అక్షరలిపి అంశం
గాంధీ జయంతి
శీర్షిక
బాపూజీ అమర్ రహే.
అహింసనే ఆయుధంగా చేసుకున్నాడు బాపూజీ.
సత్యమేవ జయతే అని నమ్మిన మహాత్ముడు.
శాంతిని బోధించిన
మహానేత ఆయన.
స్వేచ్ఛకు మారుపేరే
మన గాంధీజీ.
విదేశీ వస్త్రాలను
బహిష్కరించమన్నాడు.
రైతు కష్టాలను తీర్చే
ఆలోచన చేసారు.
హిందూ, ముస్లిం భాయి-
భాయి అన్న నేత.
నిజమైన భారతదేశం పల్లెల్లో ఉందన్నారు.
బాలల తాత బాపూజీ
అని కీర్తించబడ్డాడు.
భారతీయులందరికీ
ఆదర్శంగా నిలిచారు.
ప్రేరణకు మారుపేరు
రాష్ట్రపిత గాంధీజీ.
జైలుకు వెళ్లినా
సడలని ధైర్యశాలి.
శుభ్రతే దేశానికి
అవసరం అన్నాడు.
స్వావలంబన అవసరం
అందరికీ తెలియజేసారు.
నాయకుడు అంటే ప్రజల సేవకుడే అని చెప్పారు.
దేశ స్వేచ్ఛ కోసం
పోరాటం చేసాడు.
ఆయన చూపిన మార్గం మనకు ఆదర్శం.
మనిషిలో మంచిని పెంచమని చెప్పాడు. ఆయన జీవితమే మనకొక స్ఫూర్తి.
పనిచేయడంలోనే గౌరవం ఉందన్నారు.
ఆయన ఆలోచనలు మనకు ఆదర్శం.
మనం కూడా ఆయన
మార్గం అనుసరించాలి. అదే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.
జై హింద్.
ఈ రచన నా రచన.
వెంకట భాను ప్రసాద్.