బాషా పువ్వులు చివరి భాగం A Selfish Man 6

బాషా పువ్వులు చివరి భాగం

బాషా పువ్వులు చివరి భాగం
బాషా పువ్వులు చివరి భాగం

ఫకీర్ చనిపోవడం బాషకు చాలా బాధగా అనిపించింది ఏదో ఒకలా డబ్బు సంపాదించడం నేర్చుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు మరి ఆ నిర్ణయం ఏంటో మనమిప్పుడు తెలుసుకుందాం.

ఫకీరు చనిపోయిన బాధలో ఉండగానే ఇంతలోనే తాగిన తండ్రికి రోడ్ దాటుతూ ఉండగా లారీ గుద్దేయడం వల్ల కాలు బాగా దెబ్బతింది దాంతో మంచానికి పరిమితం అయ్యాడు..తండ్రి మందులకు కూడా డబ్బు అవసరం ఉండడం తో చాలాఇబ్బందిగామారింది.

******
పువ్వులు అమ్మా పువ్వులు అంటూ బాషా ఎప్పటిలా కాలనీ లోకి వెళ్ళాడు సైకిల్ మీద అయితే అలా వెళ్తున్న బాషాను లక్ష్మి గారు ఆపేశారు ఎలా ఇస్తున్నావు చామంతి పూలు అడిగింది లక్ష్మి పది కి చేటాకు అమ్మా అన్నాడు.

బాషా పువ్వులు ఎరుతున్న లక్ష్మి ఒరేయి ఈ వీధి అవతల రెండో ఇల్లు మా అన్నయ్య వాళ్ళది అక్కడికి వెళ్లి డబ్బులు ఇచ్చిరారా అంది జాకెట్లోంచి డబ్బులు తీసి అటూ ఇటు దొంగతనంగా చూస్తూ అమ్మా ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్ధం కావడం లేదు అన్నాడు.

బాషా చూడు బాబు ఇందులో అర్దం కాక పోవడానికి ఏముంది రా నేను ఇచ్చే డబ్బులు మా అన్నయ్య గారికి ఇచ్చేసి రా తర్వాత నేను మా అన్నయ్యకు ఫోన్ చేస్తా నువ్వు అలా ఇచ్చి వచ్చినందుకు నీకు ఇదిగో వంద రూపాయలు ఇస్తున్నా అంది ఇంకో వంద తీసి ఇస్తూ..

పది నిమిషాల పనికి వంద నా బాషా కళ్ళు చేమక్కు మన్నాయి . అయినా కూడా మీరే వెళ్ళొచ్చు కాదమ్మా అన్నాడు బాషా హా నేను వెళ్లడానికి నా మొగుడు ఇంట్లోనే చచ్చాడు అందుకే నిన్ను అడుగుతున్నా అంది లక్ష్మి ఆ మాట అనగానే సరే ఇవ్వండి అన్నాడు బాషా . జాకెట్లోనుంచి డబ్బుల కవర్ తీసి ఇచ్చింది లక్ష్మి.

దాదాపు యాభై వేలు ఉంటాయి అన్ని డబ్బులు చూసేసరికి బాషా కళ్ళు ఆశ్చర్యం తో పెద్దవి అయ్యాయి డబ్బులు అంటే ఏ రెండో మూడో వేలు అనుకున్నాడు కానీ ఇంత పెద్ద మొత్తం అని అనుకోలేదు ఏరా ఆలోచిస్తున్నావు అంది.

అమ్మ మరి వంద సరిపోవు అనగానే సరే ఇంకో వంద వచ్చాక ఇస్తాలే ముందు వెళ్ళు అంది సరే అని గబగబా సైకిల్ మీదున్న బుట్ట తీసి పక్కన పెట్టి సైకిల్ ఎక్కి వెళ్ళాడు అంతకు ముందు లక్ష్మీ గారింట్లో వాళ్ళ అన్నయ్యను చూసాడు కాబట్టి గుర్తుంది అక్కడికి వెళ్లగానే అతను ఫోన్ లో మాట్లాడుతూ కనిపించాడు బయటే ఎదురుచూస్తున్నాడు.

వెంటనే కవర్ తీసి అతని చేతిలో పెట్టాడు అది తీసుకుని జేబులో పెట్టుకుంటు ఇంకో చేతిలో ఉన్న వంద రూపాయలు ఇచ్చాడు బాషాకు దాంతో అవి తీసుకుని వెనక్కి మరలాడు సైకిల్ మీద ఉన్న బాషాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది దొంగతనంగా తన పుట్టింటికి డబ్బు పంపుతున్న లక్ష్మి గారికి సహాయం చేస్తే మూడు వందలు ఒక్క పది నిమిషాల్లోనే తాను సంపాదించడం.

తనకే నమ్మకం కలగడం లేదు అంటే దొంగ పనులు చెస్తే డబ్బు సంపాదించడం చాలా తేలిక అని తెలిసిపోయింది.

అలా వెళ్లిన బాషాను లక్ష్మి గారు చాలా సంతోషం బాబు మళ్లీ ఎప్పుడైనా ఇలాగే నాకు సహాయం చెయ్యాలి సరేనా అంటూ రెండు వందలు చేతిలో పెట్టింది. అలాగే అని వెళ్తున్నా బాషాను పంతులు గారు పిలిచారు ఎంటి పంతులు గారు అని దగ్గరగా వెళ్ళాడు బాషా ఒరేయి బాషా ఇదిగో ఈ అయిదు వందల తీసుకోరా అనగానే ఎందుకు పంతులు అన్నాడు బాషా.

ఏం లేదురా నా మందు అయిపోయింది వెళ్లి తీసుకు వస్తావు  అని ఇస్తున్నా అన్నారు పంతులు గారు చిట్టి ఇవ్వండి ఇలా వెళ్లి అలా వస్తాను అన్నాడు బాషా. మెడికల్ షాప్ కు వెళ్లాలనుకునే ఒరేయి ఇది మెడికల్ మందులు కాదు రా ఆ వీధి చివరన ఉన్న వైన్స్ లో నా బ్రాండ్ మందు తీసుకుని రా అది కూడా ఎవరికీ తెలియకుండా అనగానే బాషా బిత్తర పోయారు ఎంతో గౌరవంగా చూసే పంతులు గారు ఇలా తాగుతారని తెలిసి నివ్వెర పోయారు.

ఇంకా నమ్మకం కలగక మీరు తాగుతారా అనగానే ఏరా నేను మనిషిని కానా అయినా అవ్వన్నీ నీకు అనవసరం చెప్పింది చేసి డబ్బు తీసుకో సరేనా అంటూ బ్రాండ్ పేరు చెప్పి వెయ్యి రూపాయలు ఇస్తూ ఇదిగో ఇందులో మిగిలినవి నీకే అన్నారు పంతులు గారు అయితే ఎవరికీ తెలియకుండా తేవాలి ఎవరికీ తెలియకుండా ఇవ్వాలి అంటూ షరతు పెట్టాడు.

బాషా పువ్వులు చివరి భాగం

బాషా పువ్వులు చివరి భాగం
బాషా పువ్వులు చివరి భాగం

అలాగే పంతులు గారు అంటూ గబగబా వెళ్ళి వీధి చివర ఉన్న వైన్స్ లోకి వెళ్ళిన బాషా డబ్బులు ఇవ్వగానే పెద్ద బ్రాండ్ సీసాను కవర్ లో పెట్టీ ఇచ్చాడు షాప్ అతను దాన్ని తన పువ్వుల సంచిలో పెట్టుకున్నాడు బాషా.

దాన్ని జాగ్రత్తగా తీసుకుని వచ్ఛా డు ఇంట్లోకి వెళ్తున్న సమయంలో ఏంట్రా అది అంటూ లోపలి నుండి వచ్చింది పూజారి గారి భార్య అనంత, అమ్మా అది అది అనగానే అనంత నేనే రమ్మన్నాను అంటూ మేడ పైకి రారా అంటూ పిలిచాడు పంతులు గారు అవునా సరే సరే అంటూ తిరిగి లోపలికి వెళ్ళింది అనంత ఆమె కొబ్బరి కాయలు అమ్మగా వచ్చిన డబ్బు అనుకుంది. ఇంకేదో అనుకుంది.

కానీ భర్త తాగుతాడు అని తెలియదు ఆమెకు, ఇక బాషా వెళ్లి పంతులు గారికి సీసా ఇచ్చాడు దాన్ని తీసుకుని అదే సంచిలో కొన్ని బియ్యం ,కూరగాయలు ఇచ్చాడు.

అవి తీసుకుని బాషా ఇంటికి సంతోషంగా వచ్చాడు ఇక వచ్చిన ఎనిమిది వందలతో తండ్రికి మంచి మందులు అక్కలకు ఆ రోజు కడుపు నిండా అన్నం పెట్టాడు. అందరూ పంతులు గారు ఇచ్చిన బియ్యం కూరగాయలతో కడుపు నిండా తిన్నారు. ఇక తెల్లారి మళ్లీ పువ్వులు అమ్ముతూ వెళ్ళాడు. వీధి మలుపులో ఉన్న ఇంట్లోంచి ఒకాయన కాలనీ ప్రసిడెంట్ గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అతను బాషా దగ్గరికి వచ్చి ఒరేయి బాషా ఒక్కసారి ఇలా రారా అంటూ పిలిచాడు.

ఏంటి సార్ అంటూ వెళ్ళాడు ఏం లేదురా ఇదిగో ఈ లెటర్ తీసుకుని వెళ్లి ప్రసిడెంట్ గారి భార్యకు ఇచ్చేసి ఆమె ఇచ్చేది తీసుకుని రా అన్నాడు సార్ ఫోన్ చేయవచ్చు కదా అన్నాడు బాషా అబ్బో మాకు తెలియదా రా ఫోన్ లో అయితే ఎవరైనా చూస్తాడు ఇలా అయితే కాగితం చింపేసి కాల్చేస్తే అయిపోతుంది గా కాకపోతే ఈ రోజు నేను లేవడం లేటయ్యింది.

అందుకే తను వెళ్లిపోయింది కాబట్టి నీకు ఇచ్చాను సరే ఇచ్చేసి రాగానే సైకిల్ తిప్పుకుని మా పూలు అంటూ వెళ్ళాడు ఆమె ఇంటి ముందుకు వెళ్లగానే ఆమె బయటకు వచ్చింది గబగబా దాంతో సార్ ఇచ్చారు అంటూ లెటర్ ఇవ్వగానే ఆమె జాకెట్ లోంచి తీసి లెటర్ తో పాటు రెండు వందల నోటు ఇచ్చింది అవి తీసుకుని జేబులో పెట్టుకొని మళ్లీ వెనక్కి వచ్చాడు.

సార్ కు లెటర్ ఇవ్వడం తో అతను వెయ్యి రూపాయలు ఇచ్చి ఒరేయి ఎవరికైనా చెప్పావు నీ తల పగులుతుంది అనగానే సార్ మీరు భలే వారు సార్ ఎందుకు చెప్తాను ఏంటి అంటూ సైకిల్ ఎక్కి తుర్రుమన్నాడు బాషా ఒక్క రోజే పదకొండు వందల రావడం తో తబ్బిబ్బు అయిపోయాడు.

ఇక అప్పటినుండి ఇలాంటి పనులు చేస్తూ డబ్బులు తీసుకుంటూ తన కుటుంబాన్ని నెట్టుకొస్తన్నాడు..

అయితే ఎన్ని రోజులు ఇలా వాళ్ళు ఇస్తేనే తీసుకోవడం వాళ్లకు ఏం పని లేకపోతే తనను పిలవరు తనకు డబ్బు రాదు మరేం చేయాలి దీనికోసం అని అనుకుంటున్నా సమయం లో పంతులు గారి కొడుకు పిలిచి తన లవర్ కు టాబ్లెట్స్ ఇచ్చి రమ్మని చెప్పాడు అతని ఫోన్ ను చూసిన బాషాకు తనకు అలాంటి ఫోన్ కావాలని అనిపించి అతను డబ్బులు ఇవ్వబోతోంది.

తే అన్నా నాకు పైసల వద్దన్నా నాకు నీలాంటి ఫోన్ కావాలి అన్నాడు బాషా ఒరిని ఎందుకు రా నికు ఫోన్ అయినా ఇది పదివేలు ఉంటది అని సరే తో నాది ఒక పాత ఫోన్ ఉంది కొత్త మోడల్ వచ్చిందని దాన్ని పక్కన పెట్టాను అది ఇస్తలే అంటూ దాన్ని ఇచ్చేశాడు పంతులు గారి అబ్బాయి. ఫోన్ ఇస్తూ ఆరేయి మంచి మంచి వీడియోలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పాడు.

అందులో తన పాత సిం వేసుకుని అంతా చూసాడు బాషా. అందులో సినిమాల వీడియోలు అన్ని పోర్న్ వీడియోలు ఉన్నాయి అయితే అవి చూసిన బాషాకు ఒక ఐడియా వచ్చింది వెంటనే దాన్ని అమలులో పెట్టడానికి ఇంకెవరైనా ఉన్నారా అంటూ వెతకడం తో రఫీ కనిపించాడు.

వాడి కళ్ళకు ఆపద్భాందవుడు లా అయితే వాడికి ఫోన్ ఎలా వాడలో బాగా ట్రైనింగ్ ఇచ్చాడు ఆ తర్వాత ఒక మంచి ముహూర్తం చూసుకుని ఓడిపోయిన ప్రసిడెంట్ కామ పురాణం తో పాటూ పంతులు గారి భాగోతం కూడా రికార్డ్ చేశాడు

దాన్ని రెండు రోజుల తర్వాత దాన్ని మొదట పంతులు గారికి పంపాడు అది చూడగానే పంతులు గారు దిమ్మతిరిగి ఫోన్ చేసి ఏం కావాలంటూ అడిగేసరికి బాషా అయిదువేల రూపాయలు డిమాండ్ చేశాడు దాంతో పంతులుగారు ఇవ్వడానికి ఒప్పుకుని ఇక ఎక్కడ ఇవ్వాలంటూ అడిగే సరికి పాత బిల్డింగ్ ఒకటి కనిపించి అక్క పెట్టమని చెప్పడం తో ఆయన అక్కడ పెటేసాడు ఇక పంతులు గారి ప్లాన్ వర్క్ అవుట్ కావడంతో ఇక అందర్నీ బెదిరించడం మొదలు పెట్టాడు బాషా.

ఈ వచ్చిన డబ్బు తో కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్ర పోవడం తో మంచిగా తయారయ్యాడు బాషా అలాగే అక్కలకు కూడా మంచి సంభందాలు చూసాడు. తండ్రికి మంచి వైద్యం చేయించి నాలుగు బజార్ల దగ్గర పువ్వుల అంగడి పెట్టించాడు దాంతో అటూ పువ్వులు అమ్ముతూ ఇటు వీళ్లను బెదిరించి వచ్చిన డబ్బుతో అక్కల పెళ్ళిళ్ళు చేశాడు.

బాషా పువ్వులు చివరి భాగం

బాషా పువ్వులు చివరి భాగం
బాషా పువ్వులు చివరి భాగం

ఈ మధ్యనే కొడుకు కష్టపడి డబ్బు సంపాదించడం తో తల్లి కూడా సంతోషించింది. ఇక బాషా ఇలా అందరితో బాగుంటునే వాళ్ళకు పనుక్లు చేస్తూ వాటిని వీడియోలు తీస్తూ డబ్బు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు వసూలు చేయడం మొదలు పెట్టాడు బాషా..

కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా కొన్ని రోజులు బాగున్నా కొన్ని రోజులు చీకటి గా ఉంటుంది కదా అలాగే బాషకు కూడా చీకటి రోజులు మొదలయ్యాయి.
***
అయితే బాషా ఇలా చేస్తూ ముందు వందల్లో డబ్బు అడిగితే ఆ తర్వాత వేలు అడగడం మొదలు పెట్టాడు అంటే అయిదు నుండి పది పదిహేను అంటూ అడగడం మొదలు పెట్టడం తో అందరికీ తాము చేస్తున్న పనులు తమ ఆనందం కోసం చేస్తారు కాని అటు తిన్నది కాకుండా తాగింది కాకుండా మధ్యలో ఎవడికో ఇవ్వడం ఎందుకని అనుకుంటూ అసలు తమ పనులు, బలహీనతలు తెలిసిన వాడు.

ఎవడో వాడేందుకు తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఎవడో తెలుసుకోవాలని అనుకున్నారు అయితే ముందుగా పంతులుగారు తన విషయం మొత్తం తెలిసిన. ఓడిపోయిన ప్రసిడెంట్ ముందు చెప్పు బోరుమనడం తో అతను కూడా తన విషయాన్ని అంతా చెప్పుకున్నాడు పంతులు గారి తో దాంతో వాళ్ళిద్దరూ కలిసి కాలనీ వాళ్లందరికీ ఫోన్ లో ఒక మెసేజ్ పెట్టారు అదేంటంటే ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి తమ బలహీనత లు గుర్తించి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.

దీనివల్ల మన డబ్బులు వృధాగా అవుతున్నాయి అవే డబ్బులు ఉంటే మనం కాలనీలో ఇంకేదైనా చేసుకోవచ్చు బాధితులు ఎవరైనా ఉంటే కమిటీ హలు దగ్గరికి రండి అనేదే ఆ మెసేజ్ సారాంశం అది చూసిన కొందరు బాషా చేతిలో బలైనవరి అందరూ కమిటీ హాలు దగ్గరికి వచ్చేసరికి వాళ్లను చూసి పంతులు గారు ఆశ్చర్య పోయారు అయితే కలని లోని సగం మంది వరకు బాషా బాధితులు వాపోతున్నారు మాకు ఇలా జరిగిందని బయటకు వచ్చారు.

ఇక దాంతో అందరూ అసలు తమను బ్లక్ మెయిల్ చేస్తున్నది ఎవరో తెలుసుకోవాలని అనిపించింది అదే సమయం లో బాషా పంతులు గారికి ఫోన్ చేయడం డబ్బులు అడగడం తో అక్కడే ఉన్న రమణ. ఆ గొంతు విని ఇది బాషా గాడి గొంతని గుర్తు పట్టడం తో అయ్యాక ఇది బాధ గాడు అన్నాడు.

అందరితో ఆ మాట వినగానే మాట్లాడుతున్నా అందరూ సైలేoటు గా మారారు అవును ఆ ఏంటి బాషా నా అయ్యో ఇన్ని రోజులు బాషా గాడు ఇలా చేస్తాడు అనే ఆలోచన మనకు రాలేదు మనలో ఒకడిగా ఉన్న బాషా ఇలా మారిపోయాడు అంటే నమశక్యం కాకుండా ఉంది.

ఇక రమణ మాత్రం కావాలంటే వాడు ఎవడో మీకు ఇప్పుడే చూపిస్తాను రండి పంతులు గారు మీరు ఫోన్ చేసి రమ్మని చెప్పండి అనగానే సరే అని పంతులు గారు ఫోన్ చేయడం రమ్మని చెప్పడం తో బాషా అక్కడికి వచ్చాడు.

అయితే అంతా చాటుగా ఉండి బాషా ను చూసారు కానీ బాషా మాత్రం వాళ్ళను గమనించలేదు. ఇక బాషాను చూడగానే వాళ్ళకు కోపం కట్టలు తెంచుకుని అందరూ ఒకేసారిగా వెళ్ళి వాడిని పట్టుకున్నారు.

దాంతో బాషా చాలా భయపడి పోయి అయ్యా నన్ను వదిలేయండి వదలండి అంటూ గింజుకుoటున్నా వాడిని కమిటి హాలు దగ్గరకు తీసుకుని వచ్చారు.

ఇక అక్కడ వాడిని కట్టేసి ఏరా మా కాలనిలోకి ఎదో పాపం అని రానిచ్చి నీ దగ్గర పులు కొంటుంటే ఏదో బ్రతుకుతావు అనీ అనుకుంటే నువ్వు మాకే జలక్ ఇస్తావా మమల్నే బ్లాక్ మెయిల్ చేస్తావా అయినా నీకు మేము మా పనులు చేయించుకుంటుంటే ఎదో ఇచ్చారు కదా అని తీసుకోకుండా ఉన్న దానితో సంతృప్తి పడకుండా మమల్ని టార్గెట్ చేస్తావా నీకిదెం బుద్ది రా ఏదో పాపం అని నిన్ను రానిస్తే మా కొంపలు ముంచుతావా అంటూ వాడి దగ్గరున్న ఫోన్ తీసుకుని సిమ్ తీసి విరగ్గొట్టి, వీడియోలన్ని తీసేశారు.

ఫోన్ కూడా గుంజుకున్నారు ఇప్పుడు నిన్ను పోలీసులకు పట్టిస్తే నీ గతేం కావాలిరా అనగానే అందరూ అవును పట్టించాలి పట్టించాలి అన్నాడు ఏక కంఠం తో అయితే ఆ మాట వినగానే బాషా కు తన కళ్ళ ముందు ఇద్దరు అక్కలు,తల్లి,మంచంలో ఉన్న తండ్రి అంతా కళ్ళముందు కనిపించడం తో, అయ్యా మీకు దండం పెడతా బుద్ధి తక్కువయ్యి ఇలా చేసాను మీ కాళ్ళు పట్టుకుంటా అంత పని చేయకండి, మీరు నన్ను పోలీసులకు పట్టిస్తే నా తల్లి అక్కలు సచ్చిపోతారు దయచేసి నన్ను పట్టించకండి అంటూ వేడుకున్నాడు.

అది విన్న పంతులుగారి భార్య పాపం తల్లి, అక్కలు ఉన్నారు అంటున్నాడు పాపం వదిలేయండి అంది జాలిగా చూస్తూ,హ పాపం అని అనుకుంటేనే దోషం వచ్చిందే ఇదిగో ఇలా చేసాడు మళ్ళి చేయడు అని నమ్మకం ఏంటి అనగానే బాషా అందుకుని అయ్యా అయ్యా నేను ఇక్కడ ఉండనే ఉండను నా కుటుంబాన్ని తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోతాను దయచేసి వదిలేయండి అన్నాడు.

బాషా మరి నువ్వు అన్నది నిజమే కదా మళ్ళి ఇటూ వైపు రావద్దు వచ్చావో చచ్చావే మా చేతిలో అనగానే రానయ్యా రాను నిజంగా మా అమ్మ మీద ఒట్టు అసలు ఈ ఊర్లోనే ఉండను అని అనగానే సరే మొదటి తప్పు అని నీ తల్లి మొహం, అక్కల మొహం చూసి వదిలేస్తున్నాం ఇక వెళ్ళిపో ఈ ఊర్లో కనిపించావో జాగ్రత్త అంటూ వాడి కట్లు విప్పడం తో బాషా మెల్లిగా నడుస్తూ వెళ్ళిపోయాడు అక్కడి నుండే కాదు ఆ ఊర్లోనుండే వెళ్ళిపోయాడు..

ఇలాంటి వాళ్ళు ఉన్నదేదో సంపదిoచుకోకుండా ఇదిగో అత్యాశకు వెళ్తే ఇలాగె జరుగుతుంది.

అందుకే ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అత్యాశ పడితే అలాగే ఎలాగో వాళ్ళ బలహీనతలు తెలుసు కదా అని వాళ్ళ తో ఆడుకుంటే చివరికి అందరూ ఒక్కటయ్యి ఇలా జరుగుతుంది.

ఇక్కడితో ఈ బాషా పువ్వులు అయిపోయింది..

కానీ ఇది రాసిన ఉద్దేశ్యం వేరు ఇది చదివిన కొందరికి అది అర్ధం అయ్యి ఉంటుంది మీ బలహీనతలతో ఎవరైనా ఆడుకున్నారా ఆడుకున్న వాళ్ళు ఉండే ఉంటారు కదా అయితే అప్పుడు మీరేం చేసారో నాకు కామెంట్స్ రూపం లో చెప్పండి.  సెలవ్

Related Posts