బామ్మ చిలిపి కోరిక

బామ్మని హాస్పిటల్ లో జాయిన్ చేసారని తెలిసి హడావుడిగా బయల్దేరి హైదరాబాదు వెళ్ళాము.  పాపం బామ్మా అంటే మాకు చాల ఇష్టం ,ఎందుకంటే బామ్మా చాల కష్టాలు పడి తన పిల్లల్ని పెంచి పెద్ద చేసింది తాతగారు చనిపోయారు,అయినా అన్ని తనే అయ్యి ,పిల్లలకు కష్టం రాకుండా పెంచింది, 

పెద్ద చేసి,పెళ్ళిళ్ళు చేసింది.అందుకే ఆవిడంటే మా మామయ్యలకు అమ్మకు చాల ఇష్టం ,ప్రాణం కూడా ఇంత వయస్సు వచ్చినా ఆవిడా తన వంట తనే చేసుకుంటుంది.అన్ని పనులు చేస్తుంది,పిల్లలకు భారం కాకుండా, తానింట్లో తను ఉంటుంది,

అలాoటి బామ్మని ఆసుపత్రిలో చేరింది అని తెల్సి,ఆమెకి ఏమి కావొద్దు అని దేవుణ్ణి ప్రార్దిస్తూ కారిడార్లో నిలబడ్డాము అందరం డాక్టర్ గారు వచ్చి ఏమి పరవాలేదు, బి పి కొంచం డౌన్ అయ్యింది అంతే అని చెప్పడం తో మేమంతా ఉపిరి పిల్చుకున్నాం, 

కానీ నాకు మాత్రం ఎక్కడో కొంచం బాధ ,ఎందుకంటే మొన్ననే ఒక సినిమా చూసాను అందులో హీరో తాత కోసం అతని చివరి కోరిక తీర్చడం కోసం ఇండియా కి వస్తాడు, అది గుర్తొచ్చి,నేను హీరో లా మా బామ్మా కోరిక తీర్చాలి అని కంకణం కట్టుకుని,బామ్మా ఇంటికి వచ్చాక తనని అడగాలని అనుకున్నా ..

సాయంత్రమే బామ్మని ఇంటికి తెచ్చాము . రాత్రి మెల్లిగా  బామ్మ పక్కన చేరి మెల్లిగా కబుర్ల లోకి దించి బామ్మ నీకు ఏమైనా తీరని కోరికలు ఉన్నాయా ఉంటె చెప్పు బామ్మా తీరుస్తాను అంటూ అనునయంగా అడిగాను నేను,

మా బామ్మ నన్ను చూస్తూ ఓరి బడవా నాకేం కోరికలు ఉంటాయిరా ,అన్ని తీరిపోయాయి, పిల్లలు వృద్దిలోకి వచ్చారు, పిల్లలకు పిల్లలు కూడా పుట్టారు, సినిమా చూసి ఇలా అడుగూతున్నవా. నాకు తెలుసు సినిమాని నేను కూడా చూసాను లే ,

ఓరి వెధవ నేను ఇప్పుడే ఏమి  పోను లేరా నిన్ను,నీకు పుట్టే ముని మనవాళ్ళని చూసే వరకు నేను ఎక్కడికి వెళ్ళను లేరా  అంది  బామ్మా  , హమ్మ బామ్మ ఏమో అనుకున్నా ,నాకంటే రెండు ఆకులు ఎక్కువే చదివింది అని అనుకున్నా మనసులో,

కానీ అంతలోనె వదిలెయ్యి బామ్మ కానీ చెప్పు నికేమి కోరికలు లెవా అని బలవంతం చేశాను చాలా సేపటి తర్వాత బామ్మ కొంచం దిగి వచ్చి, తన మనసులో ఉన్న కోరికని బయట పెట్టింది.అదేంటో మీరు కూడా వినండి మరి,

బామ్మకు ఎవరి ఇంట్లో అయినా ఒక చిన్న వస్తువు దొంగతనం చెయ్యాలని,వాళ్ళు దాని కోసం వెతుకుతూ ఉంటె ,అది నా దగ్గర ఉందని చెప్పకుండా,వాళ్ళు వస్తువు గురించి ఆందోళన పడుతుంటే వారి అవస్థని చూసి తను లోలోపల నవ్వుకుంటూ ఉండాలనె కోరికను వెలిబుచ్చింది.

పాపం ఇక్కడ కూడా మా బామ్మ తన నిజాయితీని చాటుకుంది వస్తువు వాళ్ళకి అంత ఉపయోగం లేనిదీ అయ్యి ఉండాలి అంట ,అది నిజాయితీ అంటే అని అనిపించింది నాకు.ఇక ఏమి దొంగతనం చెయ్యాలి,ఎవరి ఇంట్లో చెయ్యాలి అని బాగా అలోచించి

మా  బాబాయి  వాళ్ళింట్లో  చేయాలనే  అనుకున్నాం  కానీ   వస్తువు  దొంగిలించాలి  అని తర్జన  భర్జనలు పడ్డాము ఇద్దరం చాలా అనుకున్నాం,ఫోను,పర్సు,బంగారం,కారు కీస్ ,బైకు ఇలా  చాలా  చెప్పాను  నేను  కానీ  అవేవి  మా బామ్మ కు నచ్చలేదు

నాకు విసుగు వచ్చి,నువ్వే చెప్పు బామ్మ అని అన్నాను నేను చిరాకుగా.చివరికి బామ్మ అవేవి కాదు రా నేను మా చిన్నోడి చేతి గడియారం దొంగిలిస్తాను,అది వాడి పదోతరగతి పాస్ అయినప్పుడు నేను కొని ఇచ్చిన దాన్ని వాడెంత బాగా చూసుకుంటూన్నాడో  తెలియాలి

అది దొంగతనం చేస్తా అంటూ తేల్చింది,మరి ఆల్రెడీ అనుకున్నదానివి నా మైండ్ ఎందుకు తిన్నావే అని కొప్పాడ్డను .బామ్మా నవ్వుతూ  చూసి  సరే లేరా  రేపు  పొద్దునే ముహూర్తం  అంది. తెల్లారి ఇద్దరం  కలిసి బాబాయి  గదికి  వెళ్ళాము,

బాబాయి స్నానం చేస్తున్నాడు,గదిలో మేకుకు వేలాడుతూ ఉంది. వాచి నేను ఎవరూ రాకుండా కాపలా కాస్తుంటే మా బామ్మ మెల్లిగా వెళ్ళి దాన్ని కొట్టుకొచ్చింది,మళ్ళి ఇద్దరం ఏమి తెలియనట్లుగా,గదిలోకి వచ్చి కూర్చున్నాం జరగబోయేది తల్చుకుంటూ,కాసేపు అయ్యాక  బాబాయి అరిచిన  అరుపుతో  ఇల్లు  దద్దరిల్లింది.

నా గడియారం ఏమయ్యింది అంటూ అరిచారు.దెబ్బకి అందరూ అక్కడ చేరారు,మాకు తెలియదు, అంటే మాకు తెలియదు అంటూ సమాదానం ఇచ్చారు అందరూ దాదాపు పెద్ద రణరంగమే జరిగింది, సెల్ ఫోన్ లు వచ్చాక గడియారాన్ని ఎవరూ దేకుతారు అనుకున్నా,

కానీ మా బాబాయి మాత్రం పోలిస్ కంప్లైంట్ అంటూ చిందులు వేసారు,ఎవరూ తియ్యక పొతే ఎలా పోయింది అంటూ అరిచి,రంకెలు వేసి నా వైపు చూసారు,మా ఇంట్లో నాకున్న విలువ అదేనండి మరి నాకు భయంతో చెమటలు పట్టి నేను వేలుని బామ్మ వైపు చూపించాను 

అని అందరూ అవ్వాక్కయ్యారు అది చూసి బామ్మ చిరునవ్వు నవ్వుతూ కొంగులో కట్టుకున్న గడియారాన్ని విప్పి చూపించింది.అది చూసిన  అంతా  మా బామ్మా, మనవళ్ళ నిర్వాకానికి ఆశ్చర్య పోయారు,అనక నవ్వుకున్నారు ….

Related Posts