బాల్యం, నువ్వెళ్ళి పోయాక…

శీర్షిక
గతించిపోయిన బాల్యం

బాల్యం, నువ్వెళ్ళి పోయాక
నా సంతోషం మాయమయి
పోయింది. బాధ్యతలు
భుజాలపైకి ఎక్కాయి.
బాల్యమితృలేమో దూరం అయిపోయారు. వారు మళ్ళీ
కలిసే అవకాశం కూడా లేదేమో.
వారితో ఆడిన ఆటలే నేడు నాకు మధుర జ్ఞాపకాలు.
ఏ బాదరబందీ లేని ఆ బాల్యం
మళ్ళీ తిరిగి రాదనే విషయం
అప్పుడు తెలియదు. లేకపోతే
ఇంకా అద్భుతంగా గడిపే ప్రయత్నం చేసేవాణ్ణేమో
అప్పుడేమో తల్లిదండ్రులు, గురువులు మార్గదర్శకంగా
ఉండేవారు. ఇప్పుడేమో అలా
మార్గదర్శనం చూపే వారే లేకుండా పోయారు. ఒంటరి
బ్రతుకయిపోయింది. గతకాలం
గొప్పగా గడిచింది. నేటి కాలం
కష్టాల పాలయిపోయింది.
బాల్యంలో జరిగిన ఆ మధుర
సంఘటనలు నెమరేసుకుంటూ
వర్తమానాన్ని ఆనందంగా
గడపటమే మనం చేయగలిగింది.

ఈ రచన నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను.
వెంకట భానుప్రసాద్ చలసాని.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *