బామ్మ బాబోయ్ 1

బామ్మ బాబోయ్ 1

 

రాత్రి పది గంటలు దాటి పది నిమిషాలు అయ్యింది. మా అపార్ట్మెంట్మో ఎనిమిది కాగానే సద్దు మణుగుతుంది. ఆ రోజు అలాగే అయ్యింది.

 

తొమ్మిది గంటలు కాగానే మా ఇంట్లో కూడా అంతా నిశ్శబ్దంగా మారేది.కానీ మా అమ్మానాన్నలు ఇద్దరు ఎవరో బంధువుల పెళ్లి ఉంటే వెళ్లారు

 

కాబట్టి మా పిల్లలకు సంతోషం ఎందుకంటే రాత్రి టీవీ చూసొచ్చు,అల్లరి చేయొచ్చు అనే ఆశ, దానికి మా అమ్మమ్మ  సపోర్ట్ కూడా మాకు బాగా ఉంది.అమ్మ వంట  చేసి పెట్టి వెళ్ళింది. కానీ అది మేము తినకుండా,బయట నుండి మ్యాగీ,ఫ్రైడ్ నూడుల్స్ తెచ్చుకున్నాం

 

అమ్మమ్మ డబ్బులు ఇవ్వడం తో,అమ్మమ్మ భలే మంచిది అండీ,మా పిల్లల కోరికలు తెలుసుకుని మాకు కావాల్సినవి అన్ని కొని పెడుతుంది.

 

అలా నూడుల్స్, ఫ్రైడ్ రైస్ తినేసి నేను,మా తమ్ముడు, కార్టూన్లు చూసుకుంటూ కూర్చున్నాం,పది గంటలు అయ్యేసరికి మాకు నిద్ర ఆగక అలాగే సోఫా లో పడుకున్నాము.

 

మా అమ్మమ్మ  మమ్మల్ని తీసుకుని వెళ్లి బెడ్రూమ్ లో పడుకోబెట్టింది అనుకుంటా,మాకు మెలకువ లేదు. అర్ధరాత్రి ఏవో మాటలు వినిపించి మెలకువ వచ్చింది.

 

మెల్లిగా బయటకు వచ్చి చూసాను.హల్లో అమ్మమ్మ తో పాటు ఎవరో కొత్త వ్యక్తి తో మాట్లాడుతూ కనిపించాడు.

 

టైం చూసాను ఒంటి గంట అవుతుంది. అమ్మమ్మ ఎవరు ఇతను అని అడిగాను. ఇతనా ఇతను దొంగ అమ్మ అని అంది చాలా క్యాజువల్ గా. హ దొంగ నా దెబ్బకు మత్తు దిగిపోయిoది..

 

భయం వేసి అమ్మమ్మ దగ్గర కూర్చున్నా, భయపడకు తల్లి,ఏమి కాదు.పాపం ఎన్ని రోజులు అయ్యిందో తిని అంటూ కూర్చో బాబు అన్నం తెస్తా అంటూ లోనికి వెళ్లి అన్నం తెచ్చింది.

 

నేను అతన్ని పరీక్షగా చూసాను మాములు ఎత్తు,చామన ఛాయగా, కడుపు లోతుగా,కళ్ళు కర్కశంగా కాకున్నా ఓ మోస్తరు గా ఉన్నాడు. అతని చేతిలో ఒక పెద్ద సంచి నిండుగా ఉంది,లుంగీ మడతల్లో తుప్పు పట్టిన చాకు ఒకటి ఉంది.

 

ఇంతలో అమ్మమ్మ మేము తినకుండా ఉంచిన అన్నం,కురాలుతెచ్చి విస్తట్లో వడ్డించి,తినురా అబ్బి అంది, అతను బాగా ఆకలి మీద ఉన్నట్టుగా గబగబా అన్నాన్ని కలిపి ,ఇంతేసి ముద్దలుగా చేసుకుంటూ మింగుతున్నాడు.

 

అది చూసిన మా తమ్ముడు వింతగా చూస్తూ ఉన్నాడు. వాడెప్పుడు లేచి వచ్చాడో నేను గమనించలేదు.వాడు తింటూ ఉండగానే మా అమ్మమ్మ తన పురాణం మొదలు పెట్టింది,

 

అది చూసి మేము మెల్లిగా అక్కడ నుండి  జారుకుందాం అని అనుకున్నాo,కానీ దొంగోడు ఎలా ఉంటాడో చూడాలన్న ఉత్సహం తో లోపలికి వెళ్లలేక పోయాను . మా అమ్మమ్మ తన పురాణం వినిపించసాగింది.

 

పురాణం అంటే ఏంటో అనుకునేరు తాను ఎన్నేళ్ల కు పెళ్లి అయ్యిందో,తన కష్టాలు,తన స్నేహితులు,తన బంధువుల తో ఆటలు,ఆ తర్వాత తాత చనిపోతే తానేన్ని కష్టాలు పడి

 

మా అమ్మవాళ్లను పెంచిందో, చివరికి ఎలా పెళ్లిళ్లు చేసిందో,మేము పుట్టేటప్పుడు ఎంత కష్టం అయ్యిందో,

 

ఇలా కథలు,కథలుగా చెప్తుంది.ఇక మొదలు పెట్టింది అమ్మమ్మ ఒంటిగంటకు మొదలు పెట్టిన పురాణం తెల్లారి ఏడు గంటలు అవుతున్నా అయిపోలేదు.ఇంతలో పాల అబ్బాయి అమ్మా పాలు అంటూ పిలవడం తో ,

 

అది కాసేపు అపి వెళ్లి పాలు తెచ్చి, అదిరా అబ్బాయి నా కష్టాలు ఆ పగ వాడికి కూడా రాకూడదు. అయినా దొంగతనం మహా పాపం అంటూ పురాణాల్లో దానికి యముడు వేసే శిక్ష లు ఏంటో కూడా వివరించి చెప్తుంది.

 

మేము లేచి,బ్రష్లు,స్నానాలు చేసి వచ్చాము. ఇంతలో ,పాపం అతను అలాగే రెప్ప వేయకుండా వింటూ కూర్చున్నాడు. అంతా చెప్పేసి హ

 

చూడరా బాబు వీళ్ల బడికి టైం అయ్యింది గాని నేను వంట చెయ్యాలి మరో సారి వసై ఇంకా వివరంగా చెప్తాను అంది అమ్మమ్మ,

 

దానికా దొంగ హమ్మో బాబోయి ఇంకో సారి ఈ వీధిలోకి రాను,వచ్చినా ఇలా మీ ఇంటి ముందుకు రాను, అసలు దొంగతనమే చెయ్యను నా ఖర్మ కాలి ఇలా నీ చేతిలో పడ్డాను తల్లో,

 

నన్ను ఇకనైనా వదిలెయ్యి అంటూ తాను తెచ్చిన డబ్బు అక్కడే పడేసి,పరుగెత్తాడు బయటకు….,

 

ఒక దొంగకు కూడా తన పురాణం  వినిపించి  డబ్బు లాగిన అమ్మమ్మ ని చూసి మేము బిత్తరపోయాం, ఆ డబ్బు ఏమైంది అని మాత్రం అడగకండి…

Related Posts