అన్నాను ఆనందంగా అవును సర్ ,ఇది మేము రహస్యంగా కండక్ట్ చేస్తున్న సర్వే,దీంట్లో పాల్గొన్న వారికీ మా  మాటలు నమ్మి, ఫాం ఫిల్ చేసిన వారికీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది చాలా మంది మాది ఫేక్ కాల్ అని అనుకుని, మాతో సరిగ్గా సహకరించడం లేదు

అదే మాకు చాలా బాధగా ఉంది సర్,అని మీ పేరేంటి సర్ అని అంది,నేను రాహుల్ అని చెప్పను, ఒకే సర్ మీ బ్యాంకు అక్కౌంట్ నెంబర్ చెప్పండి అంది చెప్పాను నేను .అవును కొందరు ఇదంతా ఫేక్ అని అనుకుంటున్నారు అని అన్నాను నేను ఆవిడకు వత్తాసు పలుకుతూ

అలా చెయ్యడం వల్ల సైట్ వాళ్ళు మా టార్గెట్ అయిపోలేదు అని మాకు జీతాలు కూడా ఇవ్వడం లేదు సర్, మేము కూడా బతకాలి కదా,ఎదో కుటుంబం గడవడానికే కదా సర్ మేము జాబ్స్ చేసేది అంటూ తన గోడుని చెప్పుకుంది   అమ్మాయి.అవును నిజమే కదా ఎవరైనా చేసేది  కుటుంబం  కోసమే కదా పాపం అని అనుకున్నా మనసులో, ఆమె గురించి ఆలోచిస్తూ,ఫోన్ కట్ అయిన విషయన్ని కూడా గమనించలేదు నేను..

ఇంతలో ఫోన్ మోగింది మా ఆఫీసు ఫ్రెండ్ అనంతు ఫోన్ చేస్తున్నాడు .ఫోన్ ఎత్తిన నాకు ఎక్కడున్నావ్ బావ , రోజు ఆఫీస్ కి రావా అంటూ అడిగాడు వాడు,ఇదిగో వస్తున్నారా అంటూ ఫోన్ కట్ చేసి, బైక్ స్టార్ట్ చేసి ఆఫీస్ కి వెళ్ళి పోయాను నేను. 

నాలుగు రోజులు అయ్యాక నా బ్యాంకు ఖాతా నుండి డబ్బులు మొత్తం ఖాళి అయ్యాయి. నేను అవ్వాకయ్యను.పాపం వాళ్ళు నాకు సమయం ఇచ్చినా  నేను  ఉపయోగించుకోలేదు. మోసం లో ఇదో కొత్త తరహ అని అనుకుంటూ పోలిసుల దగ్గరికి పరుగెత్తాను హడావుడిగా……

Related Posts