అక్షర లిపి రచయితల ( కథ…)
తేదీ: బుధవారం
అంశం: చిత్ర కవిత
రచన: కె.కె.తాయారు
బాల్యం
అసుర సంధ్యలు
ముసురుకున్నవి
నిండుసూర్యుడు
జారిపోయెను,
ఆటలాడెను చిన్నిపాప
కాగితంపు పడవల
తెలిసి తెలియని
వయస్సున, కోటి
సంపదలు, దైవం
ఉట్టిపడే తరుణాన
జీవితం అపురూపం
ఆనందమయం ఎల్లలు
లేని కాలం, చల్లగ నడయాడు
దశల మార్పిడి దిశలను చూపు
కష్ట కాలాలు కడుపు నింపు
తెలిసిన జీవితం పక పక నవ్వు
క్షణాలు క్షణాలు చేరవు
నిను , తీపి గురుతులే
మిగులును సుమీ నీకు
అవియే ఆనందదాయకాలు !!!
ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
__,,కె.కె.తాయారు