నవ్వుల పువ్వులు

బాక్సింగ్ బ్రూస్ లీ

బాక్సింగ్ బ్రూస్ లీ

                                           ఒకరోజు బ్రూస్ లీ బాక్సింగ్ శిక్షణ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ముగ్గురు స్నేహితులు ఇలా నవ్వుకుంటూ నిలబడి ఉన్నారు.

“ఏమండీ! ఇంత నవ్వు ఎందుకు?” అని బ్రూస్ లీ అడిగాడు.
వాళ్లలో ఒకడు ,
“సార్! మేము కూడా మీలా ఫైటర్లు అవుదామని బాక్సింగ్ క్లాస్‌లో చేరాం” అన్నాడు.
“అయితే బాగానే ఉంది కదా!” అన్నాడు బ్రూస్ లీ.
మరొకడు నవ్వుతూ,
“మొదటి రోజే కోచ్ పంచ్ కొట్టండి” అన్నాడు. మేము ముగ్గురం కలిసి పంచ్ కొట్టాం. కానీ , బాక్సింగ్ బ్యాగ్ కదలలేదు. మా చేతులే నొప్పితో కదల్లేదు!”
అంతలో మూడోవాడు ,
“అప్పటి నుంచి బాక్సింగ్ నేర్చుకోవడం మానేశాం సార్” అన్నాడు.
బ్రూస్ లీ చిరునవ్వుతో…
“అంటే ఇప్పుడు ఏమి చేస్తున్నారు?” అని అడిగాడు.
వాళ్లు ముగ్గురూ ఒకేసారి,
“బాక్సింగ్ చేయలేకపోయాం. కానీ , నవ్వడం మాత్రం ఛాంపియన్లలా చేస్తున్నాం!” అన్నారు.
అది విని బ్రూస్ లీ కూడా పెద్దగా నవ్వేశాడు.
ఆ రోజు బాక్సింగ్ క్లాస్ కంటే నవ్వుల క్లాస్‌నే ఎక్కువ హిట్ అయింది.

మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *